న్యూఢిల్లీ: సాగదీత ఉపన్యాసాలతో సభాసమయం వృథా చేయడం సరికాదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు.
లోక్ సభ జీరో అవర్ లో మంత్రి సాగదీత సమాధానాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్సందించిన స్పీకర్.. ''మీరు యువకులు, ఉత్సాహవంతులు, అలాగే మీ సమాధానాలు కూడా చిన్నగా ఉంటే బాగుంటుంది'' అని గోయల్‌కు సూచించారు. గతంలో జీరో అవర్ లో 15 నుంచి 16 ప్రశ్నలకు సమాధానాలు లభించేవని, ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోతోందని సీనియర్ సభ్యుడైన ములాయం ఆవేదన వ్యక్తం చేశారు.