photo credit: INDIATODAY
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.
బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు.
చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.
ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment