Goyal
-
సోషల్ మీడియాతో వల.. బీ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవెల్ మార్కెటింగ్ (పిరమిడ్) మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతానికి భిన్నంగా సైబర్ మోసగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు ఇస్తూ అమాయకులకు వల వేస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, మీరే క్రిప్టోకరెన్సీని అమ్మడం ద్వారా లాభాలు పొందొచ్చని.. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్, ఇతర గృహోపకరణ వస్తువుల విక్రయంతో లాభాలు వస్తాయని, అలాగే మరికొందరిని సభ్యులుగా చేరిస్తే కమీషన్లు వస్తాయని ఊదరగొడుతున్నట్టు తెలిపారు.గతంలో ఇదే తరహాలో ఎంతోమంది నష్టపోయిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. తాజాగా మరోమారు ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ సైబర్ మోసాలు పెరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఈ తరహా మోసాల బారినపడకుండా, ఒకవేళ సైబర్ మోసగాళ్లకు చిక్కితే ఎలా బయటపడాలి.. అన్న విషయాలపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు సూచనలు చేశారు. ఎలా మోసగిస్తారు.. అప్రమత్తంగా ఎలా ఉండాలి?⇒ బాగా లాభాలు వస్తాయని, తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించవచ్చని ఆశచూపి ముగ్గులోకి లాగుతారు. వాస్తవానికి ఈ పిరమిడ్‌లో టాప్‌లో (స్కీంలో తొలుత చేరిన వారు) ఉన్న వారికి మాత్రమే లాభాలు వస్తాయి. ఆ తర్వాత చేరిన వారికి లాభాలు లేకపోగా అసలు సొమ్మునే కొల్లగొడతారు. ⇒ మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీంలు నడిపే కీలక సూత్ర« దారులు విదేశాల్లోనే ఉండి ఈ మోసాలు చేస్తుంటారు. ⇒ లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్లు, అత్యధిక లాభాలు అని ప్రక టనల్లో ఊదరగొడితే అది పక్కా మోసమని గుర్తించాలి.⇒ మీకు వచ్చే ప్రకటనల్లో ఉన్న కంపెనీల పేర్లు, వాటి వ్యాపారం గురించి గుడ్డిగా నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ⇒మల్టీలెవెల్ మార్కెటింగ్‌లో ఒకరి ద్వారా మరొకరు చేరుతుంటారు. ఇలాంటి చైన్లలో చేరొద్దు. ఆయా కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు వెళ్లొద్దు. ⇒ మీకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లలోని అనుమానాస్పద వెబ్‌లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయొద్దు. ⇒ పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఎవరికీ డబ్బులు పంపవద్దు. ఇలా పంపిన సొమ్మును అవతలి వ్యక్తులు దేశవిద్రోహ పనులకు వాడే ప్రమాదం ఉంటుంది. ⇒ ఇలాంటి మోసాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను అప్రమత్తం చేయాలి.కఠిన చర్యలు తీసుకుంటాం.. మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతున్నాయి. వాస్తవ విరుద్ధంగా.. బాగా లాభాలు వస్తాయని వచ్చే ప్రకటనలు మోసపూరితమైనవని అనుమానించాలి. అనుమానాస్పద మెసేజ్‌లు, మోసపూరిత ప్రకటనలపై వెంటనే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ 1930, వాట్సాప్ నంబర్ 8712672222లో ఫిర్యాదు చేయాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – శిఖాగోయల్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ -
ఒక్క ఏడాదిలో 1,866.9 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. భారీ స్థాయిలో సొమ్ము దండుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో తెలంగాణలో సైబర్ నేరాల ఫిర్యాదులు 18 శాతం పెరిగాయి. నేరస్తులు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,866.9 కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. 2024 ఏడాదిలో రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాలు, బాధితులు పోగొట్టుకున్న డబ్బు, కేసుల దర్యాప్తు, నేరస్తుల అరెస్టు, నేరాల కట్టడి కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం వెల్లడించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో’2024 నివేదికను టీజీసీఎస్బీ ఎస్పీ దేవేందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి శిఖాగోయల్ విడుదల చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి 2023లో 91,652 ఫిర్యాదులు రాగా.. 2024లో 1,14,174 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 519 సైబర్ నేరాలకు సంబంధించి 186 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేసుల నమోదులో దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లతోపాటు తెలంగాణ కూడా ఉన్నట్టు వెల్లడించారు. కొత్తగా సైబర్ క్రైం పీఎస్‌లు.. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడిలో భాగంగా ఈ ఏడాది వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, నిజామాబాద్ కమిషనరేట్లలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని శిఖా గోయల్ తెలిపారు. సైబర్ నేరాల కట్టడితోపాటు ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్‌కు సైబర్ వారియర్‌గా శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం 850 మంది సైబర్ వారియర్స్ సైబర్ నేరాల దర్యాప్తు, నియంత్రణలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 నివేదికలోని ప్రధాన అంశాలివే..⇒ 2023లో సైబర్ నేరాలకు సంబంధించి 16,339 ఎఫ్ఐఆర్లు నమోదవగా.. 2024లో 24,643 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ⇒2023లో 1,830 మంది బాధితులకు రూ.8.36 కోట్లు రీఫండ్ చేయగా.. 2024లో 17,411 మంది బాధితులకు రూ.176.71 కోట్లు రీఫండ్ చేయడంలో టీజీసీఎస్బీ అధికారులు సఫలీకృతమయ్యారు. ⇒ టీజీసీఎస్బీ 186 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. ఈ నిందితులకు టీజీసీఎస్బీ పరిధిలోని 94 కేసులతో, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో 823 కేసులతో, దేశవ్యాప్తంగా 3,637 కేసులతో సంబంధాలు ఉన్నాయి. ⇒ గత ఏడాది కాలంలో టీజీసీఎస్బీ 262 పీటీ వారెంట్లు అమలు చేసింది. ⇒టీజీసీఎస్బీకి చెందిన సైకాప్స్ టూల్ ద్వారా గుర్తించిన క్రైం లింకులతో దేశవ్యాప్తంగా 1,057 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నేరస్తులకు దేశవ్యాప్తంగా 1,16,421 కేసులతో సబంధం ఉన్నట్టుగా గుర్తించారు.5 ప్రధాన సైబర్ నేరాలు⇒బిజినెస్ ఇన్వెస్ట్మెంట్–స్టాక్స్ ⇒ పార్ట్‌టైం జాబ్స్ ⇒ డిజిటల్ అరెస్టు ⇒నకిలీ కస్టమర్ కేర్⇒ డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్ ధరలను అదుపు చేసేందుకు గత కొన్నేళ్లలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తాజాగా పేర్కొన్నారు. వెరసి దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి భరోసానిస్తూ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో నియంత్రించనున్నట్లు తెలియజేశారు. నేషనల్ కన్జూమర్ డే సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ఒక వేడుకలో గోయల్ ఇంకా పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం అత్యంత వేగవంతంగా వృద్ధి సాధిస్తున్న భారీ ఎకానమీగా భారత్ నిలుస్తున్నట్లు ప్రస్తావించారు. భవిష్యత్‌లో వృద్ధిని కొనసాగించడంతోపాటు.. ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచేందుకు చర్యలు కొనసాగించనున్నట్లు తెలియజేశారు. కాగా.. అధికారిక గణాంకాల ప్రకారం గత(నవంబర్) నెలలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 5.55 శాతాన్ని తాకింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదైంది. అయితే ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83 శాతానికి చేరాక క్షీణిస్తూ వస్తోంది. -
పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసి సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) చైర్మన్ ఏఎస్ గోయల్ మంగళవారం తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపుతుంది. పీఐబీ ఆమోద ముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలి దశ పనులకు తాజా ధరల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. మూడో సారి సమావేశమైన ఆర్సీసీ తొలి దశ అంచనా వ్యయంపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. మంగళవారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. ఆర్సీసీ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీడబ్ల్యూసీ(పీపీవో) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచా మిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ సీఈ (పీఏవో) యోగేష్ పైతంకర్ పాల్గొన్నారు. పోలవరం సీఈ సుధాకర్‌బాబు ప్రత్యేక ఆహా్వనితుడిగా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లని, ఇందులో రూ.16,119.56 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని రఘురాం వివరించారు. ఇంకా రూ.15,505.80 కోట్ల విలువైన పనులు మిగిలాయని తెలిపారు. తొలి దశ పనులకు రూ.12,911.15 కోట్లు మంజూరు చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారని ఆ శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా గుర్తు చేశారు. తొలి దశ పనుల పూర్తికి మంత్రి ఆమోదించిన వ్యయంకంటే అదనంగా రూ.2,594.65 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. తొలి దశ పనులకు 2013–14 ధరల ప్రకారం ఎంత అవసరం, 2017–18 ధరల ప్రకారం ఎంత అవసరమన్నది మరింత విపులంగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరారు. -
రూ.300 కోట్లు డంప్ చేశారు
బంజారాహిల్స్: విశ్రాంత ఐఏఎస్, మాజీ ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు జరిపారు. ఎన్నికల కోసం ఏకే గోయల్ ఇంట్లో సుమారు 300 కోట్ల రూపాయల డంప్ ఉందని దీనిపై విచారణ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు జూబ్లీహిల్స్‌లోని గోయ ల్ ఇంట్లో సోదాలు జరిపారు. ఐదుగురు అధికారుల బృందం లోపలికి వెళ్లగా జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమాచారం అందుకున్న మల్లు రవితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గోయల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన వాహనాలతోపాటు టాస్‌్కఫోర్స్ సిబ్బంది ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారించారు. అయినప్పటికీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశ్, జ్ఞానేశ్వర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజారుద్దీన్ అండ్ కో ధర్నా పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో జూబ్లీహిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సీ నియర్ కాంగ్రెస్ నాయకుడు భవాని శంకర్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేసి న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా చేశా రు. దీంతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితమే సమాచారం: మల్లు రవి గోయల్ ఇంట్లో నుండి డబ్బులు తరలిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే తమకు సమాచారం అందిందని మల్లు రవి తెలిపారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి నిర్ధారించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చాక కొన్ని వాహనాలు బయటికి వెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రశ్నించినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆరోపించారు. సోదాలు రాత్రి పొద్దు పోయేవరకు సాగాయి. పశ్చిమ మండలం అడిషనల్ డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బాధితులకు భరోసా..
సాక్షి, హైదరాబాద్: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపులతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం. ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ వీ–హబ్‌తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది. ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు? మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు. సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీపార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు. వందకు పైగా బాధితులకు శిక్షణ.. తొలి దశలో మేడ్చల్, వరంగల్ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు. వీ–హబ్ ఏం చేస్తుందంటే? ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్‌లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహాయసహకారాలు అందిస్తారు. వీ–హబ్ మెంటార్షిప్తో పాటు క్రెడిట్ లింకేజ్ కోసం రుణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు. ప్రాథమిక దశలో ఉంది.. మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ -
శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!
రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్‌కు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అండగా నిలిచింది. సలీల్ త్రిపాఠి కుటుంబానికి రూ.10లక్షల బీమాను మంజూరు చేసింది. ఇదే విషయాన్ని జొమాటో సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు జొమాటో డెలివరీ బాయ్‌లు సైతం సలీల్ కుటుంబానికి రూ.12లక్షల మొత్తాన్ని వారి కుటుంబానికి అందించినట్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా 'మా డెలివరీ పాట్నర్ (డెలివరీ బాయ్) సలీల్ త్రిపాఠి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినందకు బాధపడుతున్నాం. ప్రమాదంలో ఒంటరైన బాధితుడి కుటుంబానికి అండగా నిలిచేలా అన్నీ విధాల సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జొమాటో పాట్నర్ మరణిస్తే వారి కుటుంబానికి జొమాటో వ్యక్తిగతంగా సాయం అందిస్తుంది. ప్రమాదం జరిగిన రాత్రి సలీల్ కుటుంబంతో కలిసి ఆస్పత్రిలోనే ఉన్నాం. మరణించిన తర్వాత ఇతర ఖర్చుల కింద కుటుంబానికి సాహాయం చేశామని' దీపిందర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. We are deeply aggrieved by the death of our delivery partner Salil Tripathi in an unfortunate road incident. We are extending all possible support to help the family get through this – pic.twitter.com/yJOUDsPpet — Deepinder Goyal (@deepigoyal) January 13, 2022 ఇక డెలివరీబాయ్ మరణించిన వారి కుటుంబానికి ఎలాంటి అవసరాలున్నాయో.. వాటి అనుగుణంగా జొమాటో సాయంతో చేసేలా అండగా నిలుస్తోంది.సలీల్ భార్య సుచేతకు ఉద్యోగం కావాలంటే జొమాటో అన్ని ప్రయత్నాలు చేస్తుందని, తద్వారా ఆమె ఇంటిని పోషించడానికి, 10 ఏళ్ల కొడుకును చదివించేందుకు తోడ్పడుతుందని గోయల్ ట్వీట్లో ప్రస్తావించారు. తప్పతాగి గత శనివారం రాత్రి ఢిల్లీలో జొమాటోలో డెలివరీబాయ్ సలీల్ త్రిపాఠీ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వెళుతున్న ఓ కార్ సలీల్ త్రిపాఠీ బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాధితుడు సలీల్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో సలీల్ మరణానికి కానిస్టేబుల్ జిలే సింగ్ కారణమని నిర్ధారించారు. మద్యం మత్తులో సలీల్ మరణానికి కారణమైన జిలే సింగ్‌ను పోలీస్ శాఖ అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: శెభాష్ జొమాటో.. అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండు! -
ఓటర్ల డేటా సేఫ్
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల డేటా లీకైందని పలు రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ తోసిపుచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం, అనవసరంగా ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తించడానికి చేసిన ఆకతాయి చర్యేనని కొట్టిపారేశారు. తన కార్యాలయం నుంచి ఏ డేటా లీక్ కాలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో డేటాను సురక్షితంగా భద్రపరిచామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో అంతర్గత అధ్యయనం నిర్వహించామని, ఎక్కడా డేటా బ్రీచ్ జరగలేదని తేలిందన్నారు. పట్టభద్రుల ఓటర్ల డేటా లీకు వివాదంపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివాదానికి కారణమేంటి? ‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో మీరు చోటు సంపాదించారని తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నా.. మెరు గైన సమాజం కోసం పనిచేయడానికి నాకు మీరు మరోసారి అవకాశం, దీవెనలు అందించాలి’అని పేర్కొంటూ బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఓటర్లకు ఎస్ఎంఎస్లు పంపడంవివాదాస్పదమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ల చిరునామా, ఫోన్ నంబర్లుండవు. ఓటరు నమోదులో భాగంగా దరఖాస్తుదారుల నుంచి ఎన్నికల సంఘం ఫోన్ నంబర్లు, చిరునామాలు స్వీకరించింది. ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల డేటా లీకైందని ఆరోపిస్తూ పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌తో పాటు సీఈఓ కార్యాలయానికి ఫిర్యాదులు చేశాయి. ఈసీ అనుమతిస్తే ఇస్తాం..: శశాంక్ గోయల్ ‘కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా/తుది జాబితాల్లో ఓటర్ల చిరునామాలుండవు. అయితే, ముసాయిదా జాబితాలోని ఓటర్లలో ఎంత మంది నిజమైన ఓటర్లున్నారు? ఎంత మంది బోగస్ ఓటర్లున్నారు? అని క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపడానికి వారి చిరునామాలు ఇవ్వాలని కొన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను నేరుగా కలుసుకోవడానికి, సందేశాలు పంపడానికి వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని మరికొన్ని పార్టీలు సైతం కోరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే రాజకీయ పార్టీలకు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తాం. లేకుంటే లేదు. ఓటర్ల జాబితా ఫార్మాట్ మార్చి చిరునామా సైతం పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటేనే ఓటర్ల జాబితాలో చిరునామాలు పెట్టగలం. లేకుంటే లేదు..’అని శశాంక్ గోయల్ పేర్కొన్నారు. అందులో రహస్యం ఏమీ లేదు.. ‘ఎస్ఎంఎస్లు అందరూ పంపుతారు. ఇందులో తప్పేముంది. ఎన్నికల సంఘంతో దీనికి ఏ సంబంధం లేదు. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఇందులో కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ద్వారా సీఈఓ వెబ్సైట్ నుంచి ఓటర్ల చిరునామాలు తీసుకున్నాం. జాబితా ఇస్తే మొత్తం సమాచారాన్ని ఇచ్చే ప్రైవేటు సంస్థలు సైతం ఉన్నాయి’ – ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ -
బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్
ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్ రెండంచెల్లో ఉండనుంది. తొలి దశలో ప్రమోటరు అశోక్ గోయల్ ట్రస్ట్ నుంచి బ్లాక్‌స్టోన్ 51% వాటా కొనుగోలు చేస్తుంది. షేరు ఒక్కింటికి రూ.134 రేటుతో ఈ డీల్ విలువ సుమారు రూ.2,157 కోట్లుగా ఉంటుంది. రెండో దశలో మరో 26% వాటాలను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఒక్కో షేరుకి రూ.139.19 చొప్పున ఓపెన్ ఆఫర్ విలువ రూ.1,054 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎస్సెల్ ప్రోప్యాక్‌కు 10 దేశాల్లో 20 పైగా ప్లాంట్లు, 3,150 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏటా 700 కోట్ల ల్యామినేటెడ్ ట్యూబ్స్‌ను తయారు చేస్తోంది. ఓపెన్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఎస్సెల్ ప్రోప్యాక్ కొనుగోలు విలువ రూ.2,157 కోట్ల నుంచి రూ. 3,211 కోట్ల దాకా ఉండవచ్చని బ్లాక్‌స్టోన్ సీనియర్ ఎండీ అమిత్ దీక్షిత్ చెప్పారు. ఎస్సెల్ గ్రూప్‌తో సంబంధం లేదు: అశోక్ గోయల్ దాదాపు రూ.17,174 కోట్ల రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాశ్ చంద్ర సోదరుడు అశోక్ గోయల్‌కు చెందినదే ఈ ఎస్సెల్ ప్రోప్యాక్. అశోక్ గోయల్ ట్రస్టుకు ఇందులో 57 శాతం వాటాలుండగా.. అందులో 51 శాతం వాటాలను బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేస్తోంది. డీల్ ద్వారా వచ్చిన నిధులను ముంబైలో తాము నిర్వహిస్తున్న అమ్యూజ్మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్‌ను, వాటర్ కింగ్డమ్ను అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని, మరికొన్ని నిధులను దాతృత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తామని గోయల్ చెప్పారు. సోదరుడు సుభాశ్‌చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ రుణభారం తగ్గించేందుకు ఈ నిధులేమైనా ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తమ సంస్థ ఎస్సెల్ గ్రూప్‌లో భాగం కాదని.. గోయల్ ట్రస్టుకు గానీ ఎస్సెల్ ప్రోప్యాక్‌కు గానీ దానితో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ‘మాదంతా ఒకే కుటుంబం. ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటాం. అయితే రెండు గ్రూపుల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గానీ క్రాస్ హోల్డింగ్స్ గానీ లేవు‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అశోక్ గోయల్ ఒప్పందం పూర్తయ్యాక 6 శాతం వాటాలతో కంపెనీలో సలహాదారుగా కొనసాగుతారు. ఇందుకు గాను అయిదేళ్ల పాటు ఏటా రూ.16 కోట్లు అందుకుంటారు. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం ఎస్సెల్ ప్రోప్యాక్ షేరు 0.91 శాతం పెరిగి రూ. 132.65 వద్ద క్లోజయ్యింది. -
ఇక ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. 1973లో బొగ్గు రంగాన్ని జాతీయం చేశాక మళ్లీ ఇన్నాళ్లకు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇది బొగ్గు రంగంలో అత్యంత కీలక సంస్కరణ అని సమావేశానంతరం బొగ్గు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దీంతో బొగ్గు రంగంలో సమర్ధత మరింత పెరుగుతుందని, గుత్తాధిపత్య (కోల్ ఇండియా) ధోరణులకు చెక్ పెట్టినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. బొగ్గు రంగంలో పోటీతత్వం పెరిగేందుకు, చౌక విద్యుత్ టారిఫ్‌లు సాకారమయ్యేందుకు ఇది దోహదపడగలదని గోయల్ వివరించారు. ‘బొగ్గు రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారీ పెట్టుబడులు రావడం వల్ల బొగ్గు నిల్వలున్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది‘ అని గోయల్ పేర్కొన్నారు. బొగ్గు గనుల చట్టం (స్పెషల్ ప్రొవిజన్స్) 2015, గనులు.. ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 కింద బొగ్గు గనులు/బ్లాకుల వేలంలో ఉపయోగించే ప్రక్రియను సీసీఈఏ ఆమోదించినట్లు కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పోటీతో కోల్ ఇండియాకూ ప్రయోజనం.. బొగ్గు రంగాన్ని జాతీయం చేసిన అనంతరం బొగ్గు విక్రయించే అధికారాలు ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకి (సీఐఎల్) మాత్రమే కట్టబెట్టారు. దేశీయంగా ఉత్పత్తయ్యే మొత్తం బొగ్గులో సీఐఎల్ వాటా 80 శాతం ఉంటుంది. తాజా సంస్కరణలతో కోల్ ఇండియా గుత్తాధిపత్యం తగ్గినప్పటికీ.. ఈ రంగంలో పోటీతత్వం పెరగడం ద్వారా ఆ సంస్థకూ ప్రయోజనం చేకూరగలదని మంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. బొగ్గు ఉత్పత్తి దేశీయంగా పెరిగితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని.. తద్వారా విలువైన విదేశీ మారక నిల్వలూ కూడా ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు. పారదర్శకతకు పెద్ద పీట.. బొగ్గు తవ్వకాల కోసం చిన్న, మధ్య స్థాయి, భారీ స్థాయి గనులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఆఫర్ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. పారదర్శకతకు, సులభతరంగా వ్యాపారాల నిర్వహణ విధానాలకు పెద్ద పీట వేసేలా వేలం ప్రక్రియ ఉంటుందన్నారు. సహజ వనరులు దేశాభివృద్ధికే ఉపయోగపడేలా చూసేందుకు ఇది ఉపయోగపడగలదన్నారు. ఈ సంస్కరణలు బొగ్గు సరఫరాపై ఖచ్చితత్వం.. కేటాయింపుల్లో జవాబుదారీతనం పెరిగేందుకు, చౌకగా బొగ్గు లభ్యతకు దోహదపడగలవని, ఇంధన భద్రత సాధించేందుకు తోడ్పడగలవని గోయల్ పేర్కొన్నారు. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కంపెనీలు ఎంతెంత అధికంగా చెల్లిస్తాయన్న ప్రాతిపదికన వేలం ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఆయా గనుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు విక్రయం/వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించింది. దేశీయంగా 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత సాధించేం దుకు ఈ సంస్కరణలు దోహదపడగలవని తెలిపింది. అయిదు బొగ్గు రాష్ట్రాలకు అత్యధిక లబ్ధి .. బొగ్గు గనుల వేలం, విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం అంతా బొగ్గు నిల్వలున్న ఆయా రాష్ట్రాలకే చెందుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ఆర్థిక వృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సదరు రాష్ట్రాలు ఈ ఆదాయాలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చని వివరించింది. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు అత్యధికంగా ప్రయోజనం చేకూరగలదని పేర్కొంది. భారత్‌లో 300 బిలియన్ టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. వీటిలో అత్యధికంగా నిల్వలు అయిదు రాష్ట్రాల్లో.. పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు తాజా సంస్కరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. పోంజీ స్కీములపై కొరడా ♦ నిషేధానికి సమగ్ర చట్టం ♦ పథకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు ♦ ప్రత్యేక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం చిట్టీలు, డిపాజిట్ల పేరుతో సామాన్యులు మోసపోకుండా ఉండేందుకు కేంద్రం రెండు కొత్త బిల్లులు తేనుంది. ఈమేరకు నియంత్రణ లేని డిపాజిట్ల వసూళ్లను నిషేధిస్తూ ప్రతిపాదించిన నూతన బిల్లును కేంద్ర కేబినెట్ మంగళవారం ఇక్కడ ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ‘నియంత్రణ లేని డిపాజిట్ స్కీముల నిషేధ బిల్లు, 2018’, ‘చిట్‌ఫండ్స్(సవరణ) బిల్లు, 2018’ని ఆమోదించింది. అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ‘కొన్ని సంస్థలు, కంపెనీలు..నియంత్రణ చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, మోసపూరిత పథకాలతో సామాన్య ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. దేశీయంగా ఇలాంటి అక్రమ డిపాజిట్ల సమీకరణ కార్యకలాపాల సమస్యను పరిష్కరించడం ఈ బిల్లు ప్రధానోద్దేశం‘ అని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి స్కీముల వల్ల మోసపోయే వారిలో అత్యధికులు పేదలు ఉంటున్నారు. నియంత్రణ సంస్థల కంటబడకుండా పోంజీ స్కీములు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటున్నాయి. కఠిన శిక్షలు.. జరిమానాలు: తాజాగా రూపొం దించిన బిల్లు ప్రకారం .. ఇలాంటి అనధికారిక డిపాజిట్ల సమీకరణపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో పాటు, నిధులు సమీకరించే వారిపై కఠిన శిక్షలు ఉంటాయి. ఒకవేళ డిపాజిట్లు సమీకరించిన సంస్థ మూతబడితే.. ఇన్వెస్టర్లకు సక్రమంగా తిరిగి చెల్లింపులు జరిగేలా చూ సేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని నియమించాల్సి ఉంటుంది. ఈ బిల్లు ప్రధానంగా మూడు రకాల నేరాలను ప్రస్తావించింది. అనధికారిక డిపాజిట్ల పథకాల నిర్వహణ, నియంత్రిత డిపాజిట్ స్కీములలో మోసపూరిత డిఫాల్ట్, అనధికారిక డిపాజిట్ పథకాల్లో చేరేలా ప్రేరేపించడం మొదలైన వాటిని నేరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. స్కీము నడిపే సంస్థ గానీ మూతబడితే .. దాని ఆస్తులను అటాచ్ చేసి, డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు జరిపేందుకు స్పష్టమైన గడువు ఉం టుంది. దేశం మొత్తం మీద డిపాజిట్స్ సమీకరణ కార్యకలాపాల వివరాలను సమీకరించేందుకు, దర్యాప్తు సంస్థలతో పంచుకునేందుకు ఆన్లైన్ సెంట్రల్ డేటా బేస్ ఉంటుంది. -
సెరికల్చర్ కోర్సు దరఖాస్తు గడువు పెంపు
హిందూపురం రూరల్ : కిరికెర పట్టుపరిశోధన కేంద్రం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ ఇన్ సెరికల్చర్ ఆరు నెలల కోర్సు ప్రవేశానికి ఈనెల 15 వరకు గడువు పొడిగించినట్లు పట్టుపరిశ్రమ కేంద్రం డైరెక్టర్ డా.గోయల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు కిరికెర పట్టుపరిశోధన కేంద్రంలో గోవిందరాజులు సెల్ : 9885219474, డా.శేషగిరి సెల్: 9441026695, డా.అజయ్ కుమార్ గోయల్ సెల్ : 95020003728లో సంప్రదించాలన్నారు. -
మీరు యువకులు.. సాగదీయకండి
న్యూఢిల్లీ: సాగదీత ఉపన్యాసాలతో సభాసమయం వృథా చేయడం సరికాదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. లోక్ సభ జీరో అవర్ లో మంత్రి సాగదీత సమాధానాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్సందించిన స్పీకర్.. ''మీరు యువకులు, ఉత్సాహవంతులు, అలాగే మీ సమాధానాలు కూడా చిన్నగా ఉంటే బాగుంటుంది'' అని గోయల్‌కు సూచించారు. గతంలో జీరో అవర్ లో 15 నుంచి 16 ప్రశ్నలకు సమాధానాలు లభించేవని, ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోతోందని సీనియర్ సభ్యుడైన ములాయం ఆవేదన వ్యక్తం చేశారు. -
'గంటన్నర పాటూ చర్చించాం'
ఢిల్లీ: కేంద్ర హోం కార్యదర్శి ఎల్.సీ గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గంటన్నర పాటు భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో కృష్ణారావు మాట్లాడుతూ..గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 పై చర్చించామని తెలిపారు. విభజనలోని షెడ్యూల్ 9,10 పై చర్చించామని చెప్పారు. -
ఢిల్లీలో రాష్ట్ర విభజన పంచాయతీ
-
‘విభజన’ పరిష్కారం ఇక వేగిరం!
గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు రూల్స్ జారీకి కేంద్ర హోంశాఖ సుముఖత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారం ఇక వేగవంతం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్సీ గోయల్ నియామకం కావడంతో విభజన చట్టంలోని అంశాలను ఇక వేగంగా అమలుచేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు భావిస్తున్నారు. బుధవారంనాటి ఢిల్లీ పర్యటనలో సీఎస్, డీజీపీలు ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమై విభజన అంశాలను వివరించారు. ఈ క్రమంలో గోయల్ సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి వరకు హోం కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామి కాలయాపన చేశారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని ఏపీ కూడా భావిస్తోంది. విభ జన చట్టంలోని సెక్షన్ 8(సి) మేరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పదేళ్లపాటు గవర్నర్ పర్యవేక్షించాలి. దీనికి కేంద్ర హోంశాఖ రూల్స్ జారీ చేయలేదు. దీనిపై స్పందించిన గోయల్.. సాధారణ రూల్స్ జారీ చేయవచ్చని అన్నట్టు తెలిసింది. ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు లేదా జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో చట్టంలో హెడ్ క్వార్టర్స్ అని ఉండడంతో టీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లోని ఆస్తుల పంపిణీకే అంగీకరిస్తామని, మిగతా సంస్థల పంపిణీకి అంగీకరించబోమని పేర్కొంది. దీనిపై హెడ్ క్వార్ట ర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలే అంటే కుదరదని, ఆర్టీసీకి ఉమ్మడి రాజధానిలో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, ఆసుపత్రిని నిర్మించారు దానిలో కూడా వాటా కావాలని ఏపీ కోరుతోంది. దీనిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 10వ షెడ్యూల్లో 107 సంస్థలుండగా ఆ సంస్థలు పదేళ్ల పాటు ఉమ్మడి యాజమాన్యంలో పనిచేసేలా ఇరు రాష్ట్రాలూ అవగాన ఒప్పందాలు చేసుకునేలా హోంశాఖ చర్యలు చేపట్టనుంది.