online food retailing business
-
నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఫుడ్ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఆ నెటిజన్‌కు జాబ్ కూడా ఆఫర్ చేశారు. అసలు ఆ నెటిజన్ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్ ఆఫర్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.validations1.should not be applicable to COD2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point 3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place 4.< two cancellations are allowed/ month.— Bhanu (@BhanuTasp) November 10, 2024ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మినహాయించాలి. డెలివరీ పార్ట్నర్ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్లు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు. -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటో
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన విక్రయదారుగా ఉన్న హైదరాబాద్‌లోని హైపర్ప్యూర్ను డీలిస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇటీవల హైపర్‌ప్యూర్ గోదాములో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) తనిఖీ నిర్వహించింది. అందులో ఫుడ్ ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జొమాటో స్పందించింది. కంపెనీ విక్రయదారుగా ఉన్న హైపర్ప్యూర్ను డీలిస్ట్ చేసినట్లు తెలిపింది.హైదరాబాద్‌లోని హైపర్‌ప్యూర్ గోదాములో పుట్టగొడుగుల ప్యాక్‌పై తప్పుడు ప్యాకింగ్ తేదీ నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ వ్యవహారంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ..‘జొమాటో సర్వీసుల్లో భాగంగా హైపర్ప్యూర్తో కలిసి పని చేశాం. కానీ ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీల్లో గోదాములోని అవకతవకలను గుర్తించారు. బటన్ మష్రూమ్కు సంబంధించిన 90 ప్యాకెట్లపై ప్యాకేజింగ్ తేదీ తప్పుగా ముద్రించినట్లు కనుగొన్నారు. జొమాటో ప్రతినిధులు కూడా ఈ సమస్యను గుర్తించారు. ఇది మానవ తప్పిదంగా భావిస్తున్నాం. వెంటనే హైపర్‌ప్యూర్ సర్వీసులను మా డేటాబేస్ నుంచి తొలగిస్తున్నాం. ఈ లోపాన్ని సకాలంలో గుర్తించడంలో మా బృందాలకు సహాయపడే కఠినమైన మార్గదర్శకాలు, సాంకేతిక వ్యవస్థలు మా వద్ద ఉన్నాయి’ అని గోయల్ తెలిపారు.ఇదీ చదవండి: ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) వ్యాపార విభాగమైన జొమాటో హైపర్‌ప్యూర్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కేటరర్స్‌కు మాంసం, చేపలు, ఇతర ఆహారపదార్థాలు సరఫరా చేస్తుంది. కస్టమర్లకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోయల్ చెప్పారు. -
స్విగ్గీకి రూ.35,453 జరిమానా!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.‘హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు అనే కస్టమర్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్షిప్ కార్డును వినియోగించి ఫుడ్ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్ ఆర్డర్ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్ తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..సురేష్ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్షాట్లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ఆలస్యంగా ఫుడ్ డెలివరీ.. ఆపై తీవ్ర దూషణలు!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సేవలపై ఓ మహిళా కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్ ఫుడ్ ఐటమ్‌ను ఆలస్యంగా అందించడమే కాకుండా దూర్భాషలాడినట్లు ఓ కస్టమర్ తెలిపారు. దీనిపై సంస్థ ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేశారు. అందుకు సంబంధించి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు.మహారాష్ట్రకు చెందిన రాధిక బజాజ్ తన ఎక్స్ ఖాతాలో..‘జొమాటోలో ఫుట్ ఆర్డర్ పెట్టాను. నా తరఫు ఆర్డర్ రిసీవ్ చేసుకునేందుకు మా కంపెనీ ఆఫీస్బాయ్ను ఏర్పాటు చేశాను. ముందుగా నిర్ణయించిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేశాడు. ఆలస్యానికి కారణం అడిగిన మా ఆఫీస్ బాయ్‌ను తీవ్రంగా దూషించాడు. జొమాటో డెలివరీ బాయ్‌ల ప్రవర్తనను మెరుగుపరచడంపై కంపెనీ ప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టరు. ఇలా దుర్భాషలాడే హక్కు ఎవరికీ లేదు. డెలివరీ బాయ్‌కి అయినా.. లేదా కంపెనీ సీఈఓ అయినా గౌరవ మర్యాదలు ఒక్కటే విధంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ వ్యవహారంపై జొమాటో సంస్థ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ‘ఇది ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. వెంటనే సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము త్వరలో మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం’ అని స్పందించారు. -
ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో ఆర్డర్‌పై రూ.5గా ఉన్న ఛార్జీని రూ.6కి పెంచారు. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. పెరిగిన రుసుమును ప్రాథమికంగా బెంగుళూరు, దిల్లీలో అమలు చేస్తామని రెండు కంపెనీలు చెప్పాయి.ఈ సంస్థలు అందించే లాయల్టీ సర్వీసుల్లో కస్టమర్ ఎన్‌రోల్‌మెంట్‌తో సంబంధం లేకుండా అన్ని ఫుడ్ ఆర్డర్లకు ఈ ఫీజు వర్తిస్తుందని ప్రకటించాయి. ఇది నేరుగా కంపెనీల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. ఒక్కో ఆర్డర్‌కు తాజాగా పెంచిన రూ.1 ప్రకారం కంపెనీకి రూ.25 లక్షల వరకు అదనపు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసింది.ఇదీ చదవండి: ప్యాకేజీపై అన్ని వివరాలు ఉండాల్సిందే..ఇదిలాఉండగా, జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్, స్విగ్గీకి అనుబంధంగా ఉన్న ఇన్‌స్టామార్ట్ కూడా క్విక్‌కామర్స్ ఆన్లైన్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. కానీ, ఇవి ఎలాంటి ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ఫీజులను వసూలు చేయడంలేదు. అయితే అదే తరహా సర్వీసులను అందిస్తున్న జొప్టో మాత్రం ఈ సంవత్సరం మార్చిలో రూ.2 ప్లాట్‌ఫామ్ రుసుమును ప్రవేశపెట్టింది. ఇది రోజూ దాదాపు 5,50,000 ఆర్డర్లను అందిస్తోంది. ఒక్కో ఆర్డర్‌కు రూ.2 చొప్పున రూ.11 లక్షల అదనపు రోజువారీ ఆదాయం పొందుతుంది. -
ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్ చేసిన ట్యాక్స్ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్‌ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్‌లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేతడిసెంబర్ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు! ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్‌ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్‌వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్
శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు. జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రారంభించామని దీపిందర్ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు. ఇదీ చదవండి..డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్ సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్‌గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్‌కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్‌ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్‌వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్‌కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్‌లో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్‌లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?
గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో.. ప్లాట్‌ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్లలో ఆర్డర్‌కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్‌ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది. ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? కొత్త ప్లాట్‌ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్‌కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్‌వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్‌డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్‌లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్‌లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..?
ఫుడ్ డెలివరీ చేసే టెక్ సంస్థ జొమాటో భారీ ఆర్డర్లను అందించే విస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగా జొమాటో కేటరింగ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫుడ్ డెలివరీతోపాటు ప్రస్తుత రెస్టారెంట్ భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించి కేటరింగ్ సర్వీస్‌లను అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో నిత్యం ఉద్యోగాలు, ఇతర పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు.. ఖాళీ దొరికితే బయటకెళ్లి సమయం గడపాలనుకుంటున్నాయి. ఒంటరిగా కంటే ఉమ్మడిగా, స్నేహితులతో కలిసి సమయం గడుపుతుంటారు. దాంతో వారందరికీ ఫుడ్ ఆర్డర్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలాంటి వారి అవసరాలు తీర్చేలా జొమాటో కేటరింగ్ సర్వీస్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..? ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్‌ను ఈ ఏడాది జూన్‌లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో తాజా స్ట్రాటజీతో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ‘ఎవ్రిడే’ను లాంచ్ చేసింది. -
స్విగ్గీ జొమాటోలకు మరో షాక్:‘ వాయు’ వేగంతో వచ్చేసింది!
సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థలకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన, తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేశాయి. వాయు (Waayu) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, బిజినెస్‌మేన్ సునీల్ శెట్టి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ యాప్‌లో అతనికి వాటా కూడా ఉంది. అంతేకాదు ఓఎన్డీసీతో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది. ఫుడ్ డెలివరీకి బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఇతర అగ్రిగేటర్లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్,పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్‌పడుతుందని అంచనా. (ఇదీ చదవండి: పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!) టెక్ ఫౌండర్స్ అనిరుధ కోట్‌గిరే, మందార్ లాండే స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్ట్స్‌లో వాయు యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్వేర్ యాజ్ఏ సర్వీస్ (SaaS) అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తిమహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్‌లతో ఇతర ముంబై రెస్టారెంట్లతో కస్టమర్లను కనెక్ట్ చేస్తుంది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!) కానీ ఒక్కో అవుట్లెట్కు నెలకు రూ. 1,000 ప్రారంభ ధరతో నిర్ణీత రుసుము. తరువాత ఇది రూ. రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ యాప్‌లో ప్రస్తుతం 1,000కి పైగా రెస్టారెంట్ లిస్టింగ్‌లు ఉన్నాయి. ముంబై మరియు పూణేలో వచ్చే మూడు నెలల్లో 10,000కి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని ఇతర మెట్రో , నాన్-మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది. ఈ వాయు యాప్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. కమీషన్-రహిత మోడల్ ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని ఫౌండర్ అనిరుధ కోట్‌గిరే చెప్పారు. అంతేకాదు సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ, డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో ఉంటుందనీ తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని అనిరుధ తెలిపారు. What a Entry ❤️❤️ Super Cool and Handsome Brand Ambassador @SunielVShetty Sir at the Waayu App launch...❤️❤️@WAAYU_App#sunielshetty #waayu #waayuapp pic.twitter.com/KeNULJBjAI — Suniel Shetty FC (@SunielShetty_FC) May 10, 2023 సునీల్ శెట్టి ఏమన్నారంటే చాలా కాలంగా రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలో భాగస్వామిగా వాయు యాప్ ఒక గొప్ప అవకాశంగా భావించానని, అలాగే హోటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ప్రావీణ్యం సంపాదించానని శెట్టి చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్‌లు వసూలు చేసే అధిక కమీషన్లు రెస్టారెంట్లు, కస్టమర్లను ప్రభావితం చేస్తున్నాయని, దీనికి పరిష్కారాని టైం వచ్చిందన్నారు. అలాగే రెస్టారెంట్లు వారి స్వంత డెలివరీ భాగస్వాములను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నామనీ, డబ్బావాలాలు (ముంబై) డెలివరీ భాగస్వాములుగా రావాలనేది తన కల అని శెట్టి చెప్పారు. (‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు) వాయు యాప్‌ను ఎలా వాడాలి? ♦ఇందులో యాప్‌లో రెండు వెర్షన్లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం వాయు డెలివరీ పార్టనర్, కస్టమర్ల కోసం వాయు యాప్ వినియోగించుకోవచ్చు. ♦ గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి ‘వాయు’ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.లేదా వెబ్సైట్ కూడా ఉంది. ♦ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌తో సైన్ ఇన్, లాగిన్ చేయాలి. ♦ లొకేషన్ ఎంటర్ చేసి,యాక్సెస్‌కు అంగీకరించాలి ♦ మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనూల బ్రౌజ్ చేయండి. ♦ ఆర్డర్ చేయాలనుకుంటున్న వంటకాలను ఎంచుకుని, కార్ట్‌కు జోడించాలి. ♦ ఆర్డర్‌ని మరోసారి చెక్ చేసుకుని, చెక్అవుట్ పై క్లిక్ చేయాలి. ♦ ఆర్డర్‌ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు ♦ వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు. ♦ ఆన్లైన్లో లేదా క్యాష్ ఆన్ డెలివరీయా సెలెక్ట్ చేసుకోవాలి ♦ అందుబాటులో ఉంటే మీరు ఏవైనా కూపన్ కోడ్లు లేదా డిస్కౌంట్లను కూడా వాడుకోవచ్చు ♦ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక రెస్టారెంట్ నుండి నిర్ధారణ మెసేజ్ వస్తుంది. ♦ యాప్ లేదా వెబ్సైట్లో ఆర్డర్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా ♦ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్‌ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి. మీ అనుభవం ఆధారంగా రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వొచ్చు. -
ఆ యాప్ ద్వారా ఫ్రీ ఫుడ్, మందు.. క్షణాల్లోనే వందల ఆర్డర్స్
వాషింగ్టన్: ఆఫర్లో తక్కువ ధరకే ఏదైనా వస్తువు వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. అలాంటిది ఉచితంగా ఆహారం, మందు వస్తుంటే ఊరుకుంటారా? ఓ యాప్ ద్వారా ఉచితంగా ఫుడ్, లిక్కర్ వస్తోందని తెలుసుకుని వందల మంది ఆర్డర్ చేశారు. క్షణాల్లోనే కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటంతో నిర్వహకులు అవాక్కయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. డోర్‌డాష్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సంఘటన ఎదురైంది. ఆ యాప్‌లో పేమెంట్ గేట్‌వే లేకుండానే ఆర్డర్లు బుక్కయ్యాయి. ఈ ఆఫర్ తెలుసుకున్న పలువురు ఆర్డర్ చేయటమే కాదు.. తాము ఉచితంగా పొందామని తమ ఆర్డర్ చిత్రాలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అందులో టెకిలా వంటి అత్యంత ఖరీదైనవి సైతం ఉండటం గమనార్హం. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికి డోర్‌డాష్ యాప్ ట్విట్టర్లో ట్రెడింగ్‌లోకి వచ్చింది. అయితే.. ఈ సమయంలో ఎంత మంది పేమెంట్ లేకుండా ఆర్డర్ చేశారనేది మాత్రం తెలియరాలేదు. అయితే.. అలాంటి ఆర్డర్లను తొలగిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలపటం ఉచితంగా ఆహారం, మందు పొందాలనుకున్న వారిని నిరాశకు గురి చేసింది. 'జులై 7న సాయంత్రం డోర్‌డాష్ యాప్‌లో పేమెంట్ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కొద్ది సేపు ఎలాంటి పేమెంట్ లేకుండానే పలువురు యూజర్లు ఆర్డర్ బుక్ చేయగలిగారు. అలా కొందరు వినియోగదారులు ఆర్డర్ చేశారని తెలుసుకుని.. వెంటనే సమస్యను పరిష్కరించాం.' అని డోర్‌డాష్ ప్రతినిధి ఒకరు తెలిపారు. Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL — annabelle. (@oomfabelle) July 8, 2022 Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj — Follow Da Realest (@Cameron_773) July 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులోకి అమెజాన్
బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం, అమెజాన్‌డాట్‌కామ్ భారత్‌లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఐటీ ఇండస్ట్రియలిస్ట్, నారాయణ మూర్తి స్థాపించిన కాటమరన్ వెంచర్ ఫండ్‌తో ఈ వ్యాపారానికి సంబంధించి ప్రస్తుతం అమెజాన్‌డాట్‌కామ్ చర్చలు జరుపుతోందని సమాచారం. . ఈ వ్యాపారంలోకి రావడానికి ఇప్పుడిప్పుడే ఉద్యోగులను నియమించుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో పండుగల సీజన్ మొదలయ్యే సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు 176 శాతం అప్... భారత్‌లో మధ్య తరగతి వర్గాలు పెరుగుతుండటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ జోరుగా పెరుగుతోంది. గత ఏడాది ఆన్లైన్ ఆర్డర్లు 176 శాతం పెరిగాయి. భారత్‌లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలో స్విగ్గీ, జొమాటోలు అగ్రస్థానంలో ఉన్నాయి. ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్, ఓలాలు కూడా ఫుడ్ డెలివరీ సర్వీసులను ఆరంభించాయి. ఉబెర్ సంస్థ, 2017లో ఉబెర్ ఈట్స్ పేరుతో ఈ పుడ్ డెలివరీ సర్వీసులను ప్రారంభించినప్పటికీ, స్విగ్గీ, జొమాటోలతో పోటీపడలేకపోతోంది. ఉబెర్ ఈట్స్‌ను అమెజాన్ కొనుగోలు చేయనున్నదని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ వ్యాపారం నుంచి వైదొలగాలని ఓలా నిర్ణయించుకుంది. కాగా పోటీ తీవ్రత అధికంగా ఉండటంతో అమెరికాలో తన ఫుడ్ డెలివరీ సర్వీసుల విభాగాన్ని అమెజాన్ మూసేసింది. అమెజాన్ సంస్థ 2016లో ప్రైమ్ సర్వీసులను భారత్‌లో ప్రారంభించింది. వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులను అందిస్తోంది. ఇటీవలనే కిరాణా సరుకుల డెలివరీ సర్వీసుల వ్యాపారాన్ని కూడా ఆరంభించింది. అమెజాన్‌లో 5 లక్షల మంది విక్రేతలు చండీగఢ్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయించే విక్రేతల సంఖ్య అయిదు లక్షలు దాటింది. భారత్‌లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన సుమారు అయిదేళ్లలోనే ఈ మైలురాయి సాధించగలిగామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సెల్లర్ సర్వీసెస్) గోపాల్ పిళ్లై తెలిపారు. భారత మార్కెట్‌కు అనువైన సాధనాలను ప్రవేశపెట్టడం వల్లే ఇది సాధ్యపడిందని, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా పెద్దయెత్తున విక్రేతలు తమ ప్లాట్‌ఫాంలో భాగమయ్యారని ఆయన పేర్కొన్నారు. విక్రేతలందరికీ పారదర్శకంగా, సమానమైన అవకాశాలను అమెజాన్ కల్పిస్తోందని పిళ్లై వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలకు తోడ్పాటు అందించే అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం (ఏజీఎస్‌పీ)లో నమోదైన విక్రేతల్లో 80 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందినవారే ఉన్నారని ఆయన చెప్పారు. ఏజీఎస్‌పీ ద్వారా ఇప్పటిదాకా 1 బిలియన్ డాలర్ల దాకా విలువ చేసే ఎగుమతులు జరిగాయని, 2023 నాటికి దీన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని నిర్దేశించుకున్నామని పిళ్లై చెప్పారు. -
ఇక ధరల యుద్ధమే: అమెజాన్ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ : బిగ్ బజార్ లాంటి సూపర్ మార్కెట్ దిగ్గజాలకు అలారమ్ బెల్ మోగింది. అమెజాన్ ఆన్లైన్ ఫుడ్ రిటైలింగ్ బిజినెస్‌లలోకి వచ్చేస్తోంది. ఈ దివాళి సీజన్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ రిటైలింగ్‌ను ప్రారంభించాలని అమెజాన్ ప్లాన్ చేస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సబ్సిడరీ అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ ఎంట్రీ ఇవ్వనుందని, అంతేకాక పనిలో పనిగా ప్రైవేట్ గ్రోసరీ లేబుల్‌ను భారత్‌లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తుందని తెలిపాయి. అమెజాన్ ఎంట్రీతో ఆఫ్‌లైన్‌గా ఫుడ్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిటైలర్లకు, ఆన్లైన్ గ్రోసరీ కంపెనీలకు తీవ్రమైన ధరల యుద్ధం చోటుచేసుకోనుందని వెల్లడవుతోంది. అమెజాన్‌కు ఇటీవలే భారత్‌లో ఆన్‌లైన్‌గా కానీ, ఆఫ్‌లైన్ ద్వారా కానీ ఫుడ్, గ్రోసరీలను విక్రయించేందుకు, నిల్వచేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని కూడా ప్లాన్చేస్తోంది. భారత్ కూడా ఫుడ్ రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తోంది. దీంతో స్థానికంగా తయారుచేసిన, ప్యాక్ చేసిన ఆహారోత్పత్తులను థర్డ్ పార్టీల నుంచి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ప్రైవేట్ లేబుల్ కింద వీటిని విక్రయించనుంది. అమెజాన్ తొలి ప్రైవేట్ గ్రోసరీ లేబుల్‌ను అమెరికాలో గతేడాదే లాంచ్ చేసింది. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్ మెంబర్షిప ద్వారా విక్రయిస్తోంది. అంతేకాక ఆఫ్‌లైన్ అమెజాన్ గో స్టోర్ల ద్వారా తమ దేశంలో గ్రోసరీ వ్యాపారాలను విస్తరించబోతుంది. అమెజాన్ కూడా ఆఫ్‌లైన్ స్టోరు తెరవాలని మన ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇంకా దీనిపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలుచెప్పాయి. కంపెనీ ప్రతినిధి కూడా అమెజాన్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందించడం లేదు.