ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.
‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.
ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment