Crude palm oil
-
ఎట్టకేలకు పెరిగిన ఆయిల్‌పామ్ ధర
సాక్షి, అమరావతి: క్రూడ్ పామాయిల్(సీపీవో)పై కేంద్రం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల ప్రభావంతో దేశీయంగా ఆయిల్‌పామ్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.13,950 ఉన్న తాజా ఆయిల్ పామ్ గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్ను ధర రూ.19,040కి పెరిగింది. సీజన్‌కు ముందుగానే ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో)ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీ కంటే మంచి ధరను తెలంగాణ రైతులు పొందగలుగుతున్నారు.దిగుమతి సుంకం పునరుద్ధరణతో..ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయంగా పెరిగిన వంటనూనె ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా సీపీవోపై 49 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 2022లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్స్ ధరలు టన్ను రూ.77వేల దిగువకు పడిపోయాయి. ఫలితంగా టన్ను రూ.23,635 నుంచి గతేడాది అక్టోబర్‌లో రూ.12,100కు పడిపోయింది.వయబిలిటీ ధరను సవరించడంతో పాటు క్రూడ్ పామ్ ఆయిల్(సీపీఓ)పై దిగుమతి సుంకాలను పునరుద్ధరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో క్రూడ్ ఆయిల్స్‌పై 20 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించడంతో పాటు సోయాపై 5.5 శాతం నుంచి 27.50 శాతం, రిఫైన్డ్ ఆయిల్స్‌పై 13.75 శాతం నుంచి 35.75 శాతానికి దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ ధరల ప్రభావందీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు టన్ను రూ.1.25 లక్షలకు పెరిగింది. ఫలితంగా దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతూ వచ్చాయి. అడ్‌హక్ కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని రైతులకు టన్ను రూ.19,040 చొప్పున ధర లభిస్తోంది. కాగా తెలంగాణాæ రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభంలోనే ఓఈఆర్ను ప్రకటించడంతో టన్ను రూ.19,150 చొప్పున ధర లభిస్తోంది. గడిచిన ఐదేళ్లు మాదిరిగానే 2024–25 సంవత్సరానికి కూడా ఓఈఆర్ ప్రకటించాలని ఆయిల్‌పామ్ రైతులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓఈఆర్ ప్రకటనలో జరుగుతున్న జాప్యం రానున్న ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఓఈఆర్ ప్రకటిస్తే రైతులకు మరింత మేలుదిగుమతి సుంకం పునరుద్ధరణ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ప్రభావంతో దేశీయంగా పామాయిల్ సేకరణ ధరలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం రూ.13,950 ఉన్న టన్ను గెలల ధర ప్రస్తుతం రూ.19 వేలకు పైగా పలుకుతోంది. మరింత పెరిగే అవకాశం కూడా కన్పిస్తోంది. గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఓఈఆర్ ప్రకటిస్తే ఆయిల్‌పామ్ రైతులకు మేలు కలుగుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
ఆయిల్‌పామ్ రైతుల ఖుషీ
సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్ పామాయిల్ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌పామ్ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 45 శాతం మంది పామాయిల్‌నే వంటనూనెగా వినియోగిస్తుండగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది స్వల్పమే. దేశీయ అవసరాలు తీర్చేందుకు నెలకు సుమారు 6,84,000 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 2022కు ముందు క్రూడ్ పామాయిల్‌పై 49 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో ధరలు పడిపోయాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చి0ది. సాగు, దిగుబడుల్లో నంబర్ వన్‌గా ఎదిగిన ఏపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడచిన ఐదేళ్లలో ఆయిల్‌పామ్ సాగు, దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానం సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. క్రమం తప్పకుండా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో(ఓఈఆర్)ను ప్రకటించడంతో ఓ దశలో ఫ్రెష్ ఫ్రూట్ బెంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్ను రూ.24 వేల వరకు పొందిన ఆయిల్‌పామ్ రైతులు.. 2022లో దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాగుదారులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఉప ఉత్పత్తుల (గింజల) విలువను చేరుస్తూ వయబిలిటీ ధరను సవరిస్తూ రైతుకు లాభదాయకమైన ధరను ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ ఆయిల్‌పామ్ రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి బాసటగా నిలిచిన వైఎస్ జగన్ పలుమార్లు లేఖలు రాయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘ ప్రతినిధులు కలిసి కేంద్రం ఆదుకోకపోతే ఆయిల్‌పామ్ సాగుదారులు సంక్షోభంలో కూరుకుపోతారనే విషయాన్ని వివరించారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి, ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన ఫలించడంతో ఎట్టకేలకు సీపీవోపై దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టన్ను రూ.13,950 పలుకుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో టన్ను రూ.16 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం రూ.20 వేలు ఉండాల్సిందే పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో టన్నుకు రూ.20 వేలు వస్తే కానీ ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. దిగుమతి సుంకం పునరుద్ధరించిన కేంద్రం వయబిలిటీ ధరను కూడా సవరించి, డైనమిక్ డ్యూటీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దిగుమతి సుంకాన్ని పునరుద్దరించిన కేంద్రానికి రుణపడి ఉంటాం. – బొబ్బ వీరరాఘవరావు, అధ్యక్షుడు, ఏపీ ఆయిల్‌పామ్ రైతుల సంక్షేమ సంఘంఆయిల్పామ్ రైతులకు ఊరట కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభంలో ఉన్న ఆయిల్‌పామ్ రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. రైతు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేందుకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయిల్‌పామ్ రైతుల తరఫున కృతజ్ఞతలు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధించడం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు మరింత విస్తరించేందుకు దోహద పడుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం -
బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెలు, బంగారం, వెండి బేస్ దిగుమతి రేట్లపై సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ బుధవారం ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు నేటి నుంచే (జూన్16) అమలులోకి వచ్చాయి. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగా దిగుమతిదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని కోత పెట్టింది. మరోవైపు ఇతర వాటి బేస్ దిగుమతి ధరలు మాత్రం పెరిగాయి ముఖ్యంగా క్రూడ్ పామోలిన్, ఆర్బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు మాత్రం పెరిగాయి. క్రూడ్ పామ్ ఆయిల్ బేస్ దిగుమతి ధర 1625 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా బీన్ ఆయిల్ రేటు 1866 డాలర్ల నుంచి 1831 డాలర్లకు తగ్గింది. గోల్డ్ బేస్ దిగుమతి ధర 597 డాలర్ల నుంచి 585 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ బేస్ దిగుమతి ధర 721 డాలర్ల నుంచి 695 డాలర్లకు తగ్గింది. మరోవైపు ఆర్బీడీ పామ్ ఆయిల్ రేటు 1733 డాలర్ల నుంచి 1757 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ బేస్ దిగుమతి రేటు 1679 డాలర్ల నుంచి 1689 డాలర్లకు ఎగసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారు ఇండియా గత నెలలో 2 మిలియన్ టన్నుల సోయాయిల్‌ను సుంకం రహిత దిగుమతులకు అనుమతించింది. 2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్ దిగుమతికి ఇది వర్తిస్తుంది. వెండి, బంగారం మినహా బేస్ ధరలు ప్రతి కమోడిటీకి టన్నుకు డాలర్ చొప్పున ఉంటుంది. గోల్డ్ టారిఫ్ 10 గ్రాములకు ఒక డాలర్, అలాగే వెండికి కేజీకి డాలర్‌గా ఉంటుంది. కాగా దేశంలో గురువారం బంగారం ధరలు క్షీణించాయి. పది గ్రాముల పసిడి రూ. 270 పడిపోగా, కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. -
సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్.. దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు
సామాన్యులకు ఊరటను కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలను నియంత్రిచడంతో పాటుగా, దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలకు మద్దతును అందిస్తోందని కేంద్రం పేర్కొంది. 8.25 శాతం నుంచి.. కేంద్ర ప్రభుత్వం శనివారం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. . ఇక ముడి పామాయిల్ (CPO)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం శూన్యం. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్‌ను ఫిబ్రవరి 13 నుండి 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. అగ్రి డెవలప్మెంట్ సెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ సెస్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత క్రూడ్ పామాయిల్‌పై ఎఫేక్టివ్ దిగుమతి సుంకం ఇప్పుడు 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గుతుంది. సీబీఐసీ ఒక నోటిఫికేషన్లో...క్రూడ్ పామాయిల్, ఇతర క్రూడ్ నూనెలపై తగ్గించిన దిగుమతి సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ మధ్య ప్రభావవంతమైన సుంకం వ్యత్యాసాన్ని పరిశ్రమల సంఘం ఎస్ఈఏ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శుద్ధి చేసిన పామాయిల్‌పై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. డ్యూటీ వ్యత్యాసాన్ని మరింత పెంచాలి: ఎస్ఈఏ గత ఏడాది పొడవునా ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో..దేశీయ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిబి మెహతా మాట్లాడుతూ...‘క్రూడ్ పామాయిల్‌పై అగ్రి సెస్‌ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కాబట్టి క్రూడ్ పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ మధ్య ప్రభావవంతమైన డ్యూటీ వ్యత్యాసం 8.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుత సుంకం సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. క్రూడ్‌పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్‌పై డ్యూటీ 5.5 శాతం సెప్టెంబరు 30 వరకు ఉండనుంద’ని ఆయన చెప్పారు. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..దేశీయ రిఫైనర్లు ఆర్థికంగా ఆయా రిఫైనర్లను నిర్వహించడానికి ఆయా నూనెల మధ్య కనీసం 11 శాతం డ్యూటీ వ్యత్యాసాన్ని ఉంచాలని ఎస్ఈఏ అభ్యరించిందని తెలిపారు. చదవండి: ‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..! -
ముడి పామాయిల్ దిగుమతి సుంకం కోత
సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్ (సీపీఓ) దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ముడి పామాయిల్ దిగుమతిపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నును 37.5 శాతం నుంచి భారత్ 27.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌ను ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకునేది భారత్. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. -
పామాయిల్ ‘సుంకం’ పోటు
♦ 80 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిన సుంకం ♦ దాంతో విదేశాల నుంచి వెల్లువెత్తుతున్న ఆయిల్ ♦ తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్ర పామాయిల్ సాగు రైతులు సాక్షి, హైదరాబాద్: క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి సుంకం భారీగా తగ్గడంతో విదేశాల నుంచి వాటి దిగుమతులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టన్ను పామాయిల్ గెల ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా రూ.2,500కు మించి తగ్గడంతో ఆ తోటలను సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు పామాయిల్ సాగు రైతుకు నష్టదాయకంగా మారుతుందని తెలంగాణ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచాలంటూ ఆయిల్‌ఫెడ్ గతంలోనే కేంద్రానికి లేఖ రాసినా లాభం లేకపోయింది. 80 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గుదల ప్రస్తుతం రాష్ట్రంలో 31 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఆయిల్‌ఫాం గెలల నుంచి క్రూడ్ పామాయిల్ తీస్తారు. ఇందుకోసం అశ్వారావుపేటలో ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. జాతీయంగా క్రూడ్ పామాయిల్ ధరలను బట్టి రైతులకిచ్చే ధరను నిర్ణయిస్తారు. క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతుల సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించడంతో ఇండోనేసియా, థాయ్‌లాండ్, చైనా, ఈజిఫ్టు, బంగ్లాదేశ్‌లతో పాటు పలు ఐరోపా దేశాల నుంచి పామాయిల్ పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవహిస్తోంది. విదేశాల నుంచి వాటి దిగుమతులు భారీగా పెరిగాయి. 2005 ఫిబ్రవరిలో 80 శాతమున్న క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 2014 డిసెంబర్ నాటికి ఏకంగా 7.5 శాతానికి కేంద్రం తగ్గించింది. 2001 అక్టోబర్‌లో 92.2 శాతమున్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 2014 జనవరిలో 10 శాతానికి తగ్గించింది. దాంతో 2010-11లో 83.7 లక్షల మెట్రిక్ టన్నులున్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు 2014-15లో ఏకంగా 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ దెబ్బకు దేశంలో క్రూడ్ పామాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. 2014 మార్చిలో క్రూడ్ పామాయిల్ టన్ను రూ.58,105 ఉండగా గత అక్టోబర్‌లో ఏకంగా రూ.39,449కి పడిపోయింది. రైతుకు టన్ను రూ.8,441 పలికిన పామాయిల్ గెలల ధర కూడా కూడా రూ.5,757కు పడిపోయింది. తెలంగాణ రైతులు ఏడాదికి 75 వేల టన్నులు క్రషింగ్‌కు తరలిస్తున్నారు. ఆ లెక్కన వారు ఏటా రూ.20.13 కోట్లు నష్టపోతున్నారు. దిగుమతి సుంకాన్ని కనీసం 50 శాతం పెంచాలి క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని కనీసం 40 నుంచి 50 శాతానికైనా పెంచితే రైతుకు మరింత మేలు జరుగుతుంది - ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ రంగారెడ్డి -
క్రూడాయిల్ అక్రమ రవాణాపై విచారణ
అశ్వారావుపేట రూరల్ : అశ్వారావుపేట పట్టణంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడాయిల్(ముడి పామాయిల్)ను తెట్టు(స్లడ్జ్) పేరుతో తక్కువ ధరకు విక్రయించి రవాణా చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి పామాయిల్ అక్రమంగా రవాణా చేస్తుండగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సీనియర్ మేనేజర్ రంగారెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ ఎండీ బాషా, ఫైనాన్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సీతారాములుతో కూడిన బృందం విచారణ నిమిత్తం గురువారం ఫ్యాక్టరీకి వచ్చింది. తొలుత వారు ఫ్యాక్టరీలోని క్రూడ్ ఆయిల్‌ను పరిశీలించారు. ట్యాంక్‌ల ద్వారా ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఈటీపీ ప్లాంట్ వెనుక భాగంలోగల స్లడ్జ్ చెరువును కూడా పరిశీలించి దాంట్లో క్రూడ్ ఆయిల్ కొంతమేర కలుస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. స్లడ్జ్లో క్రూడ్ ఆయిల్ కలవడం జరుగుతుంటుందని, ప్రస్తుతం 0.1 శాతం కలిసిందని బృందం గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు, సామర్థ్యానికి మించి గెలల క్రషింగ్ వల్ల, పైపులైను ద్వారా లీకై స్లడ్జ్లో క్రూడాయిల్ కలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విచారణ బృందాన్ని నిలదీసిన రైతులు విచారణ బృందం వస్తుందన్న సమాచారం తెలుసుకున్న పలు రైతు సంఘాలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారు. గెలల క్రషింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఆయిల్ రికవరీ కూడా దారుణంగా తగ్గిపోతుందని మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావుతో పాటు పలువురు రైతులు విచారణ బృందం దృష్టికి తీసుకెళ్లారు. క్రషింగ్ జాప్యం కావడంతో గెలలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని వారు సర్థిచెప్పేందుకు యత్నించగా, మంచి రోజులేమీ రావడం లేదని, నిత్యం అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని, ఫ్యాక్టరీ మూతపడే స్థితికి చేరుకుంటుందని అన్నారు.