ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా పామాయిల్‌పై బేస్ దిగుమతి సుంకం తగ్గించింది. ఈ మేరకు కేంద్రం మంగళవారం పొద్దు పోయాక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం తాజాగా బేస్ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్ పామాయిల్ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్ చేసిన పామాయిల్ విషయానికి వస్తే ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పామాయిల్ ధరలు తగ్గుతాయని ఆనందించేలోపు సోయా రూపంలో ప్రమాదం వచ్చి పడింది. సోయా ఆయిల్ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment