గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో.. ప్లాట్‌ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది.
కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్‌లలో ఆర్డర్‌కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్‌లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్‌ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?
కొత్త ప్లాట్‌ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్‌లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment