ఫుడ్ డెలివరీ చేసే టెక్ సంస్థ జొమాటో భారీ ఆర్డర్‌లను అందించే విస్తృత వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగా జొమాటో కేటరింగ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఫుడ్ డెలివరీతోపాటు ప్రస్తుత రెస్టారెంట్ భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఉపయోగించి కేటరింగ్ సర్వీస్‌లను అందించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత కాలంలో నిత్యం ఉద్యోగాలు, ఇతర పనులతో బిజీగా ఉంటున్న ప్రజలు.. ఖాళీ దొరికితే బయటకెళ్లి సమయం గడపాలనుకుంటున్నాయి. ఒంటరిగా కంటే ఉమ్మడిగా, స్నేహితులతో కలిసి సమయం గడుపుతుంటారు. దాంతో వారందరికీ ఫుడ్ ఆర్డర్ చేయడం కొంత కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి అలాంటి వారి అవసరాలు తీర్చేలా జొమాటో కేటరింగ్ సర్వీస్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్‌ఆఫ్.. ఎందుకంటే..?
ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్‌ను ఈ ఏడాది జూన్‌లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్‌లో తాజా స్ట్రాటజీతో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ‘ఎవ్రిడే’ను లాంచ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment