![girl cut off the electricity of her entire village to meet her boyfriend - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/23/lovers.gif.webp?itok=HR3tKuru)
గ్రామస్తులందరి కన్నుగప్పి తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె ఒక పథకం వేసింది. అది విజయవంతం కావడంతో నిరాటంకంగా ప్రియుడిని కలుసుకుంటూ వస్తోంది. ఒక రోజు ఆమె పథకం విఫలమయ్యింది. దీంతో ఆమె ప్రియునితో పాటు బహిరంగంగా దొరికిపోయింది.
బీహార్‌లోని బేతియాలో ఈ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లాలోని నైతాన్ ప్రాంతానికి చెందిన ప్రీతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు గ్రామానికి విద్యుత్ సరఫరా కాకుండా చూసేది. తరచూ విద్యుత్ పోతుండటంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఒకరోజు ప్రీతి తన ప్రియుడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామానికి కరెంట్ కట్ చేసింది. అయితే అంతటి చీకటిలోనూ ఆ ప్రేమ జంటను గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు.
ఆ యువకుడిని సమీప గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. తరువాత రాజ్‌కుమార్ ప్రీతిలకు వివాహం జరిపించారు. గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ మాట్లాడుతూ తన తోటలో ఈ ప్రేమికులను అభ్యంతరకర స్థితిలో చూశామన్నారు. తరువాత గ్రామస్తులు వారిపై దాడి చేశారన్నారు. మరో గ్రామస్తుడు గోవింద్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం పీత్రి తన ప్రియుడిని తోటలో ఎవరికంటపడకుండా కలుసుకునేందుకు ప్రతీరోజూ గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను కట్ చేస్తున్నదని తాము గ్రహించామన్నారు.
ఇది కూడా చదవండి: పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు!
Comments
Please login to add a commentAdd a comment