ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో ఆర్డర్‌పై రూ.5గా ఉన్న ఛార్జీని రూ.6కి పెంచారు. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. పెరిగిన రుసుమును ప్రాథమికంగా బెంగుళూరు, దిల్లీలో అమలు చేస్తామని రెండు కంపెనీలు చెప్పాయి.
ఈ సంస్థలు అందించే లాయల్టీ సర్వీసుల్లో కస్టమర్ ఎన్‌రోల్‌మెంట్‌తో సంబంధం లేకుండా అన్ని ఫుడ్ ఆర్డర్‌లకు ఈ ఫీజు వర్తిస్తుందని ప్రకటించాయి. ఇది నేరుగా కంపెనీల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్‌ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. ఒక్కో ఆర్డర్‌కు తాజాగా పెంచిన రూ.1 ప్రకారం కంపెనీకి రూ.25 లక్షల వరకు అదనపు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఆర్డర్‌కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్‌లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసింది.
ఇదీ చదవండి: ప్యాకేజీపై అన్ని వివరాలు ఉండాల్సిందే..
ఇదిలాఉండగా, జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్, స్విగ్గీకి అనుబంధంగా ఉన్న ఇన్‌స్టామార్ట్ కూడా క్విక్‌కామర్స్ ఆన్‌లైన్ డెలివరీ సర్వీసులను అందిస్తున్నాయి. కానీ, ఇవి ఎలాంటి ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ఫీజులను వసూలు చేయడంలేదు. అయితే అదే తరహా సర్వీసులను అందిస్తున్న జొప్టో మాత్రం ఈ సంవత్సరం మార్చిలో రూ.2 ప్లాట్‌ఫామ్ రుసుమును ప్రవేశపెట్టింది. ఇది రోజూ దాదాపు 5,50,000 ఆర్డర్‌లను అందిస్తోంది. ఒక్కో ఆర్డర్‌కు రూ.2 చొప్పున రూ.11 లక్షల అదనపు రోజువారీ ఆదాయం పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment