ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారంలో 1.6 రెట్లు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ల నిత్యావరస వస్తువులను సరసమైన ధరలతో అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో కంపెనీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.
సంస్థ డెలివరీ చేసే అన్ని ఉత్పత్తుల మీద తయారీ తేదీ మాత్రమే కాకుండా ఎక్స్‌పైరీ తేదీ కూడా పేర్కొంటుంది. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రోలతో పాటు దేశంలోని టైర్ 2 పట్టణాల్లో కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే ఔరంగాబాద్, బంకురా, బొకారో వంటి నగరాల్లో వినియోగదారులకు చేరువవుతోంది. ఛతర్‌పూర్, గౌహతి, జంషెడ్‌పూర్, కృష్ణానగర్, విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అధిక ప్రజాదరణ పొందుతోంది.
ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ కింద.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, అనంతపురం, బెర్హంపూర్, గోరఖ్‌పూర్ వంటి పట్టణాలతో సహా సుమారు 200కు పైగా నగరాల్లో ఈ రోజు బుక్ చేస్తే.. మరుసటి రోజే డెలివరీ అందిస్తోంది.
ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో ఆయిల్, నెయ్యి, గోధుమ పిండి (ఆటా), టీ, కాఫీ, డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ముఖ్యమైన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్.. అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, హుబ్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి కీలక ప్రదేశాల్లో కేంద్రాలను ప్రారంభించింది. నెట్‌వర్క్ పెరగడంతో ఎక్కువ మంది కస్టమర్‌లకు సకాలంలో డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment