డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.
‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్‌లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment