Grocery delivery
-
హైదరాబాద్ బ్లింకిట్ గోదాంలో కాలంచెల్లిన ఆహార పదార్థాలు
జొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్‌కు చెందిన హైదరాబాద్ గోదాంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరిలోని దేవరయాంజల్ వేర్‌హౌజ్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను కనుగొన్నట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం తన ఎక్స్‌ఖాతాలో వివరాలు వెల్లడించింది.ఆహార భద్రతా విభాగం టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్లింకిట్ గోదాంలో ప్రాథమిక పరిశుభ్రత నిబంధనలు పాటించడంలేదు. గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వలున్నాయి.గోదాంలో ఆహార పదార్థాలను నిల్వచేసే ర్యాక్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయి.ఫుడ్‌సేఫ్టీ ట్రెయినింగ్ అండ్ సెర్టిఫికేషన్(ఫాస్టాక్) ట్రెయినీ అందుబాటులో లేరు. గోదాంలో పనిచేస్తున్నవారు గ్లౌజులు, ఏప్రాన్లు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.సరుకులు డెలివరీ ఇచ్చే వక్తుల వద్ద మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. గోదాంలో ఆహార ఉత్పత్తులను కాస్మటిక్ ప్రొడక్ట్‌లను కలిపి నిలువ చేశారు.ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం హోల్ ఫార్మ్ కన్గ్రూయెన్స్ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామా, లేబుల్‌పై ఉన్న అడ్రస్‌లో తేడాలున్నాయి. దీనికి సంబంధించి నోటీసులు ఇస్తామని తెలిపారు.కామాక్షి ఫుడ్స్ లైసెన్స్ ద్వారా తయారు చేసిన రూ.30వేలు విలువచేసే మైదా, వేరుశెనగ పిండి, బాజ్రా, పోహా..వంటి ఆహార ఉత్పత్తులు గడువు ముగిశాయి.పాడైపోయినట్లు అనుమానిస్తున్న రూ.52వేలు విలువచేసే రాగుల పిండి, పప్పు నిల్వలను స్వాధీనం చేసుకుని నమూనాలను ల్యాబ్‌కు పంపారు.ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించి కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘కంపెనీ భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులు కనుగొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీ గిడ్డంగి భాగస్వామి, ఆహార భద్రతా విభాగంతో కలిసి పని చేస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మెజొమాటో ఆధ్వర్యంలోని బ్లింకిట్ కంపెనీ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, టాటా గ్రూప్ యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్ మాదిరి ఆన్లైన్ గ్రాసరీ వ్యాపారం చేస్తోంది. ఇది దేశంలోని వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వినియోగదారులు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే సరుకులు డెలివరీ ఇస్తోంది. డార్క్ స్టోర్ల(సరుకులు ఎక్కడివో వివరాలుండవు) ద్వారా డెలివరీలు అందిస్తోంది. ఈ స్టోర్లు నివాస ప్రాంతాల్లో సాధారణంగా 2,500-3,500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ డెలివరీలను అంతర్గత సిబ్బంది ద్వారా మాత్రమే అందిస్తారు. Task force team has conducted inspection in 𝗕𝗹𝗶𝗻𝗸𝗶𝘁 𝗪𝗮𝗿𝗲𝗵𝗼𝘂𝘀𝗲 at Devar yamjal, Medchal Malkajgiri District on 05.06.2024. * The premises found to be very disorganised, unhygienic and dusty at storage racks.* There is no Fostac trainee available.* Food… pic.twitter.com/FmZROCrGcC— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 6, 2024 -
భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ బిజినెస్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారంలో 1.6 రెట్లు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ల నిత్యావరస వస్తువులను సరసమైన ధరలతో అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో కంపెనీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.సంస్థ డెలివరీ చేసే అన్ని ఉత్పత్తుల మీద తయారీ తేదీ మాత్రమే కాకుండా ఎక్స్పైరీ తేదీ కూడా పేర్కొంటుంది. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రోలతో పాటు దేశంలోని టైర్ 2 పట్టణాల్లో కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే ఔరంగాబాద్, బంకురా, బొకారో వంటి నగరాల్లో వినియోగదారులకు చేరువవుతోంది. ఛతర్పూర్, గౌహతి, జంషెడ్పూర్, కృష్ణానగర్, విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అధిక ప్రజాదరణ పొందుతోంది.ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ కింద.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, అనంతపురం, బెర్హంపూర్, గోరఖ్‌పూర్ వంటి పట్టణాలతో సహా సుమారు 200కు పైగా నగరాల్లో ఈ రోజు బుక్ చేస్తే.. మరుసటి రోజే డెలివరీ అందిస్తోంది.ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో ఆయిల్, నెయ్యి, గోధుమ పిండి (ఆటా), టీ, కాఫీ, డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ముఖ్యమైన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్.. అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, హుబ్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి కీలక ప్రదేశాల్లో కేంద్రాలను ప్రారంభించింది. నెట్వర్క్ పెరగడంతో ఎక్కువ మంది కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది. -
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్‌స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
కంప్యూటర్ సైన్స్ వదిలేసి 'జెప్టో' స్టార్టప్.. యంగెస్ట్ మిలీయనీర్స్గా
బెంగళూరుకు చెందిన కైవల్య వోహ్ర, ముంబైకి చెందిన అదిత్ పలీచా స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీని మధ్యలోనే వదిలేసి ‘ఏదైనా సాధించాలి’ అనే లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు. ‘జెప్టో’ స్టార్టప్‌తో తిరుగులేని విజయాన్ని సాధించారు. తాజాగా లింక్డిన్ ‘టాప్ 25 స్టార్టప్’ల జాబితాలో ఇ–కామర్స్ గ్రాసరీ ΄ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న వయసులోనే తమ స్టార్టప్ ‘జెప్టో’ను యూనికార్న్ స్టేటస్‌కు తీసుకెళ్లిన కైవల్య వోహ్రా, అదిత్ పలీచాలు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు... లాక్డౌన్ సమయంలో తమకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటే బహుశా ‘జెప్టో’ స్టార్టప్ పుట్టేది కాదేమో. ఆ సమయంలో ముంబైలోని అద్దె ఇంట్లో ఉంటున్న కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు నిత్యావసర వస్తువులకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో నుంచే ‘కిరాణామార్ట్’ స్టార్టప్ పుట్టింది. ఇదే ఆ తరువాత ‘జెప్టో’ రూపంలో విశ్వరూపాన్ని చూపించింది. తిరుగు లేని విజయాలు సాధించడానికి వయసు అడ్డు కాదని, అనుభవం అత్యవసరం కానక్కర్లేదని, కృషి పట్టుదల ఉంటే సరిపోతుందని ‘జెప్టో’ అసాధారణ విజయం నిరూపించింది. ఆరోజుల్లోకి వెళితే...‘మాకు సవాలు విసిరిన టైమ్ అది. నిజానికి కిరాణాషాప్‌ల గురించి మాకు అంతగా తెలియదు. క్రాష్ కోర్సులు కాలేజీల్లోనే కాదు వాటికి అవతల కూడా ఉంటాయి! రోజూ పొద్దున్నే పది నుంచి ఇరవై కిరాణాషాప్లకు వెళ్లి యజమానులతో వివరంగా మాట్లాడి మా కాన్సెప్ట్ చెప్పేవాళ్లం. పిల్లలేదో చెబుతున్నారు...విందాం...అన్నట్లుగా వినేవారు తప్ప మాపై వారికి అంతగా నమ్మకం ఉన్నట్లుగా అనిపించేది కాదు. మా యాప్‌ను కొద్దిమంది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అంగీకరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు కైవల్య వోహ్ర.పరిస్థితులను చూస్తుంటే...‘అబ్బే ఇదేదో మనకు వర్కవుట్ అయ్యేట్లు లేదు. మిత్రమా...రథం వెనుక్కు మళ్లించు’ అనుకునే పరిస్థితి. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ‘సక్సెస్ మంత్రా’లో ఒక రూల్....యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించకు. రణస్థలి వరకు మాత్రమే వెళ్లారు. ఇంకా యుద్ధం మొదలే కాలేదు.వారి కృషి ఫలితంగా మెల్లగా యాప్ ఊపందుకుంది. ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబ్బై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణాదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరీ చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి.ఇప్పుడు...‘జెప్టో’ మన దేశంలోని ప్రధాన నగరాలలో మూడు వేలకు పైగా గ్రాసరీ ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేస్తుంది. గంటలు దాటని, కస్టమర్ ఓపికను పరీక్షించని అతి తక్కువ సమయ డెలివరీ టైమ్‌ను నిర్దేశించుకుంది. ఇద్దరితో మొదలైన ‘జెప్టో’లో ఇప్పుడు వెయ్యిమంది ఉద్యోగులు ఉన్నారు. ‘జెప్టో’ సక్సెస్‌లో ‘యూజర్ ఎక్స్‌పీరియెన్స్’ కీలక భూమిక పోషించింది, ‘విజయానికి త్యాగానికి సంబంధం ఉందా?’ అని అడిగితే ‘కచ్చితంగా ఉంది’ అంటాడు కైవల్య వోహ్ర. ‘ఏ వయసు ముచ్చట ఆ వయసులో’ అంటారు. ఆడి పాడాల్సిన రోజుల్లో, సినిమాలు, షికార్లు, స్నేహితులే ప్రధానమనిపించే రోజుల్లో అన్నీ విడిచిపెట్టి ‘మా స్టార్టపే మా ప్రపంచం’ అన్నట్లుగా పగలు,రాత్రి కష్టపడ్డారు.‘మనం ఒక రంగంలో విజయం సాధించాలంటే మన ఇష్టాలకు దూరంగా ఉండక తప్పదు. దీన్ని త్యాగం అనుకోవచ్చు’ అంటాడు కైవల్య వోహ్ర. మన దేశ గ్రాసరీ సెగ్మెంట్లో తమదైన ముద్ర వేసిన కైవల్య వోహ్ర, అదిత్ పలీచాలు ‘యంగెస్ట్ సెల్ఫ్–మేడ్ మిలీయనీర్స్’గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు. ∙ ‘ఇక సాధించినట్లే’ అనే సంతృప్తితో తబ్బిబై ఉంటే ఆ సంతోషం ఆ సమయానికే పరిమితమై ఉండేదేమో! కాని వారు ‘ఇది చాలు’ అనుకోలేదు. ‘ ఇంకా కావాలి’ అనుకున్నారు. మళ్లీ కిరాణదుకాణాల బాట పట్టారు. సలహాలు, సూచనలకు సంబంధించి యజమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వస్తువులను డెలివరి చేసిన ప్రతిసారీ కస్టమర్‌తో మాట్లాడేవారు. వారికి నచ్చింది ఏమిటి? నచ్చంది ఏమిటి? అడిగే తెలుసుకునేవారు. వారి ‘అనుభవ జ్ఞానం’ అనే పుస్తకంలో ఒకప్పుడు అన్నీ తెల్ల పేజీలే! ఇప్పుడు అవి విలువైన అనుభవాలతో కూడిన అక్షరాలు, పాఠాలు అయ్యాయి. -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. -
చదువుకునే వయసులో స్టార్టప్.. 19 ఏళ్లకే కోటీశ్వరుడు
Kaivalya Vohra Success Story: చదువుకునే వయసులోనే ఏదో సాధించాలనే తపనతో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఒక కంపెనీ స్థాపించి సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న యువకుడు 'కైవల్య వోహ్రా' (Kaivalya Vohra). ఇంతకీ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. చదువుకునే విద్యార్థులలో చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. కానీ కైవల్య స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. 2001లో జన్మించిన కైవల్య వోహ్రా ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసి అమెరికాలో ఇంజినీరింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ సొంతంగా కంపెనీ ప్రారంభించాలని ఆశపడుతున్న కైవల్య అక్కడ చాలా రోజులు ఉండలేకపోయాడు. (ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!) కైవల్య వోహ్రా తన 17వ ఏటనే మొదటి స్టార్టప్‌ని నిర్మించిన తన స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తన స్టార్టప్‌ని ప్రారంభించాడు. వారి మొదటి స్టార్టప్ పేరు గోపూల్. అయితే వారిద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే 'జెప్టో' (Zepto) గురించి ఆలోచించారు. ఆ సమయంలో ఏదైనా ఆర్డర్ చేస్తే అవి డెలివరీ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారు 2021లో జెప్టో (గ్రోసరీ డెలివరీ యాప్) ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కేవలం కొన్ని నెలల్లో 1000 మంది ఉద్యోగులు, ఏజంట్లు ఇందులో చేరారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) జెప్టో ప్రారంభమైన ఒక నెలలోనే వారు 200 మిలియన్ డాలర్లు సంపాదించగలిగారు. ఒక సంవత్సర కాలంలోనే దీని విలువ రూ. 7,300 కోట్లకు చేరింది. ఇప్పటికి కైవల్య నికర విలువ రూ. 1200 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ 10 పెద్ద నగరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ వయసులో కోటీశ్వరుడుగా పేరు తెచ్చుకున్నాడు. -
హురూన్ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్ నాడార్ కుటుంబం (హెచ్‌సీఎల్), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్‌మార్ట్స్) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్‌లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు. తెలుగు రాష్ట్రాల నుంచి.. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్ ల్యాబొరేటరీస్) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్), రూ.13,300 కోట్లతో రామేశ్వర్రావు జూపల్లి కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్–ఇ) 10వ స్థానంలో నిలిచారు. -
లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ) పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్‌స్టామార్ట్.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది. (షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?) 3 గంటల వరకు.. ‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సందేశాలు పంపించింది. జూన్ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్‌స్టామార్ట్ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు. జెప్టో సైతం.. ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సేవలు ఆఫర్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే ప్రశ్నగా పేర్కొన్నాయి. -
జొమాటో కంటే ముందుగానే...10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ప్రారంభించిన గ్రాసరీ సంస్థ..!
జెప్టో ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది..మెరుపు వేగంతో కేవలం పది నిమిషాల్లోనే ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందిస్తుంది. కాగా ఇప్పుడు గ్రాసరీ సేవలతో పాటుగా ఫుడ్ డెలివరీ సేవలను అందించేందుకు సిద్దమైంది జెప్టో. వచ్చేసింది...జెప్టో ‘కేఫ్’ జెప్టో ‘కేఫ్’ అనే సొంత యాప్ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత ముంబై మహానగరంలో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలను జెప్టో మొదలుపెట్టింది. జెప్టో ప్రస్తుతం రూ. 99 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్స్‌పై ఉచితంగా డెలివరీ చేస్తోంది. పది నిమిషాల్లో ఫుడ్‌ను అందించేందకుగాను జెప్టో ముంబైకి చెందిన స్టార్టప్ బ్లూ టోకాయ్ కాఫీ, చాయోస్, గురుకృపా స్నాక్స్, సాసీ టీస్పూన్ వంటి రెస్టారెంట్లతో జత కట్టింది. ప్రస్తుతం కేవలం పది నిమిషాల్లో తయారయ్యే టీ, , సమోసాలు, కాఫీ, శాండ్విచ్స్ వంటి ఆహర పదార్థాలను డెలివరీ చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్నీ నగరాల్లో, ఎక్కువ ఫుడ్ ఐటెమ్స్‌ను డెలివరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా వెల్లడించారు. జొమాటో కంటే ముందుగానే.. కొద్ది రోజుల క్రితం..పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తామని ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. జొమాటోతో పాటుగా ఓలా, స్విగ్గీ వంటి సంస్థలు పది నిమిషాల ఫుడ్ డెలివరీపై ప్రణాళికలను కూడా రచిస్తున్నాయి. ఇక జొమాటో ప్రకటన సోషల్‌మీడియా చర్చకు దారితీసింది. పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఎలా సాధ్యమంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అంతేకాకుండా పది నిమిషాల ఫుడ్ డెలివరీ ప్రకటనపై ఏకంగా పార్లమెంట్లో కూడా చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. 10 నిమిషాల ఫుడ్ డెలివరీపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరణను కూడా ఇచ్చారు. ఇప్పుడు జొమాటోకు గట్టిషాక్‌ను ఇస్తూ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. చదవండి: ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..! కారణం అదే..? -
ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరింత వేగంగా... కేవలం 45 నిమిషాల్లోనే...!
కరోనా రాకతో ఆన్లైన్ గ్రాసరీ సేవలు మరింత ఊపందకున్నాయి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్ధలు సైతం ఆన్లైన్ గ్రాసరీ సేవలను మొదలు పెట్టాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా గ్రాసరీస్ సేవలను కూడా అందిస్తున్నాయి. ఐతే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డుంజో వంటి సంస్థలు 15 నుంచి 20 నిమిషాల్లోనే డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం 10 నుంచి 20 నిమిషాల డెలివరీ సర్వీసులు అందించడం కష్టమని అభిప్రాయపడింది. 45 నిమిషాల్లోనే డెలివరీ... ఆర్డర్ చేసిన కేవలం 45 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించింది. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డెలివరీ సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులు అందించాలని భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయంతో 90 నిమిషాల డెలివరీ సర్వీసులు ఇప్పుడు 45 నిమిషాలకే రానున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ క్విక్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అంతా సులువు కాదు...! 15 నుంచి 20 నిమిషాల్లో డెలివరీ అనేది దీర్ఘకాలంలో కరెక్ట్ బిజినెస్ మోడల్ కాదని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి కృష్ణమూర్తి తెలిపారు. స్థిరమైన బిజినెస్ మోడల్ 30 నుంచి 45 నిమిషాల డెలివరీ సర్వీసులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్‌లో ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో ఫ్రూట్ డోర్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని, మరిన్ని ప్రాంతాలకు వీటిని విస్తరిస్తామని తెలిపారు. -
కాలేజ్ డ్రాప్‌అవుట్స్..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..!
Zepto Success Story In Telugu: కాలేజ్ డ్రాప్‌అవుట్స్...! అయితేనేం ఒక చిన్న ఐడియా 19 ఏళ్ల యువకుల జీవితాలనే మార్చేసింది. సుమారు రూ. 4310 కోట్ల విలువ కల్గిన కంపెనీకి అధిపతులుగా అవతారమెత్తి ఔరా..! అనిపిస్తున్నారు ముంబై యువకులు. బలమైన బేసిక్స్‌తో..కంపెనీ స్థాపన..! ముంబైకు చెందిన 19 ఏళ్ల కుర్రాళ్లు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాం కోర్సు నుంచి తప్పుకున్నారు. భారత్‌కు వచ్చిన వీరు ఇరువురు జెప్టో (Zepto) అనే గ్రాసరీ స్టార్టప్‌ను స్థాపించారు. కంప్యూటర్ సైన్స్‌లో బలమైన బేసిక్స్ ఉండడంతో ఈ స్టార్టప్ నిర్వహణ మరింత సులువైంది. తొలుత ముంబై నగరాల్లో వీరు జెప్టో గ్రాసరీ సేవలను మొదలుపెట్టారు. భారీగా ఆదరణ రావడంతో బెంగళూరు, ఢిల్లీ, మరో నాలుగు నగరాలకు ఈ స్టార్టప్ సేవలను విస్తరించారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్లు..! వై కాంబినేటర్ నిర్వహించిన ఫండింగ్ రౌండ్లో తాజాగా 100 మిలియన్ డాలర్లను జెప్టో సొంతం చేసుకుంది. జెప్టో కంపెనీ స్థాపించిన 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 4310 కోట్ల) కంపెనీగా అవతారమెత్తింది. ఈ కంపెనీ ప్రముఖ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఈ స్టార్టప్‌కు గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, బ్రేయర్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీకు చెందిన లాచీ గ్రూమ్ వంటి ఇన్వెస్టర్లు మద్దతునిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలకు భారీ పోటీ...! భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల అభిప్రాయం. దీంతో ఆయా దిగ్గజ కంపెనీలు ఆన్లైన్ డెలివరీలపై దృష్టిసారించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీలు బ్లింక్ఇట్, డూంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న కంపెనీలకు జెప్టో భారీ పోటీనిస్తోంది. చదవండి: పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..! -
15 నిమిషాల్లోనే సరుకులు డోర్ డెలివరీ: స్విగ్గీ
న్యూఢిల్లీ: నిత్యావసరాల డెలివరీ సర్వీసుల విభాగం ఇన్‌స్టామార్ట్‌పై దాదాపు 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,250 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. గతేడాది గురుగ్రామ్, బెంగళూరులో ప్రారంభమైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం హైదరాబాద్, వైజాగ్‌తో పాటు 18 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. తాజా పళ్లు, కూరగాయలు, బ్రెడ్, గుడ్లు మొదలైన వాటిని ఇన్‌స్టామార్ట్ త్వరితగతిన కస్టమర్లకు అందిస్తోంది. వారానికి 10 లక్షల పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. 2022 జనవరి నాటికి మెజారిటీ కస్టమర్లకు సమీపంలో ఉండే స్టోర్లతో నెట్వర్క్ ఏర్పర్చుకోవడం ద్వారా 15 నిమిషాల్లోనే సరుకులు అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా సాంప్రదాయ ఈ-కామర్స్ పద్ధతిలో ఉత్పత్తుల డెలివరీకి ఒక రోజుపైగా పట్టొచ్చని, క్విక్ కామర్స్ (క్యూ-కామర్స్)తో తక్కువ పరిమాణాల్లోని ఉత్పత్తులనూ చాలా తక్కువ సమయంలో కస్టమర్లకు అందించొచ్చని వివరించింది. క్యూ-కామర్స్ విభాగంలో జొమాటోకి చెందిన గ్రోఫర్స్, డన్జో తదితర సంస్థలతో ఇన్‌స్టామార్ట్ పోటీపడుతుంది. దేశీయంగా క్యూ-కామర్స్ రంగం విలువ ప్రస్తుతం 0.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2025 నాటికి ఇది 5 బిలియన్ డాలర్లకు చేరగలదని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఒక నివేదికలో తెలిపింది. (చదవండి: డేటా గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లులపై ముఖేష్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!) -
ఓలా సరికొత్త బిజినెస్.. 10 నిమిషాల్లో డోర్ డెలివరీ!
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సేవలు భారీగా పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాయి కంపెనీలు. ఆన్లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందించే ఓలా ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓలా కంపెనీ ఇప్పుడు కిరాణా సరుకుల డోర్ డెలివరీ సేవలు అందిస్తుంది. ఈ బిజినెస్‌లో భాగంగా ఓలా ముంబై, బెంగళూరు అంతటా ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. కంపెనీ రోజువారీగా సుమారు 10000 ఆర్డర్లను అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, ముంబైలోని కొన్ని కీలక ప్రాంతాల్లో 'ఓలా స్టోర్'ను తెరిచింది. రాబోయే నెలల్లో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా యాప్ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వస్తువులను ఓలా స్టోర్ నుంచి ఆర్డర్ చేయవచ్చు. కిరాణా డెలివరీ వ్యాపారం కోసం ఓలా 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. జనవరి నాటికి కిరాణా సరుకుల ఫాస్ట్ డెలివరీ కోసం 300 ఓలా స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 55 క్లౌడ్ కిచెన్లను కలిగి ఉన్న ఈ సంస్థ, జనవరి నాటికి ఈ సంఖ్యను 150-160కు విస్తరించాలని యోచిస్తోంది. 2015 జూలైలో రైడ్-హైలింగ్ సంస్థ బెంగళూరులో ఒక స్టాండ్ ఎలోన్ ఆన్లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల కంటే తక్కువ సమయంలోనే ఆ సేవలను మూసివేసింది. రెడ్ సీర్ ప్రకారం, ఈ డోర్ డెలివరీ వ్యాపారం రాబోయే ఐదేళ్లలో 10-15 రెట్లు పెరిగి 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. (చదవండి: మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!) -
సెప్టెంబర్ 17 నుంచి జొమాటోలో ఆ సేవలు బంద్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం జొమాటో తన కిరాణా డోర్ డెలివరీ సేవలను సెప్టెంబర్ 17 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి ఆశించినంత రీతిలో స్పందన రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గ్రోఫర్స్ సంస్థ ఇతర కిరాణా సంస్థల కంటే మెరుగైన ఫలితాలను సృష్టిస్తుందని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది.(చదవండి: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రికల్ వెహికల్) జొమాటో తన కిరాణా భాగస్వాములకు ఒక ఈ-మెయిల్ లో ఇలా పేర్కొంది.. "జొమాటో మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, మా వ్యాపార భాగస్వాములకు మరిన్ని లాభాలను అందించాలని మేము ఆశించాము. మా కస్టమర్లకు, మర్చంట్ భాగస్వాముల ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి ప్రస్తుత మోడల్ అత్యుత్తమ మార్గం కాదని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల, మా పైలట్ కిరాణా డెలివరీ సేవలను 17 సెప్టెంబర్, 2021 నుంచి నిలిపివేయాలని మేం భావిస్తున్నాం'' అని పేర్కొంది. దీని గురుంచి జొమాటో ప్రతినిధిని సంప్రదించినప్పుడు.. "మేము మా కిరాణా పైలట్ మూసివేయాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతానికి మా ప్లాట్ ఫారమ్ పై కిరాణా డెలివరీ సేవలు అందించడానికి ప్రణాళికలు లేవు. గ్రోఫర్స్ 10 నిమిషాలలో కిరాణాలను అందిస్తూ మార్కెట్లో మొదటి స్థానంలో ఉంది" అని అన్నారు. కిరాణా డెలివరీ ఫ్లాట్ ఫారం గ్రోఫర్స్ లో మైనారిటీ వాటాను పొందడానికి 100 మిలియన్ డాలర్లు (సుమారు ₹745 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ఇంతకు ముందు జొమాటో పేర్కొంది. -
జొమాటో నుంచి ఫుడ్ ఒక్కటే కాదు ఇవి కూడా
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో త్వరలో గ్రోసరీ విక్రయాలను ప్రారంభించనుంది. యాప్ ద్వారా ఆన్లైన్ విక్రయాలకు తెరతీయనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అక్షంత్ గోయల్ పేర్కొన్నారు. రూ. 9,375 కోట్ల సమీకరణకు ఈ నెల 14 నుంచి పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. కంపెనీ ఇటీవలే ఆన్లైన్ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్లో 10 కోట్ల డాలర్లు(రూ. 745 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. దేశీయంగా గ్రోసరీ విభాగంలో భారీ అవకాశాలున్నట్లు ఈ సందర్భంగా గోయల్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రోసరీ బిజినెస్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విభాగంలో మరింత విస్తరించే యోచనతోనే గ్రోఫర్స్లో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జొమాటో యాప్ ద్వారా త్వరలోనే ఆన్లైన్ గ్రోసరీ విక్రయాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. వచ్చే వారం ప్రారంభంకానున్న జొమాటో ఐపీవోకు రూ. 72–76 ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించిన విషయం విదితమే. భారీ విలువ పబ్లిక్ ఇష్యూ తదుపరి జొమాటో విలువ రూ. 64,000 కోట్లను అధిగమించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్ విలువలో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్(రూ. 41,000 కోట్లు), బర్గర్ కింగ్ ఇండియా(రూ. 6,627 కోట్లు)లను వెనక్కినెట్టే వీలున్నట్లు అంచనా వేశారు. గత కొంతకాలంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం భారీ వృద్ధిలో సాగుతోంది. ఈ విభాగంలో అధిక మార్కెట్ వాటాను సాధించేందుకు జొమాటో, స్విగ్గీ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 2019–20లో జొమాటో రూ. 2,960 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అయితే రూ. 2,200 కోట్లమేర నిర్వహణ(ఇబిటా) నష్టం నమోదైంది. -
కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే..
సాక్షి, బంజారాహిల్స్: కరోనా పాజిటివ్ బాధితులకు ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా సరుకులు సరఫరా చేసేందుకు కౌన్సిల్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(సీటీఐ) అనుబంధ ‘ది హైదరాబాద్ ఎసెన్షియల్స్ డెలివరి కలెక్టివ్’ అనే సంస్థ ముందుకొచ్చింది. కరోనా సోకిన వారు తమకు ఫోన్ చేస్తే వారు కోరుకున్న సరుకులను ఇంటి వద్దకు చేరుస్తామని ప్రతినిధులు ప్రకటించారు. కొనుగోలు చేసిన సరుకులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, తామంతా వారి ఇళ్ల వద్దకు వెళ్లి బ్యాగులు ఇంటి ముందు పెడతామని సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్ వక్రాల వెల్లడించారు. తమకు ఇప్పటికే 37 మంది వలంటీర్లు నగర వ్యాప్తంగా ఉన్నారని, ప్రతిరోజూ 70 మందికి ఈ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 8340903849 నంబర్‌కు ఫోన్ చేస్తే సరుకుల జాబితాను తీసుకొని అరగంటలో ఇంటి ముందు ఆ బ్యాగును ఉంచుతామని ఆయన వెల్లడించారు. -
బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ రెడీ....
-
బిగ్‌బాస్కెట్ కొనుగోలుకు టాటా రెడీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ ప్రతిపాదించింది. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు చేసిన దరఖాస్తు ప్రకారం బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ప్రతిపాదిత వివరాల ప్రకారం టాటా డిజిటల్(టీడీఎల్), బిగ్‌బాస్కెట్ నిర్వాహక సంస్థ సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్(ఎస్జీఎస్)లో 64.3 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. డీల్‌ను ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన టీడీఎల్ టెక్నాలజీ సర్వీసులను అందిస్తోంది. వీటిలో ఐడెంటిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్, లాయల్టీ ప్రోగ్రామ్, ఆఫర్లు, చెల్లింపులు తదితర సేవలున్నాయి. ప్రతిపాదిత వాటా కొనుగోలు కారణంగా పోటీ లేదా పోటీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులూ వాటిల్లబోవంటూ సీసీఐకు టీడీఎల్ నివేదించింది. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్కెట్ కొనుగోలుకి టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ డీల్ ద్వారా చైనీస్ దిగ్గజం అలీబాబా తదితర సంస్థలు బిగ్‌బాస్కెట్‌లో వాటాను విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ తదితర దిగ్గజాలతో పోటీ పడుతోంది. -
టాటా గ్రూప్ చేతికి బిగ్‌బాస్కెట్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ స్టార్టప్ కంపెనీ బిగ్‌బాస్కెట్‌ను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రెండు సంస్థల మధ్య ఇప్పటికే ప్రారంభమైన చర్చలు పురోగతిలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,350 కోట్లు)కు సొంతం చేసుకునే వీలున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌లోని కన్జూమర్ బిజినెస్‌లన్నిటినీ కలుపుతూ ఇటీవల టాటా గ్రూప్ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ఇటీవల అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు ఈకామర్స్ మార్కెట్లో కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సైతం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ అంశంపై ఇటు టాటా గ్రూప్, అటు బిగ్‌బాస్కెట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. పోటీ తీవ్రం: బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఆన్లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్‌బాస్కెట్ ఇప్పటికే వాల్‌మార్ట్‌కు మెజారిటీ వాటాగల ఫ్లిప్‌కార్ట్, యూఎస్ దిగ్గజం అమెజాన్.. తదితరాలతో పోటీని ఎదుర్కొంటోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో చైనీస్ కంపెనీ అలీబాబా 26 శాతం వాటాను కలిగి ఉంది. అయితే డీల్‌లో భాగంగా అలీబాబా సైతం మొత్తం వాటాను విక్రయించే వీలున్నట్లు సమాచారం. -
రిలయన్స్ మరో సంచలనం, ప్రత్యర్థులకు గుబులే
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాదిలో మరో సంచలనానికి నాంది పలికింది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు షాకిస్తూ మరో సంస్థను ప్రారంభించింది. రిలయన్స్ జియోతో దూసుకుపోయిన అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. జియో మార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు. "దేశ్ కి నయీ దుకాన్" అనే ట్యాగ్‌లైన్ తో జియో మార్ట్‌ను రిలయన్స్ లాంచ్ చేసింది. అంతేకాదు తన కొత్త వెంచర్లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగదారులకు ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్ ఇపుడు జియో మార్ట్ ద్వారా మరోసారి విధ్వంసానికి తెరతీసింది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి రూ.3వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లో నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో వుంటాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది. హోం డెలివరీ, రిటన్ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవలను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో మార్ట్ ద్వారా 50వేలకు పైగా సరుకులను విక్రయించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న రిటైలర్లను రిలయన్స్ ఈ సేవలో భాగస్వామ్యం చేయనుంది. కాగా రిలయన్స్ రిటైల్, జియో సంయుక్తంగా దేశంలో కొత్త వాణిజ్య సంస్థను ప్రారంభించనున్నట్లు ముకేష్ అంబానీ 2019 జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కిరాణా సేవల్లోకి ‘స్విగ్గీ’
బెంగళూరు: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్ డెలివరీ సేవల్లోనే ఉన్న ఈ సంస్థ.. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ తరహాలో ఇక నుంచి కిరాణా వస్తువులు, మందులు, శిశు సంరక్షణ ఉత్పత్తులు, ఇతర రోజువారీ సదుపాయాలను అందించనుంది. ఇందుకోసం ‘స్టోర్స్’ పేరిట ఒక ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ఫ్లాట్‌ఫాంను మంగళవారం ఆవిష్కరించింది. తొలుత ఈ సేవలను హరియాణాలోని గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. ఇక్కడి 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టోర్‌కు మా సేవలను అనుసంధానం చేయడంలో భాగంగా ప్రత్యేక ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్ కేర్ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానం చేశాం అని వ్యాఖ్యానించారు. -
అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఆ సేవలు
బెంగళూరు : అమెరికాకు చెందిన అమెజాన్‌కు పోటీగా దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. తన మొబైల్ అప్లికేషన్ ఈ సేవలను ఆవిష్కరించింది. గత కొన్ని నెలల క్రితమే కేవలం తన ఉద్యోగులకు మాత్రమే ఈ సేవలను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటిని ఎంపిక చేసిన కస్టమర్లకు లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ మార్కెట్ ప్లేస్‌లో కనీస ఆర్డర్ విలువ రూ.500 ఉండాలి. రూ.1000కి పైన ఆర్డర్లకు ఉచితంగా డెలివరీ చేయనున్నారు. '' ఫ్లిప్‌కార్ట్‌పై గ్రోసరీ కేటగిరీలను సాఫ్ట్ లాంచ్ చేస్తున్నాం. బెంగళూరులో ఎంపికచేసిన కస్టమర్లకు ఈ సేవలందించనున్నాం. టెక్నాలజీ ద్వారా ఈ కామర్స్‌లోకి దేశాన్ని రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించాం. మా కస్టమర్లకు నిత్యావసర వస్తువులను తేలికగా అందించే షాపింగ్ సౌకర్యాన్ని అందించనున్నాం. తొలుత బెంగళూరులో కస్టమర్లందరికీ ఈ సర్వీసులను లాంచ్ చేశాం. భవిష్యత్తులో అన్ని నగరాలకు వీటిని విస్తరిస్తాం'' అని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2015లోనే నియర్‌బై యాప్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ డెలివరీ సర్వీసుల్లోకి వచ్చింది. కానీ కొన్ని నెలలకే ఈ సర్వీసులను మూసివేసింది. అమెజాన్ గతేడాది నుంచి ఎక్కువగా గ్రోసరీపై ఫోకస్ చేస్తోంది. పేటీఎం మాల్ తన ప్రధాన పెట్టుబడిదారి అలీబాబాతో కలిసి అతిపెద్ద గ్రోసరీ ఈటైలర్ బిగ్‌బాస్కెట్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. -
పెప్పర్‌ట్యాప్.. ఇక నో డెలివరీ!
17 నెలల్లోనే సేవలకు స్వస్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రాసరీ డెలివరీ సంస్థ పెప్పర్‌ట్యాప్ తన సేవలను ముగించేసింది. కస్టమర్లను ఆకర్షించటంలో విఫలంచెందడం, ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సిరావటం, భాగస్వామ్య దుకాణదారులు తమ యాప్ వినియోగంలో వెనకబడి ఉండటం వంటివి తమ వైఫల్యానికి కారణమని పెప్పర్‌ట్యాప్ సీఈఓ నవ్‌నీత్ సింగ్ చెప్పారు. ఈ విధమైన నిర్ణయంపై తాము ఎలాంటి అనుభూతులకు లోనుకావట్లేదని, ఆలస్యమైతే మరింత ఆగాధంలో పడే ప్రమాదముందని, కనీసం పెట్టుబడిదారుల నిధులనైనా సంరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 2014లో ప్రారంభమైన పెప్పర్‌ట్యాప్ 40 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. స్నాప్‌డీల్, సిక్వోయా ఇండియా, సైఫ్ పార్టనర్స్, రు-నెట్, బీనెక్ట్స్, జెఫ్కో ఏసియా వంటి పెట్టుబడిదారులున్నారిందులో. ‘‘ఇప్పుడిక మేము లాజిస్టిక్ వ్యాపారంపై దృష్టిసారిస్తాం. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలతో రివర్స్ లాజిస్టిక్స్ విభాగంలో పనిచేస్తున్నాం. రానున్న కొన్ని నెలల్లో డెలివరీ లాజిస్టిక్స్ మీద దృష్టిసారిస్తామని నవ్‌నీత్ చెప్పారు. గతేడాది బెంగళూరు కేంద్రంగా పనిచేసే డెలివరీ స్టార్టప్ జిఫ్స్టోర్ను పెప్పర్‌టాప్ కొనుగోలు చేసిన సమయంలోనే పెప్పర్‌టాప్ ఇబ్బందుల్లో ఉందని.. ఈ విషయమై మాట్లాడేందుకు పెప్పర్ ట్యాప్‌లో ఇన్వెస్టరైన స్నాప్‌డీల్ ప్రతినిధి తిరస్కరించారు. పెప్పర్‌ట్యాప్ మొత్తం 200 మంది ఉద్యోగులకు గాను 150 మందిని తొలగించేసింది. మిగిలిన 50 మంది ఉద్యోగులు లాజిస్టిక్ వ్యాపారంపై దృష్టిసారించారని సింగ్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం.. ‘‘మేం సంస్థను ప్రారంభించక ముందే అంటే 2013 నవంబర్‌లో సిక్వోయా క్యాపిటల్ 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో కో-ఫౌండర్ మిలింద్ శర్మతో కలిసి 2014 సెప్టెంబర్‌లో గుర్గావ్ కేంద్రంగా పెప్పర్‌టాప్.కామ్‌ను ప్రారంభించామని’’ గతంలో సాక్షి స్టార్టప్ డైరీకి ఇచ్చిన ఇంటర్య్వూలో నవ్‌నీత్ సింగ్ చెప్పారు. తమ సంస్థ మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 20 శాతం వరకుంటుందన్నారు. ‘‘రోజుకు హైదరాబాద్ నుంచి 15% ఆర్డర్లొస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రూ.6-7 వేలొస్తున్నాయని ఆయన వివరించారు.