కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌.. తినేసిన డెలివరీ బాయ్‌.. థాంక్స్‌ జొమాటో | Zomato Delivery Partner Eats Customers Undelivered Food Post Viral | Sakshi
Sakshi News home page

కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌.. తినేసిన డెలివరీ బాయ్‌.. థాంక్స్‌ జొమాటో

Published Sun, Mar 16 2025 2:47 PM | Last Updated on Sun, Mar 16 2025 3:10 PM

Zomato Delivery Partner Eats Customers Undelivered Food Post Viral

సోషల్ యాక్టివిస్ట్.. ఇన్‌ఫ్లుయెన్సర్ 'కిరణ్ వర్మ' అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో.. కస్టమర్‌కు డెలివరీ చేయాల్సిన ఫుడ్‌ను, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తినడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఈ విషయాన్ని జొమాటో పార్ట్‌నర్‌తో మాట్లాడాలనుకున్నారు. కానీ నిజం తెలుసుకుని.. 'దీపిందర్ గోయల్'కు థాంక్స్ చెప్పారు.

వర్మ తన కారును పార్కింగ్ చేస్తుండగా, జొమాటో రైడర్ ఒకరు తన బైకుపై కూర్చుని భోజనం చేస్తున్నట్లు గమనించారు. ఆ రైడర్ కస్టమర్ ఆర్డర్ తింటున్నాడని మొదట అనుమానించి, ఒక ఫోటో తీశాడు. అయితే అతని దగ్గరకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎందుకు ఇంత ఆలస్యంగా భోజనం చేస్తున్నారని అడిగినప్పుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ తీసుకున్నారని, కానీ ఎంతసేపటికీ డెలివరీ తీసుకోవడానికి ఎవరూ రాలేదని పేర్కొన్నాడు.

ఎంతసేపు వెయిట్ చేసినా.. ఎవరూ రాకపోవడంతో, ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లుగా మార్క్ చేయాలని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను కోరానని డెలివరీ బాయ్ తెలిపాడు. ఆలా చేస్తే.. జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఆర్డర్‌ను ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఈ ఫుడ్ నేను తింటున్నాను అని అతడు వెల్లడించాడు.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

సాయంత్రం వరకు ఎందుకు భోజనం చేయలేదు అనే ప్రశ్నకు.. హోలీ పండుగ సందర్భంగా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ డెలివరీ చేస్తే.. ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయని డెలివరీ బాయ్ చెప్పారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఆర్డర్‌కు రూ. 10 నుంచి రూ. 25 వరకు లభిస్తుంది. ఇలా వారు నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు సంపాదిస్తారు.

చూడగానే.. డెలివరీ చేయాల్సిన ఫుడ్ తింటున్నాడని అనుకున్నాను. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా.. ఎవరినీ నిందించడం కరెక్ట్ కాదు. ఇది వర్మ గిగ్ కార్మికుల కష్టాలను ప్రతిబింబించేలా చేసిందని కిరణ్ వర్మ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement