జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్‌కు చెందిన హైదరాబాద్ గోదాంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరిలోని దేవరయాంజల్ వేర్‌హౌజ్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను కనుగొన్నట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం తన ఎక్స్‌ఖాతాలో వివరాలు వెల్లడించింది.
ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్లింకిట్ గోదాంలో ప్రాథమిక పరిశుభ్రత నిబంధనలు పాటించడంలేదు. గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వలున్నాయి.
గోదాంలో ఆహార పదార్థాలను నిల్వచేసే ర్యాక్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయి.
ఫుడ్‌సేఫ్టీ ట్రెయినింగ్ అండ్ సెర్టిఫికేషన్(ఫాస్టాక్) ట్రెయినీ అందుబాటులో లేరు. గోదాంలో పనిచేస్తున్నవారు గ్లౌజులు, ఏప్రాన్లు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.
సరుకులు డెలివరీ ఇచ్చే వక్తుల వద్ద మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. గోదాంలో ఆహార ఉత్పత్తులను కాస్మటిక్ ప్రొడక్ట్‌లను కలిపి నిలువ చేశారు.
ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం హోల్ ఫార్మ్ కన్‌గ్రూయెన్స్ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామా, లేబుల్‌పై ఉన్న అడ్రస్‌లో తేడాలున్నాయి. దీనికి సంబంధించి నోటీసులు ఇస్తామని తెలిపారు.
కామాక్షి ఫుడ్స్ లైసెన్స్ ద్వారా తయారు చేసిన రూ.30వేలు విలువచేసే మైదా, వేరుశెనగ పిండి, బాజ్రా, పోహా..వంటి ఆహార ఉత్పత్తులు గడువు ముగిశాయి.
పాడైపోయినట్లు అనుమానిస్తున్న రూ.52వేలు విలువచేసే రాగుల పిండి, పప్పు నిల్వలను స్వాధీనం చేసుకుని నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించి కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘కంపెనీ భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులు కనుగొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీ గిడ్డంగి భాగస్వామి, ఆహార భద్రతా విభాగంతో కలిసి పని చేస్తాం’ అన్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మె
జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్ కంపెనీ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, టాటా గ్రూప్ యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్ మాదిరి ఆన్‌లైన్ గ్రాసరీ వ్యాపారం చేస్తోంది. ఇది దేశంలోని వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే సరుకులు డెలివరీ ఇస్తోంది. డార్క్ స్టోర్‌ల(సరుకులు ఎక్కడివో వివరాలుండవు) ద్వారా డెలివరీలు అందిస్తోంది. ఈ స్టోర్లు నివాస ప్రాంతాల్లో సాధారణంగా 2,500-3,500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ డెలివరీలను అంతర్గత సిబ్బంది ద్వారా మాత్రమే అందిస్తారు.
Task force team has conducted inspection in 𝗕𝗹𝗶𝗻𝗸𝗶𝘁 𝗪𝗮𝗿𝗲𝗵𝗼𝘂𝘀𝗲 at Devar yamjal, Medchal Malkajgiri District on 05.06.2024.
* The premises found to be very disorganised, unhygienic and dusty at storage racks.
* There is no Fostac trainee available.
* Food… pic.twitter.com/FmZROCrGcC— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 6, 2024
Comments
Please login to add a commentAdd a comment