జెహనాబాద్: బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా హులాస్‌గంజ్ బ్లాక్‌లోని ఓ గ్రామంలోని వారంతా విచిత్రమైన నిబంధనలు పాటిస్తుంటారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలోకి బిఘా గ్రామంలోని వారు మాంసం, మద్యం ముట్టరు. పైగా ఇక్కడి వృద్ధులు ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. గ్రామంలో ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా వెళితే వారి ఇంటిలో అనర్థం జరుగుతుంది స్థానికులు నమ్ముతుంటారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇక్కడ ఎవరింటికి కొత్త కోడలు వచ్చినా ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందే. గ్రామంలోని యువత ఈ మధ్య కాలం నుంచే ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. అయితే వారు మాంసం, చేపలను అస్సలు ముట్టుకోరు. కొన్ని శతాబ్దాలుగా తమ గ్రామంలో మాంసం, చేపలు తినకూడదనే ఆచారం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.
ఈ నియమాన్ని తమ పూర్వీకులు రూపొందించారని పేర్కొన్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘించి గతంలో కొందరు ఇక్కట్ల పాలయ్యారని, గ్రామంలో మద్యం కూడా ఎవరూ ముట్టరని తెలిపారు. ఈ గ్రామానికి చెందిన ఏ యువతికైనా వివాహం జరిగి, అత్తవారింటి వెళ్లాక కూడా ఆమె మాంసాహారం తినదు.
ఇది కూడా చదవండి: ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!
Comments
Please login to add a commentAdd a comment