ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు.
‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు.
భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్‌ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్‌లో ఉంటాయి.
ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.
Update on our pure veg fleet —
— Deepinder Goyal (@deepigoyal) March 20, 2024
While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will…
Comments
Please login to add a commentAdd a comment