ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో! | Swati Sachdeva who humorously critiqued Zomato increase in platform fees | Sakshi
Sakshi News home page

ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో!

Published Thu, Jul 18 2024 1:30 PM | Last Updated on Thu, Jul 18 2024 1:38 PM

Swati Sachdeva who humorously critiqued Zomato increase in platform fees

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమెడియన్‌ స్వాతి సచ్‌దేవా కాసేపు నవ్వులు పూయించారు. ఇటీవల జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంచిన నేపథ్యంలో మృదువుగా జోకులు వేశారు. ఈమేరకు విడుదలైన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇటీవల జొమాటో తన ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.5 నుంచి రూ.6కు పెంచినట్లు ప్రకటించింది. దాంతో 20 శాతం ఫీజు పెంచినట్లయింది. ఇది నేరుగా కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఫీజును క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా జరిగిన జొమాటో 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్టాండప్‌ కమెడియన్‌ స్వాతి సచ్‌దేవా మాట్లాడేందుకు స్టేజ్‌పైకి వస్తూ ‘జొమాటో వాళ్లు ఈ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తారేమో.. దీనికి మాత్రం ఎలాంటి ఫీజు వసూలు చేయరని ఆశిస్తున్నా’నని అనడంతో అందరూ నవ్వుకున్నారు.

ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?

ఈ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement