
సాక్షి,సనత్‌నగర్(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్దుడిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం..ఇందిరానగర్ కాలనీ ఐడీపీఎల్ గుడిసెల సమీపంలో నివసించే యువతి (23) ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది.
బోరబండ భవానీశంకర్‌నగర్‌కు చెందిన ఆతం మల్లేష్ (27) ఐదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని 2022 ఏప్రిల్ 29న ఓ బాండ్ కూడా రాసిచ్చాడు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోమని యువతి కోరగా అందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. అంతేకాక వేరొక యువతితో వివాహానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
చదవండి అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..
Comments
Please login to add a commentAdd a comment