
ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గాలి, వాన బీభత్సం సృష్టిస్తోంది. పొదలకూరు, ఉదయగిరి మండలాలలో పిడుగులు పడ్డాయి. గాలుల ధాటికి పలుప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్థంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. కావలి రూరల్ మండలం గౌరవరంలో గాలులకు హెచ్‌టీ విద్యుత్ తీగల రాపిడి జరిగి మంటలు చెలరేగాయి.
దీంతో నిప్పురవ్వలు పడి అటవీ ప్రాంతానికి అంటుకున్నాయి. ఈ సమాచారాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.