ఎన్నాళ్ల కెన్నాళ్లకు..!
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా సోమవారం సాయంత్రం జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పెనుగాలులు వీయడంతో చెట్లు, కరంటు స్తంభాలు విరిగి పడ్డాయి. కల్లూరు మండలంలో వడగండ్ల వాన కురిసింది. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో పెనుగాలులకు చెట్టు విరిగి పడి శివయ్య అనే వ్యక్తి గాయపడ్డారు. మహానంది మండలంలో అరటి చెట్లు నేలకూలాయి. సంజామల, కోవెలకుంట్ల, ఓర్వకల్లు తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
- కర్నూలు(అగ్రికల్చర్)