సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్‌మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
సర్కిల్ పేరు ఫోన్ నంబర్
హైదరాబాద్ సెంట్రల్ 9491629047
హైదరాబాద్ సౌత్ 9491628269
సికింద్రాబాద్ 9491629380
బంజారాహిల్స్ 9491633294
సైబర్‌సిటీ 9493193149
రాజేంద్రనగర్ 7382100322
సరూర్‌నగర్ 7901679095
హబ్సిగూడ 9491039018
మేడ్చల్ 7382618971
వికారాబాద్ 9493193177
విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్‌లైన్‌లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్‌మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.
సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి?
⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి.
⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి.
⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి.
⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్‌డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు.
⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి.
⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు.
⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి.
⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్‌టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి.
⇒ కొందరు జూనియర్ లైన్‌మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment