స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు!
ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్‌మెంట్‌లు, హాట్ బాక్స్‌ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్‌వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment