చెట్టు కూలి ఇద్దరు మృతి
ఈదురు గాలుల బీభత్సంతో చెట్టు కూలి దాని కింద కూర్చున్న అవ్వ, మనుమరాలు మృతి చెందారు.
బసలదొడ్డి (పెద్దకడబూరు): ఈదురు గాలుల బీభత్సంతో చెట్టు కూలి దాని కింద కూర్చున్న అవ్వ, మనుమరాలు మృతి చెందారు. బసలదొడ్డి గ్రామానికి చెందిన బొంపల్లి రంగమ్మ(60), మనుమరాలు అంజనమ్మ(7)లు ఆదివారం తమ పొలంలో ఉల్లినాటు వేయడానికి కూలీలతో వెళ్లారు. సాయంత్రం సమయంలో బలమైన ఈదురు గాలులు, చినుకులు వచ్చాయి. దీంతో పొలంలో పనిచేస్తున్న వారందరూ పక్కనే ఉన్న తుమ్మచెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కొంతసేపటికి చెట్టు కుకటి వేళ్లతో కూర్చున్న వారిపై పడిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా కూలీలలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివాంజల్ తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.