పట్నా: విజయదశమి సందర్భంగా అమ్మవారి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. బిహార్ లోని బార్సన్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన దుర్గమాత నిమజ్జనం ఊరేగింపు విషాదంగా మారిపోయింది. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల దుర్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పదిరోజుల విజయదశమి ఉత్సావాల అనంతరం అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికై ట్రాక్టర్ ట్రాలీ పై తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి షాట్ సర్క్యూట్ అవటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో శంభు శర్మ(18) వికాస్ శర్మ (17) అనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఊరేగింపులో యువకుల సజీవ దహనం
Published Fri, Oct 23 2015 12:43 PM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM
Advertisement
Advertisement