మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! | Vegetarian Village: Bihar And Maharashtrs Village People Vegetarians | Sakshi
Sakshi News home page

మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!

Published Sun, Dec 8 2024 4:27 PM | Last Updated on Sun, Dec 8 2024 4:30 PM

Vegetarian Village: Bihar And Maharashtrs Village People Vegetarians

ఎక్కడైనా శాకాహారులు.. మాంసాహారులు ఉంటారు. అందులోనూ ఇప్పుడూ వెరైటీ వంటకాల ఘుమఘమలు విభిన్నమైనవి రావడంతో.. చాలావరకు మాంసాహారులే ఉంటున్నారు. దీంతో నిపుణులు మొక్కల ఆధారిత భోజనమే మంచిదంటూ ఆరోగ్య స్ప్రుహ కలిగించే యత్నం చేస్తున్నారు. ఇక్కడ అలాంటి అవగాహన కార్యక్రమలతో పనిలేకుండానే స్వచ్ఛంధంగా రెండు ఊర్ల ప్రజలంతా శాకాహారులుగా జీవిస్తున్నారట. 

నమ్మశక్యంగా లేకపోయిన ఆ రెండు ఊర్లలోని ప్రజలు మాంసం జోలికిపోరు. ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తిన్నట్లు తెలిస్తే ఇక అంతే.. ! సదరు వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవు. వాళ్లంతా ఈ నియామానికి కట్టుబడి ఉండి శాకాహారులగానే ఉండటం విశేషం. ఎక్కడ ఉన్నాయంటే ఆ ఊర్లు..ఒకటి మహారాష్ట్రలో ఉండగా, ఇంకొకటి బిహార్‌లో ఉంది. 

అందుకోసమే శాకాహారులుగా..
బిహార్‌లోని గయ జిల్లాలో బిహియా అనే ఊరుంది. అక్కడ మూడు శతాబ్దాలుగా ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఉన్న ఈగ్రామంలో 300 ఏళ్ల నుంచి అందరూ శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది అక్కడ వారి  నమ్మకం.

ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని ప్రస్తుత తరాలవారు కూడా పాటించడం విశేషం. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే జీవనశైలిని పాటించాల్సిందే. ఇక్కడ ప్రజలు కనీసం ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. ఈగ్రామంతో పాటు మరో గ్రామం కూడా పూర్తి శాఖాహార గ్రామంగా ఉంది. అది మహారాష్ట్రాలో ఉంది.

మరొక ఊరు..మహారాష్ట్ర.. సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రేనవి అనే గ్రామంలో ప్రజలు స్వచ్ఛమైన శాకాహారాలుగా జీవిస్తున్నారు. ఇక్కడ కూడా గయ గ్రామం మాదిరిగా వందల సంవత్సరాలుగా శాకాహారులుగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా ఎవ్వరూ..మాంసాన్ని ముట్టరు. ఊళ్లోకి తీసుకురారు. ఈ గ్రామంలో ప్రసిద్ధ, పవిత్రమైన రేవణసిద్ధ దేవాలయం ఉంది. అందువల్ల ప్రజలు తరతరాలుగా శాకాహారం మాత్రమే తింటున్నారు.

రావణుడి మహిమ వల్లే..
అంతే కాదు ఇక్కడి అమ్మాయిలను కాని.. అబ్బాయిలను కాని పెళ్ళాడాలి అంటే వాళ్లుకూడా ఆ ఆచారాన్ని పాటించాల్సిందే. పెళ్లి తర్వాత శాకాహారులుగా మారాకే ఈ ఊళ్లో అడుగు పెడతారు. పెళ్లికి ముందే తప్పనిసరిగా ఈ నిబంధన గురించి చెబుతారట. దీనికి అంగీకరిస్తేనే..పెళ్లి జరుగుతుందట. 

దాదాపు 3 వేలకు పైగా జనాబా ఉన్న ఈగ్రామంలో శ్రీ రేవణసిద్ధ నాథుని పవిత్ర స్థలం నవనాథులలోని ఏకనాథుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశారు. అన్ని కులాలు, మతాల వారు నివసిస్తున్న ఈగ్రామంలో ప్రజలంతా.. ఇక్కడి ఆచార వ్యవహారాలను ఇప్పటి వరకు  పాటిస్తూ వస్తుండటం విశేషం.

ఈ ప్రదేశం భక్తుల రద్దీతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ దేవాలయం ప్రతిజ్ఞ చేసే ప్రదేశంగా పేరుగాంచింది. వృద్ధులు కూడా విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాకాహారంగా మారింది. హిందువులు, ముస్లింలతో సహా అన్ని మతాల ప్రజలు ఈ ఊళ్లో నివసిస్తున్నా.. వారు కూడా శాకాహారులుగానే ఉంటున్నారు.

(చదవండి: తేనెటీగల కోసం కృత్రిమపూలు..!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement