Power cut
-
ఎటు చూసినా అంధకారమే..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన బుడమేరు వరద.. విద్యుత్ సరఫరా వ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు జిల్లాలు, సీఆర్డీఏ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. వరద వల్ల 1.5 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ దాదాపు 70 వేల సర్వీసులకు విద్యుత్ పునరుద్ధరించినట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఆ లెక్కన చూసుకున్నా ఇంకా సగానికిపైగా సర్వీసులకు కరెంటు లేదు. 15 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, ఇప్పటి వరకూ 12 సబ్స్టేషన్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. 33కేవీ సబ్ స్టేషన్లు 78 దెబ్బతినగా, వాటిలో 48 పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్లు 44 పాడవ్వగా, వాటిలో 43 ఫీడర్లు, 11కేవీ ఫీడర్లు 543 ప్రభావితమవ్వగా 477 ఫీడర్లు బాగుచేశారు. ఈ మొత్తం వ్యవస్థను సరిచేయడానికి ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి దాదాపు 1800 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. మొత్తం రూ.4.61 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అజిత్‌సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీల్లో ఇంకా వరద నీరు ఉండటం వల్ల సరఫరా ఇవ్వలేకపోతున్నామని విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ‘సాక్షి’కి వెల్లడించారు. నేటికీ తేరుకోని ఎన్టీటీపీఎస్బుడమేరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్మించిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జల విద్యుత్ ఉత్పత్తి (మినీ హైడల్) ప్లాంటు వల్ల దెబ్బతిన్న ఎన్టీటీపీఎస్ ఇంకా తేరుకోలేదు. జల విద్యుత్ కేంద్రం బుడమేరు వరద ప్రవాహానికి అడ్డుపడటంతో ఆ వరద నీరు వెనక్కి ఎగదన్ని వీటీపీఎస్ను ముంచెత్తింది. దీంతో వీటీపీఎస్‌లో 1,260 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలిగింది. ఇదే వీటీపీఎస్‌లో రోటర్ దెబ్బతినడంతో యూనిట్–8లో పదిహేను రోజుల క్రితం 800 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. తమిళనాడులోని ఉప్పూరు నుంచి కొత్త రోటర్ తీసుకువచ్చారు. అయినా ఈ నెల 10కిగానీ ఈ యూనిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. రెండేళ్లకోసారి చేసే నిర్వహణలో భాగంగా యూనిట్–7లో 500 మెగావాట్ల ఉత్పత్తిని 21 రోజుల పాటు నిలిపివేశారు. అది కూడా ఇంకా పూర్తవ్వలేదు. ఈ మొత్తం 1300 మెగావాట్లకు తోడు ఇప్పుడు బొగ్గు నిర్వహణ వ్యవస్థలను వరద ముంచెత్తడం వల్ల మరో 1,260 మెగావాట్లు ఆగిపోయింది. మొత్తం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా ఇప్పటికి మూడు యూనిట్లను మాత్రమే పునరుద్ధరించగలిగారు. వీటీపీఎస్‌లోని యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీజెన్కో ఎండీ కె.విఎన్. చక్రధర్ బాబు తెలిపారు. -
విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండొద్దు
-
ధగ ధగ.. దగా!
సీహెచ్. వెంకటేశ్: రాత్రి వేళ వీధి దీపాల వెలుగులో మెరిసి పోవాల్సిన హైదరాబాద్ మహానగరంలో చాలాచోట్ల చీకటే రాజ్యమేలుతోంది. ఎక్కువ కాంతిని వెదజల్లడమే కాకుండా, విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు అనేక ప్రాంతాల్లో వెలగడం లేదు. రాత్రిళ్లు అన్ని లైట్లూ వెలుగుతాయని ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్), జీహెచ్ఎంసీ చెబుతున్నా ఆ మేరకు వెలగడం లేదని జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్బోర్డే స్పష్టం చేస్తోంది. అన్ని స్ట్రీట్ లైట్లూ సీసీఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) బాక్స్‌లకు అనుసంధానమైనందున సర్వర్ నుంచి అందే అలర్ట్స్తో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని, చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ, తెల్లారగానే ఆరిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది.ఎల్ఈడీల ఏర్పాటుకు ముందు ఏటా దాదాపు రూ.150 కోట్ల విద్యుత్ చార్జీలు ఉండగా, వీటిని ఏర్పాటు చేశాక ఆ వ్యయం రూ.100 కోట్ల లోపే ఉంటోందని జీహెచ్ఎంసీ పేర్కొంటోంది. పొదుపు సంగతేమో కానీ.. కోటిమందికి పైగా ప్రజలు నివసిస్తున్న భాగ్యనగరంలోని రోడ్లపై అంధకారం నెల కొంటుండటంతో ప్రమాదాలు జరుగుతున్నా యని, దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులకు కూడా ఈ పరిస్థితి అనుకూలంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో?⇒ గత 4 రోజులుగా మా ఏరియాలో స్ట్రీట్‌లైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ మ్యాన్‌హోళ్లతో ఎప్పు డు, ఎక్కడ, ఏ ప్రమా దం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులకు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – కె.రాజశేఖరరెడ్డి, ఓల్డ్ మలక్పేటరాత్రివేళ రక్షణ కావాలి⇒ అడ్డగుట్ట వీధుల్లో దీపాలు వెలగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లైట్ల చుట్టూ పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వెలు తురు రోడ్లపై పడటం లేదు. చెట్ల కొమ్మలు తొలగించాలని, వెలగని విద్యుత్ దీపాల కు మరమ్మతులు చేయాలని అధికారు లను కోరుతున్నా స్పందించడంలేదు. కొన్ని బస్తీ ల్లో పగటి వేళ కూడా లైట్లు వెలుగు తున్నాయి. ఇప్పటికైనా చెట్ల కొమ్మల్ని తొలగించి, మరమ్మ తులు చేసి రాత్రి వేళల్లో మాకు రక్షణ కల్పించాలి. – సంతోషమ్మ , అడ్డగుట్టగురువారం ఇదీ పరిస్థితి⇒ గురువారం (27వ తేదీ) అర్ధరాత్రి 1.20 గంటలు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ డాష్‌బోర్డు మేరకే నగరంలో 43.79 శాతం వీధిదీపాలు మాత్రమే వెలుగుతున్నాయి. అయితే అది కూడా తప్పే. సీసీఎంఎస్ బాక్సులకు కనెక్టయిన లైట్లలో 43.79 శాతం వెలుగుతున్నాయన్న మాట. వాస్తవానికి ఈ వివరాలు నమోదయ్యే డాష్ బోర్డు లింక్‌ను ఎవరికీ తెలియనివ్వరు. మొత్తం లైట్లలో 98 శాతం లైట్లు వెలిగితేనే వీటిని నిర్వహిస్తున్న ఈఈఎస్ఎల్కు చార్జీలు చెల్లించాలి. కానీ ఎవరికే లింకులున్నాయో కానీ చెల్లింపులు మాత్రం నిరాటంకంగా జరిగిపోతున్నాయి.ఇదీ లెక్క..మొత్తం స్ట్రీట్ లైట్స్ 5,10,413కనెక్టెడ్ 3,05,018లైట్స్ ఆఫ్ 1,71,455లైట్స్ ఆన్ 1,33,563గ్లో రేట్ 43.79 %ఎక్కువ ఫిర్యాదులు దీనిపైనే..నగరంలో భారీ వర్షం కురిసి రోడ్లు జలమయమైనప్పుడు.. రాత్రివేళ స్ట్రీట్‌లైట్లు వెల గక, కనిపించని గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించేవారు ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల నుంచి ఇళ్లకు వెళ్లాలంటే భయప డాల్సిన పరిస్థితులు నెలకొంటుండగా, వృద్ధులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. జీహెచ్ఎంసీకి ఎక్కువ ఫిర్యాదులందే అంశాల్లో వీధిదీపాలు వెలగకపోవడం ఒకటి. ఈఈఎస్ఎల్ పనితీరుపై పలు సందర్భాల్లో మేయర్, కమిషనర్ హెచ్చ రించినా ఎలాంటి ఫలితం లేదు.ప్రధాన రహదారుల్లోనూ..కాలనీలు, మారుమూల ప్రాంతాలే కాదు ప్రధాన రహదారుల్లోనూ లైట్లు వెలగడం లేదు. సికింద్రాబాద్ జోన్‌లోని బైబిల్ హౌస్, ముషీరాబాద్, బోయిగూడ, నామాల గుండు, ఆనంద్‌బాగ్, మోండా మార్కెట్, మల్కాజిగిరి రామాలయం, ఎల్బీనగర్ జోన్‌లోని నాగోల్ ఎన్క్లేవ్, లక్ష్మీ రాఘవేంద్ర కేజిల్, చింతల్‌కుంట, స్నేహపురి కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, చార్మినార్ జోన్‌లోని మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, ఖైరతాబాద్ జోన్‌లోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, కూకట్పల్లి జోన్‌లోని కూకట్పల్లి, బోయిన్పల్లి సహా వందలాది ప్రాంతాల్లో లైట్లు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది.వీఐపీలకే వెలుగులా!? ⇒ డాష్‌బోర్డులో జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లు, సర్కిళ్ల వారీగా డేటా నమోదు కావాల్సి ఉండగా చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లకు సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సంపన్నులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, తదితర వీఐపీలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించిన వెలుగుల వివరాలే డాష్ బోర్డులో ఉన్నాయి. ఖైరతా బాద్, శేరిలింగంపల్లి జోన్లలో మాత్రమే 98 శాతా నికి పైగా (కనీసం 98% లైట్లు వెలగాలనే నిబంధనకు అను గుణంగా) వెలుగులుండటం గమనార్హం. కాగా మిగతా జోన్లలో చాలా తక్కువ శాతం మాత్రమే వెలుగు తున్నాయి.పనులు చేయని థర్డ్‌పార్టీ..⇒ ఈఈఎస్ఎల్ తాను నిర్వహించాల్సిన పనుల్ని సబ్ కాంట్రాక్టుకు అప్పగించింది. వారికి చెల్లింపులు చేయకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. బల్బు పోయిందని ఫిర్యాదులొస్తే బల్బు తీస్తున్నారు కానీ కొత్తది వేయడం లేదు. అలాగే ఇతరత్రా పనులూ చేయడం లేదు. అధిక చెల్లింపులు?⇒ విద్యుత్ ఖర్చుల పొదుపు పేరిట జీహెచ్ఎంసీ నగరమంతా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు, ఏడేళ్ల నిర్వహణకు ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం వ్యయం రూ.563.58 కోట్లు. ఎల్ఈడీలతో వెలుగులు బాగుంటాయని, సాధారణ స్ట్రీట్‌లైట్స్ వ్యయంతో పోలిస్తే ఏడేళ్లలో జీహెచ్ఎంసీకి రూ.672 కోట్లు మిగులుతాయని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో పేర్కొంది. అలా పొదుపయ్యే నిధులనే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తామని తెలిపింది. ఇలా ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించినట్లు సమా చారం. కాగా వీధిదీపాలు వెలగాల్సిన మేర వెలగ కున్నా చెల్లింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఒప్పందం మేరకు 5,40,494 వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5,10,413 మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఒప్పందం మేరకు వెలగాల్సిన లైట్లు వెలగనప్పుడు ఈఈఎస్ఎల్కు చెల్లింపులు చేయడం లేదని, కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు కూడా విధించామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. -
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్‌సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్‌నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
కరెంట్.. గాల్లో దీపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఈదురుగాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడి తీగలు తెగిపోవడంతో.. బోడుప్పల్, నారపల్లి, చెంగిచెర్ల, పీర్జాదిగూడలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.పదిరోజుల కింద వాటర్‌బోర్డు ఆధ్వర్య ంలో మంచినీటి పైపులైన్ కోసం రాత్రిపూట తవ్వకాలు చేపట్టగా.. మయూరినగర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33/11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బతింది. ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పదిహేను రోజుల క్రితం బాచుపల్లిలోని 33/11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌లో అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. పలు ఫీడర్ల పరిధిలోని కాలనీలకు పది గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో స్థానికులు సబ్‌స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిపై అవగాహన లేక..తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నెలకు కనీ సం 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. పదేళ్ల క్రితం 1,800 నుంచి 2,200 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 3,900 నుంచి 4,000 మెగావాట్లు దాటింది. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినా.. అంతరాయాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్లకు లైన్లపై సరైన అవగాహన లేకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించలేకపోతున్నారనే విమర్శ ఉంది.ఎవరైనా స్థానికులు ఫలానా చోట వైరు తెగిందనో? ట్రాన్స్ఫార్మర్ పేలిందనో? విద్యుత్ స్తంభం నేల కూలిందనో ఫోన్‌చేసి చెప్తేగానీ సమస్యను గుర్తించలేని పరిస్థితి. అంతేకాదు లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు.సంస్కరణలు చేపట్టినా.. సద్దుమణగని సమస్యలుపరిపాలనలో సౌలభ్యం, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిస్కం వేర్వేరు (ఆపరేషన్స్, సీబీడీ లైన్స్ వింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్) విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ ఏఈ బిల్లింగ్, రెవెన్యూ వసూళ్లకే పరిమితం అయ్యేవారు. ఏదైనా విపత్తు జరిగితే పరిష్కార బాధ్యతను సీబీడీ గ్యాంగ్ నిర్వర్తించేది. ఇక కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులను మాస్టర్ ప్లాన్ విభాగం చూసుకునేది.ఇలా ఎవరి పరిధిలో వాళ్లు ఉండటంతో.. విపత్తుల సమయంలో బ్రేక్‌డౌన్స్, సరఫరా పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచి్చంది. ముషారఫ్ ఫారూఖీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక.. సంస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆపరేషన్స్ ఏఈలకు కూడా అంతరాయాలను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. గతంలో లైన్ల పునరుద్ధరణకు లైన్ క్లియర్ (ఎల్సీ) పేరుతో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపేసేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి చెప్పారు. అయినా అంతరాయాల సమస్య తగ్గడం లేదు. ...గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు చిన్న ఉదాహరణలివి. చిన్న వాన పడినా చాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నిచోట్ల గంటలకు గంటలు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థలు సరిగా లేకపోవడానికి తోడు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, లోపభూయిష్టమైన ఎర్తింగ్ సిస్టం, స్తంభాలకు వేలాడుతున్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు.. వెరసి విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.చినుకు పడితే చీకటే..రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో తరచూ కరెంటు సమస్య వస్తోంది. చినుకుపడితే చాలు చీకటి అవుతోంది. అంతరాయాలు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. ఇంట్లో కరెంట్ లేక ఉక్కపోత, దోమలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. – సదానంద్, బుద్వేల్ -
ఏపీలో ఆల్ టైం హై విద్యుత్ వినియోగం!
-
అసలే వేసవికాలం.. కరెంట్ సరఫరా ప్రశ్నార్థకం!
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాల వాడకం పెరుగుతోంది. రానున్న రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తే వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పీక్ అవర్స్‌లో సరఫరా చేసేందుకు సరిపడా విద్యుత్ మాత్రం తయారుకావడం లేదని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు థర్మల్ విద్యుత్తయారీ కేంద్రాలకు బొగ్గుకొరత ఉందని కేంద్రం ఇటీవల సూచించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 22 థర్మల్ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొంది. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. రోజువారీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచించింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. కానీ, ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నులే ఉన్నట్లు కేంద్ర విద్యుత్ మండలి(సీఈఏ) తెలిపింది. ముందస్తు నిల్వల్లో తగ్గుదల తెలంగాణలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు వెల్లడించింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో సింగరేణి గనులుండటంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోబోమని రాష్ట్ర జెన్కో చెబుతోంది. ఇదీ చదవండి: ‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ సింగరేణిలో అంతంతమాత్రంగానే.. సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నులు పంపాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉంది. అంతకన్నా పాతిక వేల టన్నుల దాకా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆమేరకు సంస్థ సరఫరా చేయలేకపోతోంది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 1,600 మెగావాట్ల విద్యుత్కేంద్రానికి సంస్థ రోజుకు 21,900 టన్నుల బొగ్గు ఇవ్వాలి. ఈ కేంద్రంలో కనీసం 26 రోజులకు అవసరమైనంత ముందస్తు నిల్వ కోటా కింద 5,68,500 టన్నులు ఉండాలి. ప్రస్తుతం 2,24,800 టన్నులే ఉన్నాయి. -
యాదాద్రిలో కాంగ్రెస్‌కు షాక్! కేసీఆర్ సమక్షంలో కారెక్కిన అనిల్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీ భూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు. ధరణిలో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్ అని, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు. గులాబీ గూటికి యాదాద్రి నేతలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్లో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. అనిల్ కుమార్, శేఖర్ రెడ్డి చెరో పదవి తీసుకొని పని చేయాలని సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు జిమ్మేదారి తనదని అన్నారు. అనేక అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రులు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ‘24 గంటల కరెంట్‌తో రైతులు ఎప్పుడైనా పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలోప్రస్తుతం మూడు పంటలు పండుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. రైతు బాగుంటేనే పదిమందికి అన్నం పెడతాడు. బస్వాపూర్ ప్రాజెక్టుతో భువనగిరి, ఆలేరులో కరువే రాదు. 8 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. -
ప్రియుడిని పిలిచి.. గ్రామానికి కరెంట్ తీసేసి..
గ్రామస్తులందరి కన్నుగప్పి తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె ఒక పథకం వేసింది. అది విజయవంతం కావడంతో నిరాటంకంగా ప్రియుడిని కలుసుకుంటూ వస్తోంది. ఒక రోజు ఆమె పథకం విఫలమయ్యింది. దీంతో ఆమె ప్రియునితో పాటు బహిరంగంగా దొరికిపోయింది. బీహార్‌లోని బేతియాలో ఈ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లాలోని నైతాన్ ప్రాంతానికి చెందిన ప్రీతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు గ్రామానికి విద్యుత్ సరఫరా కాకుండా చూసేది. తరచూ విద్యుత్ పోతుండటంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకరోజు ప్రీతి తన ప్రియుడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామానికి కరెంట్ కట్ చేసింది. అయితే అంతటి చీకటిలోనూ ఆ ప్రేమ జంటను గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు. ఆ యువకుడిని సమీప గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. తరువాత రాజ్‌కుమార్ ప్రీతిలకు వివాహం జరిపించారు. గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ మాట్లాడుతూ తన తోటలో ఈ ప్రేమికులను అభ్యంతరకర స్థితిలో చూశామన్నారు. తరువాత గ్రామస్తులు వారిపై దాడి చేశారన్నారు. మరో గ్రామస్తుడు గోవింద్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం పీత్రి తన ప్రియుడిని తోటలో ఎవరికంటపడకుండా కలుసుకునేందుకు ప్రతీరోజూ గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను కట్ చేస్తున్నదని తాము గ్రహించామన్నారు. ఇది కూడా చదవండి: పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు! -
మళ్లీ ‘బషీర్‌బాగ్’ ఉద్యమం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రస్తుతం రాష్ట్రంలో 2003కు ముందు మాదిరి విద్యుత్ కోతలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. అప్పటి విద్యుత్ సంక్షోభం కారణంగా జరిగిన బషీర్‌బాగ్ ఉద్యమం నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు మరోసారి బషీర్‌బాగ్ తరహా ఉద్యమం చేపట్టాలి్సన అవసరం ఉందని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లచ్చతండా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో పాటు రాత్రి కొత్త లింగాల క్రాస్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపిందని, కానీ రైతులకు 24 గంటల విద్యుత్‌పై ఆడంబరపు ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్ అందులో విఫలమయ్యారని విమర్శించారు. ఆయనకు ప్రజలు ఇచ్చిన అవకాశం ముగిసిందని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లలో వేలకోట్ల కుంభకోణం విద్యుత్ కొనుగోళ్లలో రూ.వేలకోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ ఆరోపించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు రూ.60 వేల కోట్ల అప్పుల్లో ఉండగా, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా మారిందని చెప్పారు. పదిహేనేళ్ల క్రితం రిటైర్ అయిన ప్రభాకర్‌రావు, రఘుమారెడ్డి, గోపాలరావులను ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎండీలుగా అందలం ఎక్కించారని విమర్శించారు. కేసీఆర్ చెప్పిన దగ్గరల్లా సంతకాలు పెట్టి.. వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకే వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ గోల్‌మాల్‌పై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించి, అధికారులను ఊచలు లెక్కబెట్టేలా చేస్తామని పేర్కొన్నారు. భూకుంభకోణాలపై విచారణ కోరండి తెల్లాపూర్‌కు సంబంధించిన 100 ఎకరాల భూ కుంభకోణం, మియాపూర్ భూముల కుంభకోణం, కేటీఆర్ ఫామ్‌హౌస్‌తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ల పరిధిలో జరిగిన భూ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేటీఆర్ ఆస్తుల మీద, తన ఆస్తుల మీద, వారి వారి శాఖలు తీసుకున్న నిర్ణయాల మీద, తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు జడ్జితో విచారణ కోరుతూ లేఖ రాద్దామని సవాల్ చేశారు. ఏసీడీ చార్జీలు చెల్లించొద్దు వినియోగదారులెవరూ ఎవరూ ఏసీడీ చార్జీలు చెల్లించవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక చార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు..మంత్రి హరీశ్‌రావు సోదరుడే కావడంతో ‘చట్టంలో నిబంధన ఉంది, ఏసీడీ చార్జీలు వసూలు చేయొచ్చు’అని ఆయన చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగే దోపిడీకి లబ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని రేవంత్ ఆరోపించారు. కమ్యూనిస్టులు దోపిడీదారుల పక్షాన ఉంటారా, ప్రజల పక్షాన కొట్లాడతారో నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని కోరారు. జవాన్ కుటుంబం వినతి జనవరి 5న విధుల్లో ఉండగా మరణించిన జవాన్ భూక్యా రమేష్ కుటుంబ సభ్యులు యాత్రలో రేవంత్‌రెడ్డిని కలిశారు. జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉపాధి, ఉద్యోగం చూపించేలా చూడాలని కోరారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, నేతలు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌పై అనుచిత వాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. -
తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
దాయాది దేశంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఇంధన పొదుపు(విద్యుత్, చమురు)పై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. మార్కెట్లు, మాల్స్, కళ్యాణ మండపాల్లో ఇంధన పొదుపుకు చర్యలు తీసుకుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సర్కార్ సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాల్స్‌ను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో.. మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి. నేడు జరిగిన కేబినెట్ భేటీ కూడా పగటి పూట వెలుతురులోనే జరిగింది. భేటీలో లైట్లను ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో.. 2023 ఏడాది చివరి నాటికి దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, చమురు నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం, ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. -
క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు
పాట్నా: ప్రేమలో ఉన్నప్పుడూ ప్రేమికులు రకరకాల వెర్రి పనులు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొంతమంది ఏకంగా తమ ప్రేమ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా పిచ్చి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక గ్రామానికి కరెంట్ లేకుండా చేశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే....బిహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్ గ్రామంలోని ప్రజలు తరుచు కరెంట్ కోతలతో బాధపడుతున్నారు. ఐతే తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఇలాంటి సమస్య లేదు మా గ్రామానికి మాత్రమే ఏంటీ ? దుస్థితి అని ఆందోళన చెందారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఎలాగైన ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకుని ప్రజలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదీ కూడా కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందు కోసం మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి మరీ ఆ ప్రేమికులిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఆ ఎలక్ట్రీషియన్ని చితకొట్టి మరీ గ్రామంలో ఊరేగించారు. అంతేకాదు ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్, ఇతర గ్రామ కౌన్సిల్ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. ఐతే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్ పై ఎలాంటి కేసు పెట్టలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. (చదవండి: వీడియో: ఎదురుగా భారీ మొసలి.. అడుగు ముందుకు పడ్డా చావే! ఎందుకలాగంటే..) -
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ? ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి. బొగ్గు కొరత ఎలా ఉంది ? దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి. శాఖల మధ్య సమన్వయ లోపం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది. ► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది. ► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది. ► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది. ► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ కోతలు షురూ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాజాగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. డిమాండుకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. రాత్రిపూట సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా త్రీఫేజ్‌విద్యుత్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు. మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏ రోజుకు ఆరోజు విద్యుత్ సరఫరా వేళలను అధికారులు ప్రకటించనున్నారు. కాగా, యాసంగి పంటలు కోతకు వచ్చే సమయంలో పగటిపూట 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఇదొక్కటి ఉంటే చాలు, 80 వేల ఇళ్లకు కరెంట్ సప్లయ్ చేసుకోవచ్చు
ఫొటోలో కనిపిస్తున్నది కొత్త తరహా ఓడ కాదు, ఓ గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. సాధారణంగా గాలిమరలను ఎల్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ గాలి బాగా వీస్తుంది కాబట్టి. అయితే ఎత్తయిన ప్రాంతాల కంటే సముద్రాల మీదే గాలి బాగా వీస్తుంది. మరి ఆ గాలిని ఇప్పటి వరకు ఉపయోగించుకోకపోవడానికి కారణం.. అక్కడ వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతుండడమే. పైగా అక్కడ వీచే పెనుగాలులకు గాలిమర ఫ్యాను రెక్కలు, దానికి ఆధారంగా ఉండే స్తంభం విరిగిపోతాయి. అందుకే నార్వేకు చెందిన ఓ కంపెనీ డబ్ల్యూసీఎస్ (విండ్ క్యాచింగ్ సిస్టం) టెక్నాలజీ ఉపయోగించి దీనిని రూపొందించింది. చతురస్రాకారంలో ఉండే ఈ నిర్మాణం వెయ్యి అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లు అమర్చి, డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అమలు చేశారు. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ అవి ఉత్పత్తి చేసే విద్యుత్ మాత్రం ఒకే చోట నిల్వ అవుతుంది. దీనివల్ల ఏదైనా ఒక ఫ్యాను పనిచేయక పోయినా, ఇతర ఫ్యాన్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉపయోగించుకునే వీలుంటుంది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ గాలిమర ఒకేసారి సుమారు 80 వేల ఇళ్లకు కావల్సిన విద్యుత్‌ను సరఫరా చేయగలదు. ఇది నేల మీద ఉండే 25 గాలిమరల సామర్థ్యానికి సమానం. వీటి మన్నికా ఎక్కువే. సాధారణ గాలిమర మన్నిక 30 సంవత్సరాలు ఉంటే, సముద్రంలోని ఈ గాలిమర 50 సంవత్సరాల వరకు నిరంతరాయంగా పని చేయగలుగుతుంది. త్వరలోనే ఇలాంటి మరిన్ని గాలిమరలను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డబ్ల్యూసీఎస్ కంపెనీ. -
పంపులకు ‘పవర్’ కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది. ఏడాదిగా దాటవేతే.. రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా రూ.777.45 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేసింది. తదనంతరం తాజాగా జొన్నలబొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పడు, విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. మున్ముందు సవాళ్లే... ఇక ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా.. ప్రాజెక్టు ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) విద్యుత్ బిల్లు బకాయి(రూ. కోట్లలో) కల్వకుర్తి 31 777.45 నెట్టెంపాడు 6.78 104.70 బీమా 12.12 74.85 మొత్తం 49.90 957 -
చీకటి చదువులు.. ఇంకెన్నాళ్లు?
రాయ్‌పూర్ : దేశవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. చత్తీస్‌ఘడ్‌లోని ఓ గ్రామంలో మాత్రం గత కొన్నేళ్లుగా విద్యార్థులు సవాళ్లు ఎదుర్కుంటున్నారు. చిమ్మచీకటిలో లాంతరు వెలుగుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి వాళ్లది. బలరాంపూర్ జిల్లాలోని త్రిశూల్ గ్రామంలో పరిస్థితి ఇది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా కూడా ఈ గిరిజన గ్రామానికి కరెంట్ సరఫరా లేదు. జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కూడా పరిస్థితి మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నామని.. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయితే గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉన్న బీజేపీ ఎంపీ రాంవిచార్ నేతమ్ ఇంటికి మాత్రం నిత్యం కరెంట్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావించారు. మరోవైపు గ్రామంలో ప్రైమరీ ఎడ్యూకేషన్ ప్రారంభించినాకూడా సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరు కూడా పాస్ కాలేదు.. ఇప్పటివరకూ ఈ గ్రామంలో ఒక్కరు కూడా పదోతరగతి పాస్ అవ్వలేదని గ్రామస్థులు చెబుతుండగా, కరెంట్ లేకపోవడంతో సరిగ్గా చదవలేక ఫెయిల్ అవుతున్నట్లు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. త్వరలో సమస్యకు పరిష్కారం.. పొరుగునే ఉన్న బుండిపాకు గ్రామానికి కరెంట్ సరఫరా ప్రారంభించామని.. త్వరలోనే త్రిశూల్ గ్రామానికి కూడా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. -
వరి రైతుకు ఉరి
కామారెడ్డి: ఈ సారి ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం 90 వేల హెక్టార్లకు పడిపోయింది. అందులో సగానికి పైగా వరిని బావులు, బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి డివిజన్లో కరెంటు సరఫరా అ స్తవ్యస్తంగా తయారైంది. విద్యుత్ అధికారులు చేతులెత్తేస్తుండడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 25న మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామానికి చెందిన రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో ఏఈని నిలదీస్తే పై నుంచి సరఫరా తగ్గడంతోనే ఇబ్బందులు వచ్చాయని ఆయన తేల్చి చె ప్పారు. ఆదివారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో రైతులు కరెంటు కోతలపై రోడ్డెక్కారు. వేసిన పంటను కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కరెంటు ఉన్నంత సేపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా మడులకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. ఎండలు కూడా మండిపోతుండడంతో పంటల పరిస్థితి మరీ దయనీ యంగా తయారైంది. ఖరీఫ్ తొలినాళ్లలో కురిసిన తొలకరి జల్లులతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నెల రోజులపాటు వర్షాల జాడ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగస్టులో కురిసిన రెండు,మూడు వర్షాలతో ఆశలు పెంచుకుని ఆదరాబాదరాగా వరినాట్లు వేశారు. అప్పటి నుంచీ వానల జాడ లేకుండాపోయింది. దానికితోడు ఎండ లు కూడా మండిపోతుండడం, కరెంటు కోతలు పెరుగడంతో వరికి నీరందడం లేదు. సగానికిపైగా వరి పంట దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలేది అప్పులే వరి పంట దెబ్బ తినడంతో పెట్టుబడులు మీదపడి అప్పులే మిగిలే పరిస్థితి ఏర్పడింది. దున్నడానికి, విత్తనాలు, ఎరువులు, నాట్లు వేయడానికి ఎకరానికి రూ. 20 వే లకు తగ్గకుండా ఖర్చు చేసిన రైతులు, పంట దెబ్బతిన డంతో అప్పులు ఎలా తీర్చేదని వాపోతున్నారు. కామారెడ్డి డివిజన్లోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, స దాశివనగర్, తాడ్వాయి, కామారెడ్డి తదితర మండలాలలో వేలాది ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వరా్షాభావానికి తోడు, కరెంటు సమస్య, మండుతున్న ఎండలు పంట దెబ్బతినడానికి కారణమయ్యాయి. రోజుకు ఐదు గంటల క రెంటు కూడా సరఫరా కాకపోవడం మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. కోతలతో నీరు పారకపోవడం వల్ల పొ ట్టదశలో ఉన్న వరికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీ లక సమయంలో విద్యుత్తును సక్రమంగా అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అధికారులు ఆదుకోవాలి.. ఈసారి వానలు కూడా సక్కగ కురవలేదు. బోరు ఉన్నా కూడా కరెంట్ లేదు. కరెంట్ కోసం పగలు రాత్రి వ్యవసాయ బావి వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడు గంటల పాటు సరఫరా చేస్తామన్న అధికారులు కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు ఆదుకోవాలి. -మల్లయ్య, రైతు,షేర్బీబీపేట్, దోమకొండ