సామాన్యులకు ఊరటను కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామాయిల్ ధరలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలను నియంత్రిచడంతో పాటుగా, దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలకు మద్దతును అందిస్తోందని కేంద్రం పేర్కొంది.
8.25 శాతం నుంచి..
కేంద్ర ప్రభుత్వం శనివారం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. . ఇక ముడి పామాయిల్ (CPO)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం శూన్యం. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సెస్‌ను ఫిబ్రవరి 13 నుండి 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది.
అగ్రి డెవలప్‌మెంట్ సెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ సెస్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత క్రూడ్ పామాయిల్‌పై ఎఫేక్టివ్ దిగుమతి సుంకం ఇప్పుడు 8.25 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గుతుంది. సీబీఐసీ ఒక నోటిఫికేషన్‌లో...క్రూడ్ పామాయిల్, ఇతర క్రూడ్ నూనెలపై తగ్గించిన దిగుమతి సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ మధ్య ప్రభావవంతమైన సుంకం వ్యత్యాసాన్ని పరిశ్రమల సంఘం ఎస్‌ఈఏ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శుద్ధి చేసిన పామాయిల్‌పై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది.
డ్యూటీ వ్యత్యాసాన్ని మరింత పెంచాలి: ఎస్‌ఈఏ
గత ఏడాది పొడవునా ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉండటంతో..దేశీయ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిబి మెహతా మాట్లాడుతూ...‘క్రూడ్ పామాయిల్‌పై అగ్రి సెస్‌ను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కాబట్టి క్రూడ్ పామాయిల్, ఆర్‌బీడీ పామోలిన్ మధ్య ప్రభావవంతమైన డ్యూటీ వ్యత్యాసం 8.25 శాతంగా ఉంటుంది. ప్రస్తుత సుంకం సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. క్రూడ్‌పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్‌పై డ్యూటీ 5.5 శాతం సెప్టెంబరు 30 వరకు ఉండనుంద’ని ఆయన చెప్పారు. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..దేశీయ రిఫైనర్లు ఆర్థికంగా ఆయా రిఫైనర్లను నిర్వహించడానికి ఆయా నూనెల మధ్య కనీసం 11 శాతం డ్యూటీ వ్యత్యాసాన్ని ఉంచాలని ఎస్‌ఈఏ అభ్యరించిందని తెలిపారు.
చదవండి: ‘అన్ని ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కేనా..? మా పరిస్థితి ఏంటి..!’ చైనా కంపెనీకి భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment