Goddess Durga
-
దుర్గాపూజ సందర్భంగా ఘర్షణలు
బహ్రెయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఆదివారం దుర్గామాత విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలు సోమవారం కూడా కొనసాగాయి. మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని మన్సూర్ గ్రామంలో విగ్రహం ఊరేగింపులో డీజే భారీ శబ్ధం విషయమై వివాదం మొదలైంది. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనల్లో 22 ఏళ్ల వ్యక్తి చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. సోమవారం కొన్ని చోట్ల అల్లరి మూకలు కర్రలు, రాడ్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీధుల్లో గుంపులుగా తిరుగుతూ లక్నో సేవా ఆస్పత్రికి, ఆ సమీపంలోని మెడికల్ స్టోరుకు నిప్పుపెట్టారు. ఆస్పత్రిలోని ఎక్స్‌రే యంత్రాన్ని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మరో చోట బైక్ షోరూంను అగ్నికి ఆహుతి చేయడంతో పలు వాహనాలు బూడిదయ్యాయి. పలువురి ఇళ్లకు, దుకాణాలకు నిప్పుపెట్టారు. ‘పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. అసాంఘిక శక్తులను గుర్తించాం’అని బహ్రెయిచ్ ఎస్పీ వృందా శుక్లా చెప్పారు. ఓ వ్యక్తికి చెందిన దుకాణం/ఇంటి నుంచే ఊరేగింపు పైకి కాల్పులు జరిపినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. హర్ది పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేశ్ కుమార్ వర్మను, మరో పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్చార్జిని అధికారులు సస్పెండ్ చేశారు. మహ్సి ప్రాంతంలో రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా బ హ్రెయిచ్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయడంతోపాటు బహ్రెయిచ్ జిల్లా సరిహద్దులను అధికారులు మూసివేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశ మయ్యారు. ‘మహ్సిలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని వదిలిపెట్టం. అల్లరి మూకలను గుర్తిస్తాం. నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా కఠిన చర్యలుంటాయి’అని సీఎం చెప్పారు. అదేవిధంగా, విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా కొనసాగేలా మత సంస్థల పెద్దలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించామన్నారు.అంత్యక్రియల సమయంలో ఉద్రిక్తతఆదివారం ఘర్షణల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సో మవారం అంత్య క్రియ లు జరిగాయి. శ్మశాన వాటికకు వెళ్లే క్రమంలో మహ్సి తహశీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు. అతడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేపట్టేది లేదని భీష్మించారు. అతడి మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని, వారి ఇళ్లను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంజీవ్ , అదనపు డీజీపీ అమితాబ్ యాశ్ అక్కడికి చేరుకున్నారు. అమితాబ్ యాశ్ పిస్టల్ చేతబట్టుకుని పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కనిపించింది. అనంతరం, బాధితుడి అంత్యక్రియలు ముగిశాయి.ప్రభుత్వంపై మండిపడ్డ ప్రతిపక్షాలుబహ్రెయిచ్లో ఘటనలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం చేతకానితనమే ఘర్షణలకు కారణమని ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ఆమె కోరారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే మహ్సిలో గొడవలు జరిగాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
Dussehra 2024: అమ్మలగన్న అమ్మ... మన రక్షణ దుర్గం
శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం. ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి. ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–మహత్వం – ఓం,కవిత్వం– ఐం,వశిత్వం– క్లీం పటుత్వం– హ్రీమ్,సంపద– శ్రీమ్ అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం. చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.– పమిడికాల్వ మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్‌కతా – కాళీమాత కోల్‌కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్‌లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్‌దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్‌కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
గరుడ వాహనంపై విశ్వపతి
విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. – తిరుమల దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు. – జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్)/బాసర(ముథోల్)/హన్మకొండ కల్చరల్ -
దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు. – జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్/ బాసర(ముథోల్) దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్‌నగర్ -
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
దుర్గమ్మకు కనక పుష్యరాగ హారం విరాళం
సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపంలో భక్తులను దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ అమ్మవారి అలంకరణకు వాడే ఏడువారాల నగల్లో మరో మణి హారం వచ్చి చేరింది. ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ 40 లక్షల రూపాయలు విలువైన కనకపుష్యరాగ హారాన్ని దుర్గమాతకు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ హారాన్ని ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నట్లు వెల్లడించారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామన్నారు. చదవండి: గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం అలాగే గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను విజయవాడ స్థానికుడిని అని, కానీ వృత్తి రీత్యా అట్లాంటాలో ఉంటున్నట్లు తెలిపారు. తమ కుమారుడు మొదటి జీతంతో అమ్మవారికి హారం అమ్మవారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి హారం చేపించి ఇవ్వడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే అమ్మవారికి అలంకరించే ఏడు వారాల నగలు.. ► సోమవారం- ముత్యాలు ► మంగళవారం- పగడలు ► బుధవారం- పచ్చల ► గురువారం- కనకపుష్యరాగాలు ► శుక్రవారం-డైమండ్ ► శనివారం-నిలాలు ► ఆదివారం-కెంపులు -
షాకింగ్; దేవత కోసం కళ్లు పీకేసుకున్న బాలిక
పట్నా: దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలిచి దేవతకు అర్పించింది. అందరినీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటన బిహార్‌లోని దర్భాంగ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేసేది. ఏడోరోజైన ఆదివారం అమ్మవారికి పూజలు జరుగున్న సమయంలో.. కుమారి తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించేయత్నం చేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడు సహా అందరూ స్థాణువైపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. దుర్గామాత చెప్పిందనే..: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న కోమల్ కుమారి.. గత కొద్ది రోజులుగా విచిత్రంగా మాట్లాడినట్లు తెలిసింది. దుర్గామాత కలలోకి వచ్చేదని, ఏదో ఒక అవయవాన్ని అర్పించమనేదని కుమారి తన స్నేహితురాళ్లతో చెప్పుకునేది. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. బాలిక ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం’’అని దర్భాంగ జిల్లా వైద్యాధికారి సంతోశ మిశ్రా అన్నారు. ఇది మూర్ఖత్వం.. మానసిక రుగ్మత: తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్‌నాథ్ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇవాళ కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి(కోమల్) నిజం కళ్లనే పెకిలించుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను కళ్లు, ఇతర అవయవాలు ఇవ్వమని కోరదు’ అని ఝా అన్నారు. ‘‘బాలిక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. మూఢనమ్మకాలకు సంబంధించి ఇది తీవ్రమైన కేసు’’ అని పట్నాకు చెందిన మానసిక వైద్యుడొకరు తెలిపారు. -
మహిషాసుర మర్దినిగా అమ్మవారు
-
నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
-
నేను దుర్గామాత భక్తురాలిని
చదివిన డాక్యుమెంట్లన్నీ సరైనవే జేఎన్‌యూలో దుర్గామాతను అవమానించారు మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారు రాజ్యసభలో స్మృతి ఇరానీ మంత్రి క్షమాపణలకు విపక్షాల పట్టు న్యూఢిల్లీ పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. యూనివర్సీటీల అంశంపై సభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ తరఫున ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నేతలు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే.. తాను దుర్గామాత భక్తురాలినని తాను చదివిన డాక్యుమెంట్లనీ సరైనవేనని స్మృతి స్పష్టం చేశారు. వాస్తవం ఏంటో వివరించాలన్నారు కాబట్టే తాను ఆ డాక్యుమెంట్లు చదివానన్నారు. అవి చదివేటప్పుడు చాలా బాధపడ్డానని కూడా ఆమె చెప్పారు. జేఎన్‌యూలో దుర్గామాతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ.. వాటిని చూపించారు. అక్కడ మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారని కూడా ఆమె అన్నారు. దాంతో ప్రతిపక్ష నాయకులు ఒక్కసారిగా లేచి ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు సంబంధం లేని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తర్వాత స్మృతి సభలో నుంచి వెళ్లిపోయారు. ఆమె స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆనంద్ శర్మ, గులాంనబీ ఆజాద్ తదితరులు మండిపడ్డారు. అప్పుడు మరో మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకున్నారు. సభలో క్షమాపణలు చెప్పాలి తప్ప చట్టాలు చేయొద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ గందరగోళం నడుమ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కలగజేసుకుని.. రికార్డులన్నింటినీ తాను పరిశీలిస్తానని, మతవిద్వేష పూరిత వ్యాఖ్యలు ఎవరు చేసినా.. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని, తాను చేయగలిగింది ఇది మాత్రమేనని అన్నారు. అనంతరం చర్చను ముగించి, ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. -
ఊరేగింపులో యువకుల సజీవ దహనం
పట్నా: విజయదశమి సందర్భంగా అమ్మవారి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. బిహార్ లోని బార్సన్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన దుర్గమాత నిమజ్జనం ఊరేగింపు విషాదంగా మారిపోయింది. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల దుర్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పదిరోజుల విజయదశమి ఉత్సావాల అనంతరం అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికై ట్రాక్టర్ ట్రాలీ పై తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి షాట్ సర్క్యూట్ అవటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో శంభు శర్మ(18) వికాస్ శర్మ (17) అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్య
రాత్రి 7.30 గంటలు.... అందరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు.... అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా ఏడుపులు, కేకలు మిన్నంటాయి. ఉలిక్కి పడిన ఆ వీధివాసులు పరుగుపరుగున బయటకు వచ్చి చూసేసరికి...రక్తపు మడుగులో ఓ యువతి పడి ఉంది. తమ ఇళ్లమధ్యే హత్య జరగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. సమాచారం దావానలంలా వ్యాపించడంతో అక్కడికి పెద్ద ఎత్తునజనం చేరుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే అల్లుడే ఇంత పనిచేస్తాడని ఊహించలేకపోయామని మృతురాలి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. విజయనగరం క్రైం: విజయనగరం పట్టణ నడిబోడ్డున యువతి దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి యువతి తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు అందించి న వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో కూర్మదాసు సూర్యనారాయణ, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కూర్మదాసు రోడ్డు పై పుస్తకాలు విక్రయిస్తూ, ఆయన భార్య లక్ష్మి వంటలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కుమారుడు ఏడాది క్రితం మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలలో పెద్దకుమార్తె దుర్గాదేవిని నాలుగేళ్ల క్రితం ఎస్.కోటకు చెందిన ఎ.నానాజీ కి ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమార్తె లలితాదేవి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఇంటివద్దే టైలరింగ్ చేస్తోంది. నెల క్రితం నానాజీ కుటుంబ సభ్యులతోపాటు అత్తమామలు తిరుపతి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని వచ్చిన తర్వాత నానాజీ ఎస్.కోటకు వెళ్లకుండా రాజీవ్‌నగర్ కాలనీలోనే మామగారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. నానాజీ భార్య దుర్గాదేవి ప్రస్తుతం గర్భిణి. నానాజీ తన మామ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నానాజీని పట్టుకుని, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. బుధవారం ఉదయం సూర్యనారాయణ పుస్తకాలు అమ్ముకునేందుకు వెళ్లగా, భార్య లక్ష్మి వంటలు చేసేందుకు వెళ్లింది. రెండో కుమార్తె లలితాదేవి ఇంటివద్దే ఉంది. లక్ష్మి వంటపని ముగించుకొని రాత్రి ఏడున్నరగంటల ప్రాంతంలో ఇంటికి చేరేసరికి, ఇంట్లో ఉన్న మంచం మీద లలితాదేవి అర్ధనగ్నంగా పడి ఉంది. ఆమెకు నైటీ వేసి, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. లలితాదేవి నోట్లో, మెడ, ముఖంపై రాడ్డుతో పొడిచినట్లుగా గాయాలున్నాయి. గోడపై రక్తం మరకలు చిందాయి. ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వాటిలో ఉండవలసిన సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.5 వేల నగదు కనిపించలేదు. ఇంట్లో ఉండవలసిన పెద్ద కుమార్తె, అల్లుడు 6.30 గంటల సమయంలో బయటకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీఐ కె.రామారావు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు. లలితాదేవిని హత్యకు వినియోగించిన రాడ్లను, మంచం కింద ఉన్నవాటిని పరిశీలించారు. అక్కాబావలపై అనుమానం.. ఇంట్లో లలితాదేవితోపాటు నానాజీ, అక్క దుర్గాదేవి ఉన్నారు. దుర్గాదేవి, నానాజీలు లలితాదేవిని రాడ్డుతో పొడిచి చంపినట్లుగా తండ్రి సూర్యనారాయణ ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ అల్లుడు తాగి వచ్చి గొడవపడుతుండేవాడని వాపోయాడు. లలితాదేవి అర్ధనగ్నంగా మంచంపై పడి ఉండడాన్ని బట్టి నానాజీ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో నానాజీ, దుర్గాదేవి ఇంటినుంచి పరారవడాన్ని బట్టివారే హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నానాజీ, దుర్గాదేవిలను పట్టుకోవడానికి రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అనేది వైద్యులు ఇచ్చే నివేదికను బట్టి తెలుస్తుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. క్లూస్ ఏఎస్ఐ టి. విజయ, సభ్యులు సత్యనారాయణ, రాజు, శ్రీను వేలిముద్రలను సేకరించారు. రోదిస్తున్న తల్లిదండ్రులు.. లలితాదేవి హత్యకు గురవడంతో తల్లిదండ్రులు లక్ష్మి, సూర్యనారాయణ భోరున విలపిస్తున్నారు. ఇంట్లో ఉంచుకుంటే ఇంతపని చేస్తాడని ఉహించలేకపోయామని, కుమార్తెను హత్యచేసి, పెళ్లికోసం ఉంచిన బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడని ఆరోపించారు.