కామారెడ్డి: ఈ సారి ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం 90 వేల హెక్టార్లకు పడిపోయింది. అందులో సగానికి పైగా వరిని బావులు, బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి డివిజన్‌లో కరెంటు సరఫరా అ స్తవ్యస్తంగా తయారైంది.
విద్యుత్ అధికారులు చేతులెత్తేస్తుండడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 25న మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామానికి చెందిన రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో ఏఈని నిలదీస్తే పై నుంచి సరఫరా తగ్గడంతోనే ఇబ్బందులు వచ్చాయని ఆయన తేల్చి చె ప్పారు. ఆదివారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో రైతులు కరెంటు కోతలపై రోడ్డెక్కారు. వేసిన పంటను కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
కరెంటు ఉన్నంత సేపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా మడులకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. ఎండలు కూడా మండిపోతుండడంతో పంటల పరిస్థితి మరీ దయనీ యంగా తయారైంది. ఖరీఫ్ తొలినాళ్లలో కురిసిన తొలకరి జల్లులతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నెల రోజులపాటు వర్షాల జాడ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగస్టులో కురిసిన రెండు,మూడు వర్షాలతో ఆశలు పెంచుకుని ఆదరాబాదరాగా వరినాట్లు వేశారు. అప్పటి నుంచీ వానల జాడ లేకుండాపోయింది. దానికితోడు ఎండ లు కూడా మండిపోతుండడం, కరెంటు కోతలు పెరుగడంతో వరికి నీరందడం లేదు. సగానికిపైగా వరి పంట దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిగిలేది అప్పులే
వరి పంట దెబ్బ తినడంతో పెట్టుబడులు మీదపడి అప్పులే మిగిలే పరిస్థితి ఏర్పడింది. దున్నడానికి, విత్తనాలు, ఎరువులు, నాట్లు వేయడానికి ఎకరానికి రూ. 20 వే లకు తగ్గకుండా ఖర్చు చేసిన రైతులు, పంట దెబ్బతిన డంతో అప్పులు ఎలా తీర్చేదని వాపోతున్నారు. కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, స దాశివనగర్, తాడ్వాయి, కామారెడ్డి తదితర మండలాలలో వేలాది ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
వరా్షాభావానికి తోడు, కరెంటు సమస్య, మండుతున్న ఎండలు పంట దెబ్బతినడానికి కారణమయ్యాయి. రోజుకు ఐదు గంటల క రెంటు కూడా సరఫరా కాకపోవడం మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. కోతలతో నీరు పారకపోవడం వల్ల పొ ట్టదశలో ఉన్న వరికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీ లక సమయంలో విద్యుత్తును సక్రమంగా అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అధికారులు ఆదుకోవాలి..
ఈసారి వానలు కూడా సక్కగ కురవలేదు. బోరు ఉన్నా కూడా కరెంట్ లేదు. కరెంట్ కోసం పగలు రాత్రి వ్యవసాయ బావి వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడు గంటల పాటు సరఫరా చేస్తామన్న అధికారులు కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు ఆదుకోవాలి. -మల్లయ్య, రైతు,షేర్‌బీబీపేట్, దోమకొండ
వరి రైతుకు ఉరి
Published Mon, Sep 29 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement
Advertisement