సాక్షి, ముంబై: ఫుడ్ డెలివరీ సంస్థలకు మరోషాక్ తగిలింది. ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన, తక్కువ ధరల ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) యూజర్ల ఆదరణతో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఫుడ్ డెలివరీ యాప్ ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం ముంబై హోటల్స్ తమ సొంత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేశాయి. వాయు (Waayu) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు, బిజినెస్‌మేన్ సునీల్ శెట్టి కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ యాప్‌లో అతనికి వాటా కూడా ఉంది. అంతేకాదు ఓఎన్‌డీసీతో ఇంటిగ్రేట్ చేయాలని కూడా చూస్తోంది.
ఫుడ్ డెలివరీకి బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాయు యాప్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఇతర అగ్రిగేటర్లతో పోలిస్తే 15 నుంచి 20 శాతం తక్కువ ధరలకే అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో కమీషన్లు, ఫేక్ ర్యాంకింగ్,పెయిడ్ రివ్యూలు, నాణ్యత లేకపోవడం లాంటి సమస్యలకు చెక్‌పడుతుందని అంచనా.
(ఇదీ చదవండి: పర్ఫెక్ట్ బిజినెస్ లేడీ నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ తెలుసా మీకు!)
టెక్ ఫౌండర్స్ అనిరుధ కోట్‌గిరే, మందార్ లాండే స్థాపించిన డెస్టెక్ HORECA ప్రొడక్ట్స్‌లో వాయు యాప్ ఒకటి. ముంబైకి చెందిన ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (AHAR), ఇతర పరిశ్రమ సంస్థల సపోర్టుతో మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. సాఫ్ట్‌వేర్ యాజ్ఏ సర్వీస్ (SaaS) అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా భగత్ తారాచంద్, మహేష్ లంచ్ హోమ్, బనానా లీఫ్, శివ్ సాగర్, గురు కృపా, కీర్తిమహల్, పర్షియన్ దర్బార్, లడు సామ్రాట్‌లతో ఇతర ముంబై రెస్టారెంట్‌లతో కస్టమర్‌లను కనెక్ట్ చేస్తుంది. రెస్టారెంట్‌ల నుంచి ఎలాంటి కమీషన్ రుసుములను వసూలు చేయదు. (ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!)
కానీ ఒక్కో అవుట్‌లెట్‌కు నెలకు రూ. 1,000 ప్రారంభ ధరతో నిర్ణీత రుసుము. తరువాత ఇది రూ. రెండు వేలుగా నిర్ణయిస్తుంది. ఈ యాప్‌లో ప్రస్తుతం 1,000కి పైగా రెస్టారెంట్ లిస్టింగ్‌లు ఉన్నాయి. ముంబై మరియు పూణేలో వచ్చే మూడు నెలల్లో 10,000కి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ముంబైలో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్ భారతదేశంలోని ఇతర మెట్రో , నాన్-మెట్రో నగరాలకు విస్తరించాలని చూస్తోంది.
ఈ వాయు యాప్ వినియోగదారులకు అత్యంత సరసమైన ధరకే ఫుడ్ డెలివరీ చేయనుంది. కమీషన్-రహిత మోడల్ ద్వారా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో కొత్త మార్పులు తీసుకురానుందని ఫౌండర్ అనిరుధ కోట్‌గిరే చెప్పారు. అంతేకాదు సకాలంలో, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనీ, డెలివరీ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా క్లీన్ ఫుడ్, క్వాలిటీతో ఉంటుందనీ తమకు 16 ఆదాయ మార్గాలు ఉన్నాయని అనిరుధ తెలిపారు.
What a Entry ❤️❤️
— Suniel Shetty FC (@SunielShetty_FC) May 10, 2023
Super Cool and Handsome Brand Ambassador @SunielVShetty Sir at the Waayu App launch...❤️❤️@WAAYU_App#sunielshetty #waayu #waayuapp pic.twitter.com/KeNULJBjAI
సునీల్ శెట్టి ఏమన్నారంటే
చాలా కాలంగా రెస్టారెంట్, హోటల్ పరిశ్రమలో భాగస్వామిగా వాయు యాప్ ఒక గొప్ప అవకాశంగా భావించానని, అలాగే హోటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ప్రావీణ్యం సంపాదించానని శెట్టి చెప్పారు. ఫుడ్ డెలివరీ యాప్‌లు వసూలు చేసే అధిక కమీషన్లు రెస్టారెంట్లు, కస్టమర్‌లను ప్రభావితం చేస్తున్నాయని, దీనికి పరిష్కారాని టైం వచ్చిందన్నారు. అలాగే రెస్టారెంట్లు వారి స్వంత డెలివరీ భాగస్వాములను కలిగి ఉండేలా ప్రోత్సహిస్తున్నామనీ, డబ్బావాలాలు (ముంబై) డెలివరీ భాగస్వాములుగా రావాలనేది తన కల అని శెట్టి చెప్పారు. (‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు)
వాయు యాప్‌ను ఎలా వాడాలి?
♦ఇందులో యాప్‌లో రెండు వెర్షన్‌లు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం వాయు డెలివరీ పార్టనర్, కస్టమర్ల కోసం వాయు యాప్ వినియోగించుకోవచ్చు.
♦ గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి ‘వాయు’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.లేదా వెబ్‌సైట్ కూడా ఉంది.
♦ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్‌తో సైన్ ఇన్, లాగిన్ చేయాలి.
♦ లొకేషన్ ఎంటర్ చేసి,యాక్సెస్‌కు అంగీకరించాలి
♦ మీ లొకేషన్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, మెనూల బ్రౌజ్ చేయండి.
♦ ఆర్డర్ చేయాలనుకుంటున్న వంటకాలను ఎంచుకుని, కార్ట్‌కు జోడించాలి.
♦ ఆర్డర్‌ని మరోసారి చెక్ చేసుకుని, చెక్‌అవుట్ పై క్లిక్ చేయాలి.
♦ ఆర్డర్‌ను ప్రాధాన్యతలు లేదా ప్రత్యేక సూచనలతో కస్టమైజ్ చేసుకోవచ్చు
♦ వంటకాలు, రేటింగ్, ధర లేదా ఆఫర్‌ల ద్వారా కూడా ఫిల్టర్ చేయవచ్చు.
♦ ఆన్‌లైన్‌లో లేదా క్యాష్ ఆన్ డెలివరీయా సెలెక్ట్ చేసుకోవాలి
♦ అందుబాటులో ఉంటే మీరు ఏవైనా కూపన్ కోడ్‌లు లేదా డిస్కౌంట్‌లను కూడా వాడుకోవచ్చు
♦ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక రెస్టారెంట్ నుండి నిర్ధారణ మెసేజ్ వస్తుంది.
♦ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ను ట్రాక్ చేయవచ్చు కూడా
♦ డెలివరీ ఎగ్జిక్యూటివ్ నుంచి మీ ఆర్డర్‌ను స్వీకరించండి. మీ ఆహారాన్ని ఆస్వాదించండి.
మీ అనుభవం ఆధారంగా రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment