Girlfriend Cuts Off Power Supply Of Entire Village In Bihar To Meet Lover - Sakshi
Sakshi News home page

రోజూ ఒకే టైంలో పవర్‌ కట్‌.. అసలు సంగతి తెలిసి షాకైన గ్రామస్తులు!

Published Wed, Jul 19 2023 3:17 PM | Last Updated on Wed, Jul 19 2023 9:43 PM

Girl Power Supply Cuts Off Village To Meet Lover Bihar - Sakshi

పాట్నా: ప్రేమికులు సిటీలో సులభంగా కలుసుకునే వెసలుబాటు ఉంటుంది. అయితే గ్రామంలో ఇలాంటివి కుదరవన్న సంగతి తెలిసిందే. రోజంతా ఇంట్లో పనులు, పోనీ మధ్యలో కలుద్దామా అంటే ఎవరైన చూస్తారన్న భయం కూడా ఉంటుంది. అయితే ఓ యువతి మాత్రం తన ప్రియుడిని కలుసుకునేందుకు కొత్త ప్లాన్‌ వేసింది. రాత్రి పూట్‌ అయితే బెటర్‌ అని భావించి ఓ వింత పనికి పూనుకుంది. రాత్రి వేళలో తాము కలిసే సమయంలో ఎవరి కంట పడకూడదనే ఆలోచనతో ఆ ఊరి మొత్తానికి కరెంట్‌ కట్‌ చేసేది. ఈ వింత ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బేతియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, ఒకే గ్రామం కావడంతో ఇద్దరూ కలుసుకోవడం కుదరడం లేదు. పగలు ఎంత ప్రయత్నించిన కుదరకపోయేసరికి యువతి, రాత్రి సమయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది అందుకు వారి ప్లాన్‌ ప్రకారం ప్రతి రోజూ రాత్రి పూట ఊరిలో కరెంట్ కట్ చేసేసేది.అందుకోసం సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయేది.

ఇలా కొంతకాలంగా వారిద్దరూ కలయిక కోసం గ్రామం మొత్తం అంధకారంలోకి నెట్టేది. దీంతో ప్రతి రోజూ ఇలా ఎందుకు జరుగుతోందా అని అనుమానం వచ్చిన గ్రామస్థులు ఒక రోజు మాటు వేయడంతో.. చీకట్లో యువతి, యువకుడి ప్రేమ వ్యవహారం బైటపడింది. ప్రేమికులిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారమంతా ప్రేమ వ్యవహారానికి సంబంధించినదిగా గ్రామస్థులు గుర్తించారు. యువతి చేస్తున్న పనికి చిరెత్తుకొచ్చిన గ్రామస్తులు ఆమె ప్రియుడిని చితకబాదడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా ముగ్గురు అదపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ప్రేమికురాలు, ప్రియురాలి కుటుంబాల మధ్య సెటిల్‌మెంట్‌ కూడా జరిగి.. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు.

చదవండి  Video: షాకింగ్‌.. ఢిల్లీ వీధుల్లో మహిళా పైలట్‌, భర్తను లాక్కొచ్చి, చితకబాది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement