ఇక ధరల యుద్ధమే: అమెజాన్ వచ్చేస్తోంది!
ఇక ధరల యుద్ధమే: అమెజాన్ వచ్చేస్తోంది!
Published Tue, Aug 8 2017 9:05 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM
న్యూఢిల్లీ : బిగ్ బజార్ లాంటి సూపర్ మార్కెట్ దిగ్గజాలకు అలారమ్ బెల్ మోగింది. అమెజాన్ ఆన్‌లైన్ ఫుడ్ రిటైలింగ్ బిజినెస్‌లలోకి వచ్చేస్తోంది. ఈ దివాళి సీజన్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ రిటైలింగ్‌ను ప్రారంభించాలని అమెజాన్ ప్లాన్ చేస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సబ్సిడరీ అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ ఎంట్రీ ఇవ్వనుందని, అంతేకాక పనిలో పనిగా ప్రైవేట్ గ్రోసరీ లేబుల్‌ను భారత్‌లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తుందని తెలిపాయి. అమెజాన్ ఎంట్రీతో ఆఫ్‌లైన్‌గా ఫుడ్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న రిటైలర్లకు, ఆన్‌లైన్ గ్రోసరీ కంపెనీలకు తీవ్రమైన ధరల యుద్ధం చోటుచేసుకోనుందని వెల్లడవుతోంది. అమెజాన్‌కు ఇటీవలే భారత్‌లో ఆన్‌లైన్‌గా కానీ, ఆఫ్‌లైన్ ద్వారా కానీ ఫుడ్, గ్రోసరీలను విక్రయించేందుకు, నిల్వచేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో అమెజాన్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంపెనీ 500 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని కూడా ప్లాన్‌చేస్తోంది.
భారత్ కూడా ఫుడ్ రిటైల్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తోంది. దీంతో స్థానికంగా తయారుచేసిన, ప్యాక్ చేసిన ఆహారోత్పత్తులను థర్డ్ పార్టీల నుంచి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత ప్రైవేట్ లేబుల్ కింద వీటిని విక్రయించనుంది. అమెజాన్ తొలి ప్రైవేట్ గ్రోసరీ లేబుల్‌ను అమెరికాలో గతేడాదే లాంచ్ చేసింది. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్ మెంబర్‌షిప ద్వారా విక్రయిస్తోంది. అంతేకాక ఆఫ్‌లైన్ అమెజాన్ గో స్టోర్ల ద్వారా తమ దేశంలో గ్రోసరీ వ్యాపారాలను విస్తరించబోతుంది. అమెజాన్ కూడా ఆఫ్‌లైన్ స్టోరు తెరవాలని మన ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఇంకా దీనిపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలుచెప్పాయి. కంపెనీ ప్రతినిధి కూడా అమెజాన్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందించడం లేదు.
Advertisement