wind
-
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్‌సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్‌నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
కరెంట్.. గాల్లో దీపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఈదురుగాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడి తీగలు తెగిపోవడంతో.. బోడుప్పల్, నారపల్లి, చెంగిచెర్ల, పీర్జాదిగూడలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.పదిరోజుల కింద వాటర్‌బోర్డు ఆధ్వర్య ంలో మంచినీటి పైపులైన్ కోసం రాత్రిపూట తవ్వకాలు చేపట్టగా.. మయూరినగర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33/11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బతింది. ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పదిహేను రోజుల క్రితం బాచుపల్లిలోని 33/11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌లో అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. పలు ఫీడర్ల పరిధిలోని కాలనీలకు పది గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో స్థానికులు సబ్‌స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిపై అవగాహన లేక..తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నెలకు కనీ సం 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. పదేళ్ల క్రితం 1,800 నుంచి 2,200 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 3,900 నుంచి 4,000 మెగావాట్లు దాటింది. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినా.. అంతరాయాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్లకు లైన్లపై సరైన అవగాహన లేకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించలేకపోతున్నారనే విమర్శ ఉంది.ఎవరైనా స్థానికులు ఫలానా చోట వైరు తెగిందనో? ట్రాన్స్ఫార్మర్ పేలిందనో? విద్యుత్ స్తంభం నేల కూలిందనో ఫోన్‌చేసి చెప్తేగానీ సమస్యను గుర్తించలేని పరిస్థితి. అంతేకాదు లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు.సంస్కరణలు చేపట్టినా.. సద్దుమణగని సమస్యలుపరిపాలనలో సౌలభ్యం, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిస్కం వేర్వేరు (ఆపరేషన్స్, సీబీడీ లైన్స్ వింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్) విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ ఏఈ బిల్లింగ్, రెవెన్యూ వసూళ్లకే పరిమితం అయ్యేవారు. ఏదైనా విపత్తు జరిగితే పరిష్కార బాధ్యతను సీబీడీ గ్యాంగ్ నిర్వర్తించేది. ఇక కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులను మాస్టర్ ప్లాన్ విభాగం చూసుకునేది.ఇలా ఎవరి పరిధిలో వాళ్లు ఉండటంతో.. విపత్తుల సమయంలో బ్రేక్‌డౌన్స్, సరఫరా పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచి్చంది. ముషారఫ్ ఫారూఖీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక.. సంస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆపరేషన్స్ ఏఈలకు కూడా అంతరాయాలను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. గతంలో లైన్ల పునరుద్ధరణకు లైన్ క్లియర్ (ఎల్సీ) పేరుతో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపేసేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి చెప్పారు. అయినా అంతరాయాల సమస్య తగ్గడం లేదు. ...గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు చిన్న ఉదాహరణలివి. చిన్న వాన పడినా చాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నిచోట్ల గంటలకు గంటలు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థలు సరిగా లేకపోవడానికి తోడు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, లోపభూయిష్టమైన ఎర్తింగ్ సిస్టం, స్తంభాలకు వేలాడుతున్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు.. వెరసి విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.చినుకు పడితే చీకటే..రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో తరచూ కరెంటు సమస్య వస్తోంది. చినుకుపడితే చాలు చీకటి అవుతోంది. అంతరాయాలు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. ఇంట్లో కరెంట్ లేక ఉక్కపోత, దోమలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. – సదానంద్, బుద్వేల్ -
Global Wind Day 2024: గాలి ‘పవర్’ అప్పుడే తెలిసింది!
ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకునే గ్లోబల్ విండ్ డే, పవన శక్తి ప్రాముఖ్యత, భూగోళాన్ని మార్చే దాని శక్తి గురించి అవగాహన పెంచుతుంది. ఇది పవన శక్తిని స్థిరమైన, పునరుత్పాదక శక్తి వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం.భారత్‌లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్ తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ విండ్ ఎనర్జీ డే చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ఆసక్తికర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పవన విద్యుత్ చరిత్ర ఇదీ..విండ్ ఎనర్జీ చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులోని నైలు నదిపై పడవలను నడపడానికి తొలిసారిగా విండ్ మిల్స్ ఉపయోగించారు. తరువాత చైనాలో పవన శక్తిని అభివృద్ధి చేశారు. ఇక్కడ గాలితో నడిచే నీటి పంపులను క్రీస్తుపూర్వం 200లో కనుగొన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ విండ్ వీల్ ను సృష్టించాడు.విండ్ మిల్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పరికరంగా మారింది. వాటి ఉపయోగం చివరికి 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది. పశ్చిమ అమెరికాలో వేలాది నీటి పంపులు, చిన్న విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసిన హోమ్ స్టెడర్లు, వ్యవసాయదారులు దీనిని చేశారు. 1970 లలో చమురు కొరత కారణంగా పవన విద్యుత్ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి దారితీసింది.46,422 మెగావాట్ల సామర్థ్యంభారత పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తూ కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తన తాజా డేటాను ఆవిష్కరించింది. 2024 మే 31 నాటికి సంచిత భౌతిక పురోగతి నివేదిక సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపన రంగాలలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఒక్క మే నెలలోనే భారత్ 3,007.28 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు. అవి పవన శక్తి, సౌర శక్తి. పవన విద్యుదుత్పత్తి 535.96 మెగావాట్లు పెరగడంతో మొత్తం సామర్థ్యం 46,422.47 మెగావాట్లకు చేరింది. -
కోస్తాంధ్రపై ‘మిచాంగ్’ తుపాను పడగ!
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కి.మీలు, తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90 కి.మీలు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగనుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సçహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని తెలిపారు. -
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. బుధవారానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం మధ్యలో పయనిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడురోజులు కొనసాగుతాయని ఐఎండీ మంగళవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశి్చమ గోదావరి, ఎనీ్టఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఎస్పీఎస్సార్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం భారీవర్షాలు కురిశాయి. ఎనీ్టఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 10.2, విశాఖ రూరల్‌లో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్‌గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగిస్తూ..
గాలిలో ఎగిరే కార్లను ఇప్పటికే కొందరు తయారు చేశారు. ఇవి విస్తృతంగా ఇంకా వాడుకలోకి రాలేదు గాని, వీటి తయారీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తయారైన ఎగిరే కార్లు పెట్రోల్, డీజిల్ లేదా లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇంధనంగా ఉపయోగించుకునే రకాలకు చెందినవే. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఎగిరే కారు తీరు మాత్రం మిగిలిన వాటన్నింటికీ పూర్తిగా భిన్నం. గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగించుకుని, గాలిలో షికారు కొట్టడం దీని ప్రత్యేకత. కీటకం ఆకారంలో రూపొందించిన ఈ కారుకు ‘ఇన్సెక్టా’ అని పేరు పెట్టారు. సెర్బియన్ ఆటోమొబైల్ డిజైనర్ మార్కో పెట్రోవిక్ దీనిని రూపొందించారు. -
గ్రేటర్ వాసులను బెంబేలెత్తించిన వాన... ధ్వంసమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు
సాక్షి, హైదరాబాద్: భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలు గ్రేటర్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున గాలివానతో అనేక చోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగి లైన్లపై పడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 400పైగా 11 కేవీ ఫీడర్లు, 80కిపైగా 33 కేవీ ఫీడర్లు ట్రిప్పవగా, 60పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై కొన్ని చోట్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. మరికొన్ని చోట్ల రాత్రి అంధకారం తప్పలేదు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు కరెంట్ లేకపోవడంతో ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్ట్‌లు, మంచినీటి సరఫరా మోటార్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో 1912 కాల్ సెంటర్ మూగబోగా, కొంతమంది లైన్మెన్లు, ఇంజినీర్లు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం గమనార్హం. 850 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్ జిల్లాల్లో చాలా వరకు ఓవర్‌హెడ్ లైన్లే. ఈ లైన్ల కిందే చెట్టు నాటుతుండటం, అవిపెరిగి పెద్దవై ఈదురుగా లులకు విరిగి పడుతుండటంతో తెగిపడుతున్నాయి. ప్రధాన వీధులు సహా శివారు ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చాలా వరకు విద్యుత్ లైన్లను ఆనుకుంటున్నాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లు చిరిగి గాలికి ఎగిరి లైన్ల మధ్య చిక్కుకుంటున్నాయి. ఒకదానికొకటి ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడాల్సివ చ్చింది. వర్షం వెలియగానే కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరించిన్పటికీ.. చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఆరేడు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఆ సర్కిళ్లలోనే ఎక్కువ నష్టం ఈదురు గాలితో కూడిన వర్షానికి సరూర్‌నగర్, మేడ్చల్, సికింద్రాబాద్, హబ్సీగూడ సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు డిస్కం ఇంజినీర్లు గుర్తించారు. ఎల్బీనగర్, నాగోలు, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, బీఎన్‌రెడ్డి, పసుమాముల, తుర్కయాంజాల్ పరిసర ప్రాంతాల్లోనే 37 విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు ఎక్కువ ఉన్న కంటోన్మెంట్, బోయిన్పల్లి, ప్యారడైజ్, సైఫాబాద్, మెహిదీపట్నం, చార్మినార్, కాచిగూడ, ఆస్మాన్‌గడ్, ఓల్డ్‌మలక్‌పేట్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్, మీర్పేట్, బాలానగర్, ఉప్పల్, బోడుప్పల్, చర్లపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఐదు 33 కేవీ, పదిహేను 11 కేవీ, 37 ఎల్టీ పోల్స్ నేలకూలాయి. అంతేకాదు సైబర్‌సిటీ సర్కిల్లో 11 ఫీడర్లు ట్రిప్పవగా, హబ్సీగూడలో 35 ఫీడర్లు, మేడ్చల్‌లో 35, రాజేంద్రనగర్‌లో 18, సరూర్‌నగర్‌లో 21, సికింద్రాబాద్‌లో 17, హైదరాబాద్ సౌత్‌లో 14, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 12, బంజారాహిల్స్‌లో ఐదు ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గ్రేటర్ జిల్లాల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
yaas cyclone ప్రచండ గాలులు
బాలాసోర్ : యాస్ తుపాన్ ఒడిషాలోని బాలాసోర్ దగ్గర తీరం దాటింది. తీరం దాటేప్పుడు ప్రచండ గాలులు వీచాయి. ఆ గాలుల తీవ్రతకు భారీ చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాను తీరం దాటేప్పుడు గంటలకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ప్రపంచ గాలుల తీవ్రత ఎలా ఉందో మీరే చూడండి #CycloneYaasUPDATE Cyclone yaas hits balasore ( Orissa ) ⚡ pic.twitter.com/RSVHU0nVih — Shehzar Hussain 🇮🇳 (@_Shehzar_hN_) May 26, 2021 -
వైరల్: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం!
జకార్త : నవమాసాలు మోసిన తర్వాతే ఏ మహిళైనా బిడ్డకు జన్మనిస్తుంది. గాలి దేవుడిని ప్రార్థించి కుంతీదేవి భీమసేనుడిని కన్నదని కేవలం పురాణాల్లో మాత్రమే చదువుకున్నాం. వందల శతాబ్ధాల తరువాత మరోసారి అలాంటి వార్తనే వింటున్నాం. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ తన గర్భం వెనుకున్న రహస్యం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి చెందిన జైనా అనే 25 ఏళ్ల మహిళా ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాను పురుషుడితో కలయిక ద్వారా కాకుండా గాలి ద్వారా గర్భం దాల్చినట్లు పేర్కొంది. అంతేగాక తను గర్భవతి అవ్వడం, ప్రసవించడం అంతా కేవలం గంట సమయంలోనూ జరిగిపోయిందని వింత వాదన చేస్తోంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్న తరువాత, నా యోని ద్వారా గాలి నా శరీరంలోకి అకస్మాత్తుగా ప్రవేశించింది. ఆ సమయంలో నేను మీద నేల పడుకున్నాను. గదిలో గాలి వీచిన 15 నిమిషాలకు కడుపులో నొప్పిగా అనిపించింది. కొద్దిసేపటి తరువాత పొత్తికడుపు ఆకస్మాత్తుగా పెద్దదిగా అయ్యింది’ అని పేర్కొంది. అయితే బాధితురాలు నిజంగానే గర్భందాల్చడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి కమ్యూనిటీ క్లినిక్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, గాలి వల్ల గర్భం దాల్చానని చెబుతున్న ఆమె మాటలు ఏ విధంగా నమ్మశక్యంగా లేవని వైద్యులు చెబుతున్నారు. ప్రసవించే వరకు మహిళకు తను గర్భవతి అనే విషయం తెలియకపోవచ్చని అంటున్నారు. కాగా ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చివరికి అధికారుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గర్భం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జైనాకు భర్త, కుమారుడు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె మాజీ భర్తను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిడ్డకు జన్మనిచ్చిన సితి జైనాహ్ను.. ఆమెకు పుట్టిన బిడ్డను చూసేందుకు అధికారులతో పాటు జనాలు క్యూ కడుతున్నారు. అయితే సుడిగాలి ద్వారా గర్భం అంటూ ఈమె చెబుతున్నదంతా కట్టుకథ అని వైద్య అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని.. అంటే తాము గర్భం దాల్చినట్టు వారికి తెలియదని ప్రముఖ వైద్యుడు ఏమాన్ సులేమాన్ అంటున్నారు. ఇక ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరస్తున్నప్పటికీ ఇండోనేషియాలో గతంలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయని పోలీసుల వర్గాలు తెలుస్తోంది. న్యూస్ పోర్టల్ కోకోనట్ ప్రకారం.. గత ఏడాది జూలైలో ఇలాంటి కేసు వెలుగు చూసింది. 2017 లో కూడా ఓ కన్య గర్భం దాల్చిన మూడు గంటల్లోనే శిశువుకి జన్మనిచ్చినట్లు తన కథనంలో పేర్కొంది. -
గాలి ద్వారా కరోనా సాధ్యమే
న్యూయార్క్: కరోనా వైరస్ గాలి ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు ఇటీవల స్పష్టంగా చెబుతున్నారు. అది నిజమేనని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా వెల్లడించింది. కొన్ని పరిస్థితుల్లో కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని పేర్కొంది. శ్వాస వదిలినప్పుడు, మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వస్తుందని ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను, డబ్ల్యూహెచ్ఓను కోరారు. జనంతో కిక్కిరిసిపోయిన, సరైన గాలి, వెలుతురు రాని గదుల్లో కరోనా బాధితులు ఉంటే.. వారి ద్వారా ఇతరులకు వైరస్ సులభంగా వ్యాపిస్తుందన్న వాదనను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపించని(అసింప్టమాటిక్) బాధితుల నుంచి సైతం వైరస్ గాలి ద్వారా సోకే ప్రమాదం ఉందని తెలిపింది. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు కరోనా వైరస్ మూలాలను కనిపెట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు చైనా రాజధాని బీజింగ్ శని, ఆదివారాల్లో పర్యటిస్తారు. చైనాలోని వూహాన్ జంతు మాంసం మార్కెట్లోనే కరోనా పుట్టిందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చైనా దీన్ని ఖండిస్తూ వస్తోంది. కజకిస్తాన్‌లో న్యూమోనియా ముప్పు మధ్య ఆసియా దేశం కజకిస్తాన్‌లో కరోనా కంటే ప్రమాదకరమైన న్యూమోనియా మహమ్మారి పంజా విసురుతోందని, ఈ వ్యాధితో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,772 మంది చనిపోయారని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ప్రకటనను కజకిస్తాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. అవన్నీ తప్పుడు వార్తలని తేల్చిచెప్పింది. -
గాలి ద్వారా కరోనా.. !?
జెనీవా/ న్యూయార్క్: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన స్వరం మార్చింది. వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది. దీనిపై మరిన్ని బలమైన ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందంది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం కరోనా సూక్షా్మతి సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్ఓకి ఒక లేఖ రాశారు. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు మాత్రమేనన్నారు. వైరస్ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశమే ఉంటే డబ్ల్యూహెచ్ఓ తన మార్గదర్శకాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు కోవిడ్ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఒ చెబుతున్న విషయం తెలిసిందే. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో కోవిడ్ విజృంభిస్తున్న వేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఒ చేసిన ప్రకటన ప్రభుత్వం, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని రుజువైతే మాస్కులు ధరించడం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధరించే ఎన్–95 మాస్కులు సాధారణ ప్రజలు కూడా వాడాల్సిన అవసరం రావచ్చునని, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే.. ► వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని మొదటిసారిగా నేచర్ పత్రిక ప్రచురించింది. ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ► అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఈజేఎం) ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది. ► రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్ ఉంటోందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేలో చేసిన అధ్యయనంలో తేలింది. -
వేసవి తుపానులు ఊరకే రావు!
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఒడిశాను అతలాకుతలం చేసిన ‘ఫొని’ తుపానుకు 38 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఇది వేసవి కాలపు తుపాను. గత 150 ఏళ్లలో ఇది రావడం మూడోసారి మాత్రమే. వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వచ్చి బంగాళా ఖాతం జలాలు వేడక్కెడం వల్ల ఈ తుపాన్లు వస్తున్నాయి. భూతాపోన్నతి పెరగడం వల్లనే భూ వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయన్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రత ఇప్పటికే 46 డిగ్రీల మార్పును దాటిందంటే ఈసారి ఉష్ణోగ్రత తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సుడి గాలులు, తుపానులు చెలరేగి ప్రకృతి నష్టాలతోపాటు మాన ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయని అందరికి తెల్సిందే. తెలియనిది మరొకటి ఉంది. పర్యావరణ పరిరక్షణ లోపించి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించడం వల్ల జన్యుపరమైన నష్టం. అంటే కొన్ని జీవరాశులు పూర్తిగా నశించి పోవడం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి జీవరాశులు ఉండగా, వాటిలో ఇప్పటికే దాదాపు పది లక్షల జీవరాశులు నశించి పోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు నెలన్నరపాటు కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కారణంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను దేశ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదుగానీ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సందర్భంగా దేశంలోని దరిద్రం నుంచి దాష్టీకం వరకు, ఆకలి నుంచి అన్నపానీయాల వరకు, ఉపాధి నుంచి పదోన్నతుల వరకు, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలన్నీ చర్చకు వస్తాయిగానీ ఏనాడు వాతావరణ మార్పుల అంశం మాత్రం రాదు. కానీ ఈసారి మాత్రం వచ్చింది. ముక్తిసరికైనాగానీ పాలకపక్ష బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో కొన్ని పేజీలను వాతావరణ మార్పులకు కేటాయించాయి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పాయి. పునర్వినియోగ ఇంధనంపై దృష్టిని కేంద్రీకరిస్తామని, అడవులను పెంచే రాష్ట్రాలకు ‘గ్రీన్ బోనస్’ ఇస్తామని బీజేపీ వాగ్దానం చేయగా, దేశంలోని జల వనరులను సంరక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గత 50 ఏళ్లలో వాతావరణ మార్పుల వల్ల దేశ జీడీపీ పురోగతిలో 30 శాతం కుంటుపడింది. అంటే వాతావరణ పరిస్థితులు సవ్యంగా ఉన్నట్లయితే నేడు మన జీడీపీ రేటు మరో 30 శాతం ఎక్కువ ఉండేది. పర్యావరణ పరిస్థితులను పరిరక్షించడంలో భాగంగా ప్రపంచంలోనే తొలి దేశంగా బ్రిటన్ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. భారత్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సూర్యుడే జీవుడు... జీవుడే ఆత్మ!
ఆత్మ సర్వాంతర్యామి అనే అద్వైత సూత్రాన్ని శక్తి నిత్యత్వ నియమం నిరూపిస్తోంది. సైన్స్ ఆత్మను అనంతశక్తిగా, విశ్వశక్తిగా పేర్కొంటుంది. ఈ ఆత్మ ఒక అద్భుత పరిణామశీలి. పుట్టేది గిట్టేది కాదు కాబట్టి, నిత్యయవ్వనంతో ఆత్మ కళకళలాడుతూ ఉంటుంది. తన నిత్యత్వాన్ని నిలుపుకోవడం కోసం పరిణామమనే ప్రక్రియను సాధనంగా చేసుకుని, తనకు తానుగా పదార్థంగా పరిణామం చెందుతూ వస్తోంది. మళ్ళీ ఆ పదార్థాలు విఘటనం చెందుతూ, నీటి ఆవిరి గాలిలో లయమైపోయినట్టుగా ఆత్మలో లయమైపోతున్నాయి.ఆత్మలాగే, పదార్థమూ అనాదిగా వస్తున్నదే. అయితే, ఆత్మ స్వీయ స్పందనల నుండి ఈ పదార్థం పుడుతూ, విచ్ఛిన్నమవుతూ వస్తోంది. ఈ ఖగోళ పదార్థాల సంఖ్య నిశ్చల, నిరంతర క్రియ కాదు. ఈ ఖగోళ పదార్థాల ప్రవర్తనకు సౌరకుటుంబమే నిదర్శనం. ఆత్మకు, జీవనిర్జీవ ప్రపంచానికి అనుసంధానకర్త అయిన సూర్యుని ద్వారానే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చని ‘ఈశావాస్యోపనిషత్తు’ ఉద్ఘాటిస్తోంది.తరచి చూస్తే సూర్యుడు కూడా జనన, బాల్య, కౌమార, ప్రౌఢ, వార్ధక్య దశలను దాటి నశించేవాడే. సూర్యుని నుండే గ్రహాలు ఉద్భవించాయని ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, నవీన ఖగోళ శాస్త్రవేత్తలూ నిర్ధారించారు. గ్రహాలలో భూమి ఒక్కటే జీవావరణ అనుకూలం. అందునా మానవుడు మేథోపరుడు. ఆలోచిస్తే సౌరశక్తే జీవాలుగా మారినట్లు తెలుస్తుంది. సూర్యుని నుంచి విడిపడి ఏర్పడ్డ భూమిపై సూర్యరశ్మి పడడం, అందులోని శక్తిని తీసుకుని జీవరాశి తయారవడం కనిపిస్తుంది. అంటే ఆ సూర్యుడే అటు గ్రహాల రూపంలో, ఇటు జీవాల రూపంలో భాసిల్లుతున్నాడు. ఇదే విషయాన్ని ‘ఈశావాస్యోపనిషత్తు’ ‘సత్యధర్ము’డైన సాధకుడే సూర్యునిలో నెలకొన్నాడని తీర్మానిస్తోంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మరూపుడు సూర్యుని ద్వారా ప్రయత్నించడం ఆ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇదే కోవలో మరింత లోతుగా ఆలోచిస్తే ఈ గ్యాలక్సీలలో ఉన్న కోటానుకోట్ల సూర్యులలో భాసిల్లేది ఆ ఆత్మనే. అంటే, అనంతమైన ఆత్మే నక్షత్రాలుగాను, గ్రహాలుగాను, పంచభూతాలుగాను, ప్రాణులుగానూ మారి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని గణిత సూత్రంలో పోలిస్తే ఒక విలువ రెండో విలువకు, రెండో విలువ మూడో విలువకు సమానమైనపుడు ఒకటో విలువ మూడో విలువకు సమానమౌతుంది. ఇదీ అంతే. ఆత్మే సూర్యుడు, సూర్యుడే జీవుడు, జీవుడే ఆత్మ. దీన్ని అర్థం చేసుకోవడమే ఆత్మసందర్శన. అదే భగవద్దర్శనం. ఆ సాధనే సత్యస్వరూపం –గిరిధర్ రావుల -
మంచి పనులు
ముగ్గురు వ్యక్తులు కాలినడకన సుదూర ప్రయాణంలో ఉన్నారు. అంతలోనే గాలి, వాన మొదలైంది. ముగ్గురూ ఒక గుహలో తలదాచుకున్నారు. భీకరమైన గాలికి ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి వచ్చిపడటంతో గుహద్వారం మూసుకుపోయింది. గుహంతా చీకటిగా మారిపోయింది. ద్వారం మూసుకుపోవడంతో ముగ్గురిలో ఆందోళన మొదలయ్యింది. బండరాయిని తొలగించాలని ఎంతగా ప్రయత్నించినా రాయి అంగుళం కూడా కదలడం లేదు. అందులోని ఒకరు ‘‘ఈ భయంకరమైన అడవిలో మనల్ని రక్షించేదిక్కెవరూ లేరు. ఇక మనకు అల్లాహ్ యే దిక్కు. మనం చేసిన సత్కార్యాలను సాక్ష్యంగా పెట్టి అల్లాహ్ ను వేడుకుందాం’’ అని చెప్పాడు. ఒక్కొక్కరూ వరుసగా తాము చేసిన ఒక్కో మంచి పనిని అల్లాహ్ ముందు ఏకరువు పెడుతూ దైవ సహాయాన్ని అర్ధించడం మెదలెట్టారు. అందులో మొదటి వ్యక్తి ‘‘ఓ అల్లాహ్.. నా తల్లిదండ్రులిద్దరూ వృద్ధులు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. రోజూ మేకల పాలు పితికి ముందుగా మా అమ్మానాన్నలకు తాగించిన తరువాతే నా పెళ్లాం పిల్లలకు తాగిస్తాను. ఒకరోజు పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చి పాలుపితికి అమ్మానాన్నలకు అందించే సరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఈలోగా మా అమ్మానాన్నలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు అమ్మానాన్నల్ని నిద్రనుంచి లేపితే వాళ్ల నిద్ర భంగమవుతుందని వాళ్లు నిద్రలేచే వరకూ పాలగిన్నెను తీసుకుని అలానే నిద్రకాచాను. ఆ రాత్రి నాతో సహా భార్యా పిల్లలు ఆకలితోనే నిద్రపోయారు. కనుక ఓ కరుణామయా నన్ను ఈ చీకటి గుహనుంచి బయటపడే మార్గం చూపించు’’ అని వేడుకోసాగాడు. మరుక్షణమే గుహ ముఖద్వారానికి అడ్డంగా ఉన్న బండరాయి కాస్తంత జరగడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండో వ్యక్తి ‘‘ఓ అల్లాహ్ మా బంధువుల అమ్మాయి మీద నేనొకసారి మనసు పడ్డాను. ఆమెకు ఒకసారి ఏదో కష్టం వచ్చింది. నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు సహాయం చేయమని అర్థించింది. ఆమెకు నేను షరతుతో డబ్బు అందించాను. ఒకరోజు సాయంత్రం షరతు ప్రకారం ఆమె దగ్గరకెళ్లాను. ‘‘అల్లాహ్ కు భయపడు. ఎవ్వరూ చూడకపోయినా అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకో’‘ అని చెప్పిన ఆమె మాటలకు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఆ మరుక్షణమే ఆమెకు ఇచ్చిన డబ్బును మాఫీ చేశాను. ఓ అల్లాహ్ ఈ పనిని కేవలం నీ మెప్పుకోసమే చేశాను’’ అని అల్లాహ్ ను వేడుకోగానే ఆ బండరాయి ఇంకాస్త జరిగింది. దీంతో బయటికి వెళ్లే మార్గం ఇంకాస్త సుగమమైంది. ఇక మూడో వ్యక్తి వంతురానే వచ్చింది. ‘‘ఓ అల్లాహ్ నాదో చిన్న వ్యాపారం. ఒకసారి ఒక కూలీ వాడు రోజంతా నా దగ్గర పనిచేసి ఇంటికెళ్లేటప్పుడు మా ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో అలిగి తన కూలీ తీసుకెళ్లలేదు. నేను ఆ కూలీ డబ్బుతో సాగుబడి చేశాను. చాలా లాభాలు గడించాను. లాభంగా వచ్చిన అతని వాటాలోనుంచి చిల్లిగవ్వకూడా ఖర్చుపెట్టకుండా భద్రపరిచాను. కొన్నేళ్లకు కూలివాడు ఆర్థిక ఇబ్బందులతో తన కూలి డబ్బుల కోసం మళ్లీ నా దగ్గరకొచ్చాడు. అప్పుడు నేను అతనికి ‘‘ఈ మేకలు, ఈ ఆవులన్నీ నీవే. వాటిని మీ ఇంటికి తోలుకుని వెళ్లు, ఆ పంటపొలం, ఈ తోట నీదే’’ అని చెప్పగానే ఆ కూలివాడు నేను ఎగతాళి చేస్తున్నానననుకున్నాడు. అదంతా నిజమేనని, ఆ రోజు అతని కూలి డబ్బులతో చేసిన వ్యాపారంతోనే ఇదంతా సంపాదించానని ఇదంతా తనదేనని చెప్పి అతనికి అందించాను. ఓ అల్లాహ్ ఇదంతా నీ మీద భయభక్తులతోనే చేశాను. కనుక నీవు ఈ రోజు మమ్మల్ని ఈ చీకటి గుహనుంచి ఎలాగైనా బయటపడేయి’’ అని మూడో వ్యక్తి కూడా వేడుకోగానే బండరాయి పూర్తిగా తొలగిపోయింది. ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు. తల్లిదండ్రుల సేవ, పాపకార్యాలకు ఆమడ దూరంలో ఉండటం, ఒకరి కష్టార్జితాన్ని కాజేయకుండా ఉండటం కూడా దైవారాధనతో సమానం. మంచి పనులే మనకు కష్టకాలంలో ఆదుకుంటాయన్నది ఈ కథలోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
అరుదైన శబ్దాలను రికార్డ్ చేసిన నాసా
తంపా : ఇప్పటివరకూ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ అనంత విశ్వంలో మానవ మనుగడకు అనుకూలంగా ఉన్న ఏకైక ప్రదేశం భూ గ్రహం మాత్రమే. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఈ భూమి పరిమాణం మాత్రం పెరగడం లేదు, పెరగదు కూడా. దాంతో మానవ మనుగడకు అవసరమైన మరో గ్రహాన్ని అన్వేషించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తల చూపు అరుణగ్రహం(మార్స్) మీదకు వెళ్లింది. అరుణ గ్రహం మనుషుల ఆవాసానికి అనుకూలంగా ఉందా, లేదా తెలసుకునేందుకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. తొలిసారి శాస్త్రవేత్తలు అంగారకుడి మీద వచ్చే శబ్ద తరంగాలను రికార్డ్ చేశారు. నాసా అంగారకుడి పైకి పంపిన ఇన్సైట్ ల్యాండర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ మార్స్‌పై వచ్చే గాలి తరంగాల శబ్దాలను రికార్డు చేసింది. ఇంత వరకూ మార్స్ పరిసరాలకు సంబంధించిన ఫోటోలను మాత్రమే పంపిన ఇన్సైట్ తొలిసారిగా అంగారకుడిపై వచ్చే గాలి శబ్దాలను రికార్డు చేసిందని నాసా తెలిపింది. గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో వీస్తున్న గాలి తరంగాలను ఇన్సైడర్ ల్యాండర్ రికార్డు చేసింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండు సెన్సార్లు గాలి తరంగాల శబ్దాలను నమోదు చేశాయని.. ఈ శబ్దాలు గాలిలో జెండా ఎగుతున్నప్పుడు వచ్చిన శబ్దాల మాదిరిగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు థామస్ పైక్ వెల్లడించారు. అంగారకుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ నవంబరు 26న మార్స్‌పై విజయవంతంగా దిగింది. అయితే గతంలో మాదిరి కాకుండా చాలా అధునాతన టెక్నాలజీతో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా రూపొందించింది. అంగారకుడి గ్రహంలోని రాతి పొరల నిర్మాణాల గురించి, అక్కడ వచ్చే భూకంపాలను అధ్యయనం చేయడం కోసం, దాని ఉపరితలం నుంచి వెలువడే వేడి గురించి అధ్యాయనం చేయడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో అత్యాధునిక భూకంప శాస్త్రపు సాధనాలను వినియోగించినట్లు నాసా తెలిపింది. -
గాలిలో నుంచి నీరు – యంత్రానికి రూ.10 కోట్ల బహుమతి!
గాలిలోని తేమను నీరుగా మార్చే యంత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. భూతాపోన్నతి నేపథ్యంలో భవిష్యత్తులో గుక్కెడు నీరు కూడా దక్కదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రైజ్ సంస్థ కొన్నేళ్ల క్రితం ఓ పోటీ పెట్టింది. గాలిలో ఉండే తేమను నీటిగా మార్చడం మాత్రమే కాకుండా, రోజుకు కనీసం రెండు వేల లీటర్ల నీళ్లు ఉత్పత్తి చేయాలన్నది పోటీలోని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా.. పెట్రోలు, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధన వనరులను వాడకుండా ఈ పని సాధించాలి. లీటర్ నీటికి రెండు రూపాయల కంటే ఎక్కువ ఖర్చవకూడదు కూడా. ఈ నేపథ్యంలో ‘సమృద్ధిగా నీరు’ పేరుతో మొదలైన ఈ పోటీలో మొత్తం 25 దేశాల నుంచి 98 బృందాలు పాల్గొన్నాయి. ఏడాది క్రితం కొంతమంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా.. గత నెలలో మొత్తం ఐదుగురు ఫైనలిస్టుల్లో ఇద్దరిని నమూనా యంత్రం తయారుచేసి చూపాల్సిందిగా ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ కోరింది. చివరకు అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైవాటర్ అలయన్స్ ఈ పోటీలో మొదటి బహుమతి సాధించింది. రెండో స్థానంలో హవాయికి చెందిన జేఎంసీసీ వింగ్ నిలిచింది. మొదటి బహుమతిగా పది కోట్ల రూపాయలు లభించగా, రెండో బహుమతి కింద కోటి రూపాయలు దక్కాయి. -
నెల్లూరులో గాలి, వాన బీభత్సం
నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గాలి, వాన బీభత్సం సృష్టిస్తోంది. పొదలకూరు, ఉదయగిరి మండలాలలో పిడుగులు పడ్డాయి. గాలుల ధాటికి పలుప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్థంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. కావలి రూరల్ మండలం గౌరవరంలో గాలులకు హెచ్‌టీ విద్యుత్ తీగల రాపిడి జరిగి మంటలు చెలరేగాయి. దీంతో నిప్పురవ్వలు పడి అటవీ ప్రాంతానికి అంటుకున్నాయి. ఈ సమాచారాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
చెట్టు కూలి ఇద్దరు మృతి
బసలదొడ్డి (పెద్దకడబూరు): ఈదురు గాలుల బీభత్సంతో చెట్టు కూలి దాని కింద కూర్చున్న అవ్వ, మనుమరాలు మృతి చెందారు. బసలదొడ్డి గ్రామానికి చెందిన బొంపల్లి రంగమ్మ(60), మనుమరాలు అంజనమ్మ(7)లు ఆదివారం తమ పొలంలో ఉల్లినాటు వేయడానికి కూలీలతో వెళ్లారు. సాయంత్రం సమయంలో బలమైన ఈదురు గాలులు, చినుకులు వచ్చాయి. దీంతో పొలంలో పనిచేస్తున్న వారందరూ పక్కనే ఉన్న తుమ్మచెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కొంతసేపటికి చెట్టు కుకటి వేళ్లతో కూర్చున్న వారిపై పడిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా కూలీలలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివాంజల్ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పెనుగాలి బీభత్సం
- కోత దశలో పంటలు నేలపాలు - అన్నదాతకు లక్షలాదిగా నష్టం - పరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి గాలి,వాన బీభత్సం సృష్టించింది. అందివచ్చిన పంటలపై తన ప్రతాపం చూపింది. రైతులను తీవ్ర నష్టానికి గురి చేసింది. ముఖ్యంగా అరటి, బొప్పాయి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు ఇలా నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుగ్గలి: మండల పరిధిలోని ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రంగన్న సాగు చేసిన మూడెకరాల బొప్పాయి పంట పూర్తిగా నేలవాలింది. కోత దశలో ఉన్న మూడెకరాల బొప్పాయి తోట నేల కూలింది. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు కన్నీరుమున్నీరయ్యాడు. మొదటి కోతకు రూ.70వేలు వచ్చిందని, ప్రస్తుతం పంట మొదటి కోత కంటే మెరుగ్గా ఉండడంతో రెట్టింపు లాభం వస్తుందనకుంటే ఇలా నేలవాలిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంటలకు పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. సంజామల: పాలేరు వాగు వెంట సాగు చేసిన కోత దశలోని వరి పంట గాలి బీభత్సానికి పూర్తిగా నేలవాలింది. రెండు, మూడు రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ఇలా అకాల వర్షం నాశనం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలేరు వాగు వెంట సుమారు 500 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం కూడా అక్కడడక్క తడిచి పాడైపోయింది. అప్రమత్తమైన కొందరు రైతులు పట్టలు కప్పుకుని కాపడుకున్నారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురం, కోర్నపల్లె పరిధిలో సాగైన అరటి తోటలపై పెనుగాలి తీవ్ర ప్రభావం చూపింది. అబ్దులాపురానికి చెందిన వెంకట శివుడు(బాబు) ఏడెకరాల్లో సాగు చేసిన అరటి పంట రెండు వారాల్లో కోతలు కోయాల్సి ఉండగా గాలి ధాటికి కూలిపోయింది. రూ. 20లక్షలు చేతికొస్తుందనుకుంటే ఇలా గాలికి కూలిపోయిందని రైతు వాపోయాడు. అలాగే రెండు గ్రామాలకు చెందిన కిషోర్, విశ్వనాథరెడ్డి, రామనాథరెడ్డి, ఓబయ్య, చంద్రారెడ్డి తదితర రైతులకు చెందిన 56 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. కోటి రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌడ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య గౌడ్ దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. ఉద్యానవన శాఖాధికారి మదన్‌మోహన్‌గౌడ్, వ్యవసాయాధికారి సురేష్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఫకూర్ అహ్మద్, వీఆర్వో దస్తగిరి దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి బాధిత రైతులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఉరుముల శబ్దానికి మృతి
హాలహర్వి: మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో ఉరుముల శబ్దానికి మల్లయ్య (50) అనే మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. శనివారం మధ్యాహ్నం మల్లయ్య పొలంలో పని చేస్తుండగా భయంకరమైన గాలితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆ శబ్దాలకు భయపడి పొలంలోనే గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన మల్లయ్య ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. కుమారుడు వీరేశ్ పొలానికి వెళ్లి గాలించగా తండ్రి మృతి చెంది ఉండడం కంట పడింది. ఉరుములు మెరుపుల శబ్దానికి భయపడడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..!
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా సోమవారం సాయంత్రం జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పెనుగాలులు వీయడంతో చెట్లు, కరంటు స్తంభాలు విరిగి పడ్డాయి. కల్లూరు మండలంలో వడగండ్ల వాన కురిసింది. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో పెనుగాలులకు చెట్టు విరిగి పడి శివయ్య అనే వ్యక్తి గాయపడ్డారు. మహానంది మండలంలో అరటి చెట్లు నేలకూలాయి. సంజామల, కోవెలకుంట్ల, ఓర్వకల్లు తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. - కర్నూలు(అగ్రికల్చర్) -
ప్రకృతి ప్రకోపం
♦ జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం ♦ విరిగిన చెట్లు, కూలిన స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు గాలి వాన.. పెను బీభత్సం సృష్టించింది. జిల్లాలో పొద్దంతా పొడిపొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మేఘావృతమై భారీ గాలులతో వర్షం కురిసింది. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట తదితర ప్రాంతాల్లో భారీనష్టం వాటిల్లింది. వృక్షాలు.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒక్క కల్హేర్ మండలంలోనే వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావాస షెడ్డు నేలమట్టమయ్యింది. న్యాల్కల్: మండలంలో గురువారం సాయంత్రం వీచిన భారీ గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎరిగిపోయాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. న్యాల్కల్, ముంగి, టేకూర్ తదితర గ్రామాల్లో భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్తు సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి స్తంభాలను, తీగలను సరిచేసి గ్రామాల్లో కరెంటు పునరుద్దరించారు. కంగ్టి మండలంలో భీతావాహం కంగ్టి: మండలంలోని వర్షం భీభత్సం సృష్టిం చింది. చీమల్పాడ్, వంజు తండా, గర్డేగాం, గాజుల్పాడ్ తదితర గ్రామాల్లో ఎల్టీ విద్యుత్ తీగలు, స్తంభాలు విరిగిపడ్డాయి. తడ్కల్‌లో రేకులు ఎగిరి 11 కేవీ విద్యుత్ తీగలపై పడ్డాయి. పిడుగుపాటుకు ఎద్దు మృతి కంగ్టి: తడ్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఘన్పూర్ చెరువులో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షంతో పాటు పిడుగు పడింది. అదే సమయంలో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లిన ఎద్దు మృతిచెందిందని యాజమానురాలు దమ్మని నాగమ్మ తెలిపింది. ఎద్దు విలువ రూ.50 వేలు ఉంటుందని, ఆదుకోవాలని విజ్తప్తి చేసింది. విరిగిన విద్యుత్తు స్తంభాలు రేగోడ్: రేగోడ్, సిందోల్, తాటిపల్లి, కొత్వాన్‌పల్లి, ప్యారారం, చౌదర్పల్లి, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల, దుద్యాల, పలు తండాలు, గ్రామాల్లో పలు ఇళ్ల పైరేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి నేలపై పడ్డాయి. మామిడి తోటలకు తీవ్రనష్టం జహీరాబాద్ టౌన్: ఈదురు గాలులకు జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఈ సంవత్సరం తక్కువగా ఉన్న మామిడి కాపు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రాంనగర్, భరత్‌నగర్, పస్తాపూర్, దిడ్గి, కోత్తూర్. బూచినెల్లి, రంజోల్ గ్రామాల్లోని ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. 100 పైగా ఇళ్లు ధ్వంసం కల్హేర్: కల్హేర్ మండలం సిర్గాపూర్, నల్లవాగు, అంతర్గాం, బోక్కస్‌గాం, గోసాయిపల్లి తదితర చోట్ల గురువారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడంతో దాదాపు 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. సిర్గాపూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంట్ కు సంబందించిన ప్లేట్లు ఎగిరిపోయాయి. నల్లవాగులో ఏర్పాటు చేసిన పశువుల పునరావస కేంద్రం షెడ్లు కూలిపోయాయి. -
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు
సాల్వాపూర్, మన్సాన్పల్లిలో భారీగా పంటనష్టం వెయ్యి ఎకరాల్లో ధ్వంసమైన వరి పంట రాలిపోయిన మామిడి కాయలు బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం కురిసిన వడగళ్లతో కుదేలైన రైతులు, ఆదివారం రాత్రి మరోసారి ప్రకృతి సృష్ట్టించిన బీభత్సానికి విలవిలలాడారు. వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన దుమారంతో వందలాది ఎకరాల్లో మామిడి చెట్లు విరిగిపోవడమేగాక, కాయలు రాలిపోయాయి. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, పడమటికేశ్వాపూర్, ఇటికాపల్లి, బచ్చన్నపేట, తమ్మడపల్లి, కట్కూరు, చినరామన్‌చర్ల, బసిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మండలవ్యాప్తంగా గోలి సైజులో గంటన్నరపాటు కురిసిన వడగళ్లు వెయ్యి ఎకరాల్లో వరి పంటను నాశనం చేశాయి. సుమారు 250 ఎకరాలకుపైగా మక్క పంట, మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు. బాధిత రైతులను ఆదుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు చొక్కం వరల క్ష్మి, బండకింది చంద్రకళ, భైరగోని బాలమణి, బేజాటి సిద్దులు, కాంగ్రెస్ నాయకులు గూడ చెన్న కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. మద్దూరులో గాలి దుమారం మద్దూరు : మండలంలో ఆదివారం సాయంత్రం భారీ గాలిదుమారం రావడంతో చేతికందిన వరి పంట నాశనమైంది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి నిలవ నీడలేకుండా చేశాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికందే సమయంలో గాలి దుమారం రావడంతో రైతు లు కన్నీరుమున్నీరయ్యారు. చేసిన అప్పులు ఎలా తీరేదని వాపోతున్నారు. మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.