శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు.
జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రారంభించామని దీపిందర్ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు.
ఇదీ చదవండి..డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్
సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్‌గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్‌లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment