నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్‌! | Zomato Food Rescue Option Should Exclude Cash On Delivery Orders Netizen Suggests Other Points, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్‌!

Published Tue, Nov 12 2024 3:28 PM | Last Updated on Tue, Nov 12 2024 4:46 PM

Zomato Food Rescue option should exclude cash on delivery orders netizen suggests other points

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ‘ఫుడ్‌ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌పై కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ స్పందించారు. ఆ నెటిజన్‌కు జాబ్‌ కూడా ఆఫర్‌ చేశారు. అసలు ఆ నెటిజన్‌ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్‌ ఆఫర్‌ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్‌ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్‌ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్‌లు ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్‌లు క్యాన్సిల్‌ అవుతున్నాయి.

కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్‌ చేసిన ఆర్డర్‌లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్‌ మేనేజర్ భాను అనే నెటిజన్‌ ఈ ఫీచర్‌ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..

‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లను మినహాయించాలి. డెలివరీ పార్ట్‌నర్‌ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్‌లు ఆర్డర్‌లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్‌ బుక్‌ చేసి క్యాన్సిల్‌ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్‌ దాన్ని రాయితీతో తిరిగి బుక్‌ చేసి ఇద్దరూ షేర్‌ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్‌ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్‌ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్‌లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్‌ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement