ఆ గ్రామం.. హోలీకి దూరం! | Holi Festival Not Celebrated in Sajua Village | Sakshi
Sakshi News home page

Bihar: ఆ గ్రామం.. హోలీకి దూరం!

Published Sat, Mar 23 2024 11:15 AM | Last Updated on Sat, Mar 23 2024 12:47 PM

Holi Festival Not Celebrated in Sajua Village - Sakshi

ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ  వేడుకలు  చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది?

బీహార్‌లోని  ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. 

ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ  గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement