
భారతదేశంలోని ఫ్యూయెల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఎనర్జీ (Pure Energy).. మార్చి 25న హైదరాబాద్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టోరేజ్ విభాగంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తుల ఆవిషకరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకురానున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలుస్తోంది.
స్టోరేజ్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని ప్యూర్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ 'నిశాంత్ డోంగారి' అన్నారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో మా ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవోటెల్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కే సరస్వత్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్. (CSI) అండ్ టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ యూజీన్ హువాంగ్ పాల్గొని.. కంపెనీ ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ ఆవిష్కరించనున్న ఉత్పత్తులకు సంబంధించిన డెమోలను చూపించడం, వాటి సామర్థ్యాలను వెల్లడించడం, పంపిణీకి సంబంధించిన విషయాలను.. మార్చి 25న వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment