హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పామాయిల్ దిగుమతులు స్వల్పంగా వృద్ది చెంది జూన్ మాసంలో 5,90,921 టన్నులు నమోదైంది. సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 12 శాతం ఎగసి 2.30 లక్షల టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 32 శాతం తగ్గి 1.19 లక్షల టన్నులకు వచ్చి చేరింది.
టారిఫ్ రేట్ కోటా కింద డ్యూటీ ఫ్రీ ముడి సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతులకై కేటాయింపులు పెంచాల్సిందిగా సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
క్రితం ఏడాదితో పోలిస్తే వంటలకు ఉపయోగించే నూనెలతోసహా అన్ని రకాల నూనెలు 9.96 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది జూన్‌లో 9.91 లక్షల టన్నులకు దిగొచ్చాయి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా ఏకంగా 50 శాతముంది. టారిఫ్ రేట్ కోటా కింద 2022–23, 2023–24 సంవత్సరాలకుగాను ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె ఒక్కొక్కటి 20 లక్షల టన్నులు దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment