టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది.
ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది.
ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు
ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్‌కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్‌లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0
— 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment