Grocery
-
యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
మన దేశంలో సమ్మర్ సీజన్లో జూన్ నుంచి జూలైలో కాస్త కూరగాయల ధరలు మండిపోతుంటాయి. సామాన్యుడికి కొనాలంటేనే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో అకాల వర్షాలు లేదా వర్షాలు పడక తగు మోతాదులు కూరగాయలు పండపోవడం తదితర కారణాల రీత్యా ధరలు ఆకాశన్నంటేలా పలుకుతాయి. అయితే మరీ విదేశాల్లో ఉండే భారతీయ కిరాణ స్టోర్‌లో సరకులు ధరలు మాములుగానే ఓ రేంజ్లో ధర పలుకుతాయి. కానీ ఇప్పుడూ మాత్రం ఆ ధరలు అలా ఇలా లేవు. కనీసం ఆ స్టోర్ వైపు చూపు పోయే సాహసమే చేయలేనంతగా ఘోరంగా ధరలు పలుకుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన చావీ అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను లండన్‌లోని భారతీయ కిరణా స్టోర్ వద్దకు వచ్చానని ఇక్కడ ఒక్కో ఐటెం ధర వింటే విస్తుపోతారంటూ వాటి ధరలు వివరాలు చెబుతున్నారు. అక్కడ సరుకులు ధరలు వరుసగా.. రూ. 20లు ఖరీదు చేసే లేస్ మ్యాజిక్ మసాలా ప్యాకెట్‌ను లండన్‌లో ఏకంగా రూ.95కి విక్రయిస్తున్నారు. అలాగే మ్యాగీ ప్యాకెట్ రూ. 300లు, పనీర్ ధర రూ. 700, అల్ఫోన్సో మామిడి కాయలు ఆరు రూ. 2400, బెండకాయలు కేజీ రూ. 650, పొట్టకాయం రూ. 1000 అంటూ వరుసగా వాటి ధరలు వివరంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోని చేసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరూ రెండు దేశాల మధ్య ఆదాయ అసమానతలు, కొనుగోలు శక్తి, సమానత్వం వంటి అంశాలను లేవనెత్తగా, ఇంకొందరూ అయితే ఇప్పుడే లండన్‌లో కిరాణ దుకాణం ప్రారంభిస్తే బెటర్ ఏమో అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Chavi Agarwal | Honest London Life (@nine2fivelife) (చదవండి: చల్లని వర్సెస్ వేడి నీళ్లు: బరువు తగ్గేందుకు ఏది బెటర్?) -
భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ బిజినెస్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారంలో 1.6 రెట్లు వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ల నిత్యావరస వస్తువులను సరసమైన ధరలతో అందించడం మాత్రమే కాకుండా.. అత్యుత్తమ ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో కంపెనీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది.సంస్థ డెలివరీ చేసే అన్ని ఉత్పత్తుల మీద తయారీ తేదీ మాత్రమే కాకుండా ఎక్స్పైరీ తేదీ కూడా పేర్కొంటుంది. ఇది వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.ఫ్లిప్‌కార్ట్ తన గ్రోసరీ వ్యాపారాన్ని బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రోలతో పాటు దేశంలోని టైర్ 2 పట్టణాల్లో కూడా విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే ఔరంగాబాద్, బంకురా, బొకారో వంటి నగరాల్లో వినియోగదారులకు చేరువవుతోంది. ఛతర్పూర్, గౌహతి, జంషెడ్పూర్, కృష్ణానగర్, విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అధిక ప్రజాదరణ పొందుతోంది.ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ కింద.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, అనంతపురం, బెర్హంపూర్, గోరఖ్‌పూర్ వంటి పట్టణాలతో సహా సుమారు 200కు పైగా నగరాల్లో ఈ రోజు బుక్ చేస్తే.. మరుసటి రోజే డెలివరీ అందిస్తోంది.ఎక్కువ మంది ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీలో ఆయిల్, నెయ్యి, గోధుమ పిండి (ఆటా), టీ, కాఫీ, డిటర్జెంట్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర ముఖ్యమైన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్.. అహ్మదాబాద్, భువనేశ్వర్, చెన్నై, హుబ్లీ, హైదరాబాద్, కోల్‌కతా వంటి కీలక ప్రదేశాల్లో కేంద్రాలను ప్రారంభించింది. నెట్వర్క్ పెరగడంతో ఎక్కువ మంది కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేయడానికి సాధ్యమవుతుంది. -
చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్‌లో పురుగుల కలకలం! వెంటనే తిరిగిచ్చేయండి!
ఇటీవల ఓ హైదరాబాదీ వ్యక్తి మెట్రో స్టేషన్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు కనిపించిన సంగతి తెలిసిందే. అది మరువక మునుపే కెల్లాగ్స్ చాకోస్ పురుగులు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా అంతకుమునపు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. అయితే ఇలా నాసిరకం వస్తువు కొనుగోలు చేస్తే మొహమాటంతోనే లేక మోసం చేశాడనే ఫీల్‌తోనే సదరు షాపుకి వెళ్లడం మానేస్తాం. కానీ ఇక్కడ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్షణమే ఆ వస్తువుని సదరు షాపు వాడికి ఇచ్చేసి దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. అలా ఇవ్వనని అంటే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చెయ్యాలి. వస్తువు నాసిరకం అని తేలితే జరిమానా విధించడం లేదా షాప్‌ని సీజ్ చేయడం జరుగుతుంది . ఇంతకీ ఏంటా నంబర్? ఇలాంటి మోసానికి గురికాకుండా విజిలన్స్ అధికారులకు ఎలా ఫిర్యాదు చెయ్యాలి? అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరూ నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. నిజానికి షాపులో కొన్ని వస్తువులు సేల్స్ కాకుండా అలా మిగిలిపోతాయి. వీటిని ఎలాగైన వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేందుకు యత్నిస్తుంటారు. ఇక్కడ కస్టమర్ కూడా తక్కువ ధరకే దొరకుతుందన్న ఆశతో ఆ వస్తువు నాణ్యమైనదా? కాదా? అనేది ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తాడు. అసలు అలా తక్కువ దరకు అమ్ముతున్నారంటే.. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ చూడాలి. ఎప్పుడూ తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించొచ్చు అనే వివరాలను చెక్ చేయాలి. అందులోనూ నిత్యావసర వస్తువులు పరిమిత కాలం వరకే ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు పైకి నాణ్యమైనవిగా కనిపించినా..ఇంటికెళ్లాక నాసిరకంగా కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడూ వెంటనే ఆ వస్తవును కొనుగోలు చేసిన షాపుకే వచ్చి.. తక్షణమే తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా తీసుకునేందుకు ఎవ్వరైనా వెనుకాడితే వెంటనే.. 1800114000 లేదా 1915 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. దెబ్బకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఆ వస్తువు నాసిరకం అని తేలితే మాత్రం ఆ షాపుని సీజ్ చేయడం లేదా జరిమానా విధించడం వంటి చర్యలు తప్పక తీసుకుంటారు. అందువల్ల ఇలా నకిలీ వస్తువులు కొని మోసపోయానని బాధపడొద్దు, వెంటనే తిరిగి ఇచ్చేయండి. దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోండి.! (చదవండి: 'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!) -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
పది నిమిషాల్లోపే డెలివరీ! లేకుంటే..
Zepto Grocery Deliver App Founders Inspirational Success Story: వయసు 19 ఏళ్లు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఉన్నత విద్యాలయం చదువుల్ని పక్కనపెట్టి.. ఒకే లక్క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేవలం పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే యాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తద్వారా గ్రోఫర్స్, డుంజో, స్విగ్గీలాంటి సర్వీసులతో పోటీ పడుతున్నారు. అయితే ఇంత చిన్నవయసులో దాపు 450 కోట్ల పెట్టుబడి ఎలా సమీకరించుకోగలిగారు?.. మార్కెట్లో దాని విలువను 2 వేల కోట్లకుపైగా(ప్రస్తుతం) ఎలా చేర్చగలిగారు?.. అదెలాగో.. జెప్టో యాప్ కథ చదివితే తెలుస్తుంది. ముంబై బేస్డ్గా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది జెప్టో యాప్. డెలివరీ యాప్ స్టార్టప్‌లో ఇప్పుడు ఇదొక సంచలనం. బచ్పన్ దోస్తులైన ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా.. ఇద్దరు కుర్రాళ్లు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. లొకేషన్‌ను బట్టి ETA(ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ ఎరైవల్) కేవలం 6 నుంచి 7 నిమిషాల్లోనే సరుకుల్ని డెలివరీ చేయిస్తుండడం ఈ యాప్ ప్రత్యేకత. మొత్తం మీద 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ అయ్యేలా చూడడం ఈ యాప్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. మరి ఆ టైంలోపు డెలివరీ చేయకపోతే.. పండ్లు, మాంసం, మందులు, ఇతర కిరాణా సామాన్లు.. జెప్టో యాప్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా సర్వీసులు కొనసాగుతున్నాయి. ఒకవేళ పది నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే.. సంబంధిత సరుకుల మీద డిస్కౌంట్స్‌తో పాటు, ఇతరత్ర ఇన్సెంటివ్స్ యాప్ యూజర్లకు అందిస్తారు. వాటికి అయ్యే ఖర్చు జెప్టో యాప్ నిర్వాహకులే భరిస్తున్నారు. ఇక ఈ యాప్ ద్వారా జరుగుతున్న డెలివరీలు ప్రస్తుతానికైతే ఛార్జీలు వసూలు చేయడం లేదు. అతిపెద్ద ఛాలెంజ్.. ఈ స్థాయికి చేరుకుంటారని ఏ దశలోనూ అనుకోలేదు పలిచా, వోహ్రాలు. ఈ బాల్య స్నేహితులు కలిసే పెరిగారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోసం ఇద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. యూనివర్సిటీలో ఉండగానే గ్రాసరీ డెలివరీ యాప్‌ను ప్రయోగాత్మకంగా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఆ సరదా ప్రయోగం వర్కవుట్ కావడంతో పర్ఫెక్ట్ మోడల్ కోసం మూడు నెలలు కష్టపడ్డారు. భారత్‌లో డెలివరీ స్టార్టప్‌లకు మంచి గిరాకీ ఉందని గుర్తించి.. కాలేజీ చదువుల్ని పక్కనపెట్టి స్వస్థలానికి చేశారు. క్విక్ డెలివరీ అంటే 45 నిమిషాలనే ఆలోచన ఉందట మొదట వీళ్లిద్దరికీ. కానీ, ఒపినీయన్ సర్వేలో జనాలు 10-15 నిమిషాలు అనేసరికి.. భయం భయంగానే యాప్‌ను మొదలుపెట్టారు. అంత తక్కువ టైంలో యాక్సిడెంట్లు కాకుండా రైడర్లు డెలివరీ చేయడం మరో పెద్ద టాస్క్. అదే టైంలో డెలివరీకి తగ్గట్లు లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా రిస్క్ తీసుకోకుండా యాప్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నారు. ఇన్వెస్టర్లను మెప్పించి.. యాప్ మార్కెట్లోకి తేవడానికి వీళ్లిద్దరూ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ముందు తమ సర్వీస్ వేగాన్ని ఇన్వెస్టర్లకే రుచి చూపించారు వీళ్లు. అలా ఆర్నేళ్లపాటు కష్టపడి 450 కోట్ల రూపాయల పెట్టుబడి సమీకరణతో జెప్టోను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ విలువ 200-300 మిలియన్ డాలర్లుగా ఉంది(రెండు వేల కోట్లరూపాయలకుపైనే). వై కాంబినేటర్, గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్‌తో పాటు ఇన్వెస్టర్లు లాచీ గ్రూమ్, నీరజ్అరోరా పెట్టుబడులు ఉన్నాయి జెప్టో స్టార్టప్‌లో. టాలెంట్‌కి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చని, విజయం అందుకోవాలంటే అమితమైన ఆత్మవిశ్వాసమూ, నమ్మకమూ, కెరీర్లో ముందడుగు వేసే ధైర్యమూ ఉండాలని చెబుతోంది ఈ ఇద్దరి మిత్రుల సక్సెస్ కథ. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
పెరుగుతున్న చమురు ధరలతో, తినడం మానేస్తున్నారు
ముంబై: పెరిగిపోతున్న ముడి చమురు ధరల భారం ప్రజల ఆలోచనా ధోరణిని మార్చేస్తోంది. విచక్షణారహిత వినియోగం కిందకు రాని, నిత్యావసరాలైన కిరాణ (గ్రోసరీ), జంక్ ఫుండ్ సంబంధ ఆహారం, యుటిలిటీ (విద్యుత్తు, టెలికం) తదితర ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు ఓ నివేదిక రూపంలో వెల్లడించారు. చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పన్నులను తగ్గించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రూ.100కు పైనే పలుకుతుండగా.. డీజిల్ సైతం రూ.100కు చేరువలో ఉంది. విక్రయ ధరలో రూ.40కు పైనే పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్రాలకు వెళుతోంది. వాస్తవానికి గతేడాది కరోనా వైరస్ భయంతో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆ సమయంలో అదనపు ఆదాయం కోసం కేంద్ర సర్కారు ఎక్సైజ్ సుంకాలను పెంచుకుంది. తిరిగి చమురు ధరలు గరిష్టాలకు చేరినా కానీ, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతోంది. వెంటనే పన్నులు తగ్గించాలి.. ‘‘వినియోగదారులు ఇంధనంపై ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎస్బీఐ కార్డులపై ఖర్చులను విశ్లేషించగా.. పెరిగిన చమురు భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు జంక్‌ఫుడ్‌పై ఖర్చులను వారు గణనీయంగా తగ్గించుకున్నారు. అంతేకాదు గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు కూడా తగ్గిపోయింది’’ అని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. చమురుపై అధిక వ్యయాలు ద్రవ్యోల్బణంపైనా ప్రభావం చూపిస్తాయని హెచ్చరించారు. చమురు ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై అర శాతం ప్రభావం పడుతుందన్నారు. కనుక వెంటనే పన్నులను తగ్గించి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం స్వల్పం గా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నా, ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉందని.. దీనికితోడు ఆర్థిక పొదుపులు తగ్గడం సవాలేననని ఈ నివేదిక తెలిపింది. -
గర్వపడుతున్నా, ఇది నా అదృష్టం: యాంకర్
కరోనా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూ అమలవతుండటంతో చాలామంది తమ ఉపాధిని కోల్పోయి పూట గడవని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం సెలబ్రిటీలు ముందుకు వస్తూ ఉన్నంతలో వారికి సాయం చేస్తున్నారు. అందులో యాంకర్ ఝాన్సీ కూడా ఒకరు. బుల్లితెర యాంకర్ ఝాన్సీ లాక్డౌన్ వల్ల ప్రభావితమైన పేదలకు నిత్యావసర సరుకులను అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటోంది. ఈ సేవా కార్యక్రమాలను ఆమె టీమ్ దగ్గరుండి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన మేకప్ మ్యాన్ అసిస్టెంట్ రమణ చేస్తున్న మంచి పనుల గురించి అభిమాలతో చెప్పుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "నా దగ్గర పని చేస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నా. నా టచప్ అసిస్టెంట్ రమణ లాక్డౌన్లో నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. నాకు వీలైనంతలో ఒక 25 మందికి నెలకు సరిపడా సరుకులు ఇచ్చే పనిని రమణ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అందులో చిన్న మొత్తం మిగిలింది. అయితే దాన్ని నీ దగ్గరే ఉంచు రమణా అని చెప్పినప్పటికీ, ప్రస్తుతం తనకు ఇబ్బంది లేదంటూ అవసరం ఉన్న మరో నలుగురికి నిత్యావసరాలు అందించాడు. మంచితనం డబ్బుతో రాదు.. రమణ, శ్రీను పుట్టుకతోనే గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తులు, వీరితో పని చేయడం నా అదృష్టం" అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) చదవండి: హీరోగా జూ.ఎన్టీఆర్ అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
70 నగరాలకు గ్రాసరీ: ఫ్లిప్‌కార్ట్
సాక్షి, ముంబై: గ్లోబల్ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ దేశీయంగా కిరాణా సేవల్లో మరింత దూసుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలో రానున్న ఆరు నెలల్లో 70కి పైగా నగరాలకు తన గ్రాసరీ సేవలను విస్తరించనున్నామని ప్రకటించింది. ఆగస్టు నాటికి గ్రాసరీ సర్వీస్‌ను మరో 20 కిపైగా నగరాలకు పెంచాలని భావిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దేశవ్యాప్తంగాప్రస్తుతం 50 నగరాల్లో ఈ సేవలను కంపెనీ అందిస్తోంది. కోల్‌కతా, పూణే ,అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలతోపాటు, మైసూర్, కాన్పూర్, వరంగల్, అలహాబాద్, అలీగడ్, జైపూర్, చండీగఢ్; రాజ్‌కోట్,వడోదర, వెల్లూరు, తిరుపతి, డామన్ తదితర నగరాలకు గ్రాసరీ సేవలను అందించనున్నట్టు తెలిపింది. (డెలివరీ : ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం) కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో లక్షలాది కస్టమర్లు కిరాణా సరుకుల కోసం ఆన్లైన్ బాట పట్టారు. దీంతో మెట్రోలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ-గ్రాసరీ డిమాండ్ పెరిగిందని కంపెనీ తెలిపింది. ఏడాదిలో వ్యాపారం మూడింతలైందని వివరించింది. మార్కెట్‌ప్లేస్ ద్వారా స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతమివ్వడమేగాక లక్షలాది మంది వినియోగదార్లను రైతులతో అనుసంధానిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ మెట్రోలతోపాటు తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లోనూ అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ విభాగంలో 200లపైచిలుకు విభాగాల్లో కలిపి 7,000లకుపైగా ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. 2020లో రూ.24,090 కోట్లున్న ఈ-గ్రాసరీ విపణి 2025 నాటికి రూ.1,75,200 కోట్లకు చేరనుందని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఇటీవల వెల్లడించింది. 50 శాతంపైగా కిరాణా సరుకుల రిటైల్ మార్కెట్‌ను ఈ-గ్రాసరీ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే వీలుందని వివరించింది. అమెజాన్, రిలయన్స్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి సంస్థలూ ఈ రంగంలో పోటీపడుతున్నాయి. -
కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్...ఇది అతి సూక్ష్మ జీవి అయినా విశ్వం మొత్తాన్ని గజగజ లాడిస్తోంది. ఎక్కడ ఎలా పొంచి వుందో తెలిదు..ఎటునుంచి దాపురిస్తుందో తెలియదు..ఏ వస్తువుపై దాక్కొని ఎలా పంజా విసురుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశప్రజలను పట్టి పీడిస్తున్న ఆందోళన ఇది. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు, మందులు, కూరగాయలు, కిరాణా లాంటి అత్యవసర వస్తువులను విక్రయిస్తున్న దుకాణదారులను ఈ భయం వెంటాడుతోంది. అయితే కరోనా మహమ్మారి భయాలకు చెక్ పెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రోపార్ ఒక కొత్త పరికరాన్ని రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మనం వాడే నిత్యాసర సరుకులను ఈ వైరస్ బారినుంచి కాపాడుకోవచ్చని వెల్లడించింది. అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు ఇలా దేన్నైనా ట్రంక్ పెట్టెలో ఉంచి, శుభ్రం చేసుకోవచ్చని బృందం సిఫార్సు చేస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్లలో ఉపయోగించే అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని గుమ్మం వద్దనే పెట్టుకోవాలని, అపుడు బయట నుంచి తీసుకొచ్చిన సరుకులు, డబ్బులను దాని కింద ఉంచి త్వరగా శుభ్రం చేసుకోవచ్చని తెలిపింది. కేవలం 30 నిమిషాల సమయంలో వైరస్‌ను అంతం చేస్తుందని పేర్కొంది. 30 నిమిషాలు శానిటైజ్ చేసిన తర్వాత ఓ పది నిమిషాలు చల్లబడే వరకు అలాగే వదిలేయాలని చెప్పింది. అంతేకాదు దీని ధర రూ.500 కన్నా తక్కువ ధరకే లభిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన లేకుండా, సులువుగా కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువచ్చిన అన్ని వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని ఐఐటీ రోపర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేష్ రాఖా ప్రకటించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మరిన్ని జాగ్రత్తలు తప్పవని నరేష్ రాఖా సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూరగాయలను కూడా వేడి నీళ్లలో కడుగుతున్నారు. అయితే, డబ్బులను అలా కడగలేం కదా. అందుకే ఈ పరికరాన్ని తయారు చేశామని చెప్పారు. గుమ్మం దగ్గర. లేదా, ఇంటి లోపలికి రావడానికి ముందు బయట ఎక్కడైనా పెట్టుకుని తెచ్చుకున్న సరుకులను శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు. అయితే ట్రంక్ లోపల కాంతి హానికరం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడకూడదని,ప్రమాదమని హెచ్చరించారు. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం కరోనావైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 199కు పెరిగింది. 6,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్ -
ప్లాస్టిక్‌పై బ్యాన్‌కు వ్యతిరేకంగా సమ్మె!
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
ప్లాస్టిక్‌పై బ్యాన్.. ఒక్కరోజే 3.5 లక్షల రూపాయలు
సాక్షి, ముంబై : పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) శనివారం(జూన్ 23) నుంచి ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై కొరడా ఝలిపించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 87 షాపుల నుంచి 3.5 లక్షల రూపాయలు జరిమానా రూపంలో ఖజానాకు జమ అయింది. అయితే బీఎంసీ తీరుతో తమకు నష్టాలు వస్తున్నాయంటూ రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు సిద్ధమైంది. రీటైలర్ వ్యాపారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వీరేశ్ షా మాట్లాడుతూ... ‘ప్లాస్టిక్ నిషేధం వల్ల కూరగాయల వ్యాపారులకు, స్వీట్ షాపు ఓనర్లకు నష్టాలు వస్తున్నాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. కూరగాయలు, స్వీట్లు నిల్వ చేయాలన్నా, కస్టమర్లకు అందించాలన్నా ప్లాస్టిక్ కవర్లు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇలాంటి సీజన్ టైమ్‌లో బీఎంసీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు ఎంతగానో నష్టపోతున్నారు. కాబట్టి సీజన్(వర్షాకాలం) అయిపోయేంత వరకైనా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నామ’ని వ్యాఖ్యానించారు. పాల వ్యాపారులకు ఉన్నవిధంగానే కూరగాయల వ్యాపారులకు కూడా ప్యాకేజింగ్ విధానానికి అనుమతినివ్వాలని బీఎంసీకి విఙ్ఞప్తి చేశామన్నారు. తమ సమస్యలను వివరిస్తూ బీఎంసీకి లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి హామీ రాలేదని.. అందుకే బుధవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రాండెడ్ వస్తువుల కోసం ఉపయోగించే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే మీరు.. రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేందుకు చిరు వ్యాపారులకు అనుమతి నిరాకరించడం న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. -
నిత్యావసర ధరలపై పోరు
2021 వరకూ ద్రవ్యోల్బణం లక్ష్యం 4% న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఐదేళ్లలో 4 శాతం ద్రవ్యోల్బణాన్ని లక్ష్యాన్ని స్థిరీకరించింది. మార్జిన్ ‘ప్లస్ లేదా మైనస్ 2’గా నిర్దేశించుకుంది. అంటే పెరిగితే గరిష్ఠ పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ఠ పరిమితి 2 శాతంగా ఉండాలన్న మాట. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే. ప్రభుత్వ తాజా చర్యతో ఆర్బీఐ గవర్నర్ రూపొందించిన ‘ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ద్రవ్యోల్బణం నమూనా’కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది. ఆగస్టు 9న రాజన్ ద్రవ్యపరపతి సమీక్ష నేపథ్యంలో ఆర్థికశాఖ తాజా అడుగు వేసింది. సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక రాజన్ మెల్లగా రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. 2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతానికి దిగివచ్చింది. ద్రవ్యోల్బణం పైపైకే..! జూన్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 22 నెలల గరిష్ట స్థాయిలో 5.77 శాతంగా ఉంది. ప్రభుత్వం- ఆర్బీఐ మధ్య ఫిబ్రవరిలో కుదిరిన అవగాహన ప్రకారం, ద్రవ్యోల్బణం కట్టుతప్పితే అందుకు కారణాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తుంది. జైట్లీతో రాజన్ భేటీ న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి జైట్లీతో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. వచ్చే ఐదేళ్లు 4% ద్రవ్యోల్బణం లక్ష్య నిర్ణయం, ఆగస్టు 9 ద్రవ్య సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై వీరు చర్చలు జరిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
-
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది. -
ధరల దరువు బతుకు బరువు
♦ భయపెడుతున్ననిత్యావసర వస్తువులు ♦ మండుతోన్న కూరగాయల ధరలు ♦ మార్కెట్లో దళారుల మాయాజాలం ♦ జీవనం కష్టంగా మారిందంటున్న ♦ పేద, మధ్యతరగతి ప్రజలు కేజీబీవీల నిర్వహణ ♦ బహుకష్టంగా మారిన వైనం జేబులో వంద, రెండువందలో డబ్బులు పెట్టుకుని మార్కెట్‌కు వెళితే సరుకులతో సంచి నిండి ఇంటికొచ్చే రోజులుపోయాయి. కనీసం రూ.2000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదీ అరకొరనే. పప్పులు నిప్పులవ్వుతున్నాయ్. నూనెలు సలసల కాగుతున్నాయ్. కూరలు కరుస్తున్నాయ్.. బియ్యం భయపెడుతున్నాయ్.. ఇక మధ్య తరగతి, సామాన్యుల నోటికి మాంసం ముక్క చిక్కడం లేదు. కనీసం కోడి గుడ్డు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. దళారుల మాయాజాలంలో మార్కెట్ నడుస్తోంది. ధరలను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. సాక్షి ప్రతినిధి, కడప: మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు దడపుట్టిస్తున్నాయి. కూరగాయలు మొదలు అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి జనాల బతుకు భారమైంది. ధరలు చూసి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలీ పనిచేసి జీవించే పేదలకు ఈ ధరలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. నెలరోజుల కిందటికీ ఇప్పటీకీ అటు నిత్యావసర వస్తువులు ఇటు కూరగాయాల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు ధరాఘాతంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నెలాఖరున మాత్రమే ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు నెలంతా ఇబ్బందిగానే మారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినా సర్కారు నియంత్రించలేకపోతోంది. ధరల మానిటరింగ్ కమిటీ ఉన్నా ఉపయోగంలేదు. సామాన్యుడు సన్న బియ్యం తినలేని పరిస్థితి నెలకొంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కిలో నెల కిందట రూ.40లుండగా, తాజాగా కిలో రూ.48కు చేరింది. నిప్పులు కురిపిస్తున్న పప్పుల ధరలు నిత్యం ఉపయోగించే కందిపప్పుతో పాటు అల్పాహారాలలో వినియోగించే ఉద్దిపప్పు, పెసరపప్పు ధరలు నింగిని తాకుతున్నాయి. వేరుశనగ విత్తనాల ధరలు అదేస్థాయిలో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఆయా పప్పుల ధరలు నిప్పులను కురిపిస్తున్నాయి. దీని ప్రభావం కుటుంబ బడ్జెట్‌పై చూపుతోంది. మంచిరకం కందిపప్పు కిలో నెల కిందటి వరకు రూ.120 ఉండగా నేడు కిలో రూ.180 పలుకుతోంది. మిన పప్పు కిలో రూ.130 ధర ఉండగా ఉన్నట్లుండి కిలో రూ.180లకు చేరుకుంది. కందిపప్పు, మినపప్పు మధ్యలో రూ.200ను కూడా దాటింది. అలాగే పెసరపప్పు కిలో రూ.80ల నుంచి నేడు రూ.120లకు చేరుకుంది. వేరుశనగ పప్పు కూడా రూ.100పైనే ఉంది. పప్పులు కూడా కిలో రూ.65ల నుంచి రూ.100లకు చేరుకున్నాయి. అలాగే ఎండుమిరప, తెల్లగడ్డలు ధరలు ఘాటెక్కుతున్నాయి. ఇవి మొన్నటివరకు కేవలం రూ. 70నుంచి 80లకు మించి పలకలేదు. తాజాగా ఎండుమిరప కిలో రూ.185గాను, తెల్లగడ్డలు కిలో రూ. 200ల ధర పలుకుతున్నాయి. చేతికందని మాంసం ముక్క.. మాంసం పేరెత్తితేనే సామాన్యుడు హడలిపోతున్నాడు. మాంసం ధరలు నొటికందనంత దూరంలో ఉంటున్నాయి. మాంసం కిలో రూ. 450కి చేరుకుంది. అలాగే చికెన్ ధరలు రూ. 170 నుంచి 210 పలుకుతున్నాయి. అదివారం అదనం. అదేవిధంగా చేపలు ఆయా రకాలను బట్టి కిలో రూ.200 నుంచి 450లు, రొయ్యలు రూ.350 నుంచి 520 పలుకుతున్నాయి. ఇక కోడిగుడ్లు చవకగా ఉన్నాయనుకుంటే పొరపాటే. డజను గుడ్లు మార్కెట్లో రూ.55 నుంచి 60 వరకు ధర పలుకుతున్నాయి. బహుకష్టంగా మారిన కేజీబీవీల నిర్వహణ ‘సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి’ అన్నట్లుగా కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వ హాస్టల్స్ నిర్వహణ బహుకష్టంగా మారింది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నెలకు రూ.90 చెల్లిస్తుంది. ఒక్కో విద్యార్థికి సరాసరిన నెలకు 6 కిలోలు కూరగాయాలు (ఆకుకూరలతో కలిపి)వాడాల్సి ఉంది. కిలో రూ.15 చొప్పున నెలకు రూ.90 మాత్రమే చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆ మొత్తానికి ఒక్క కిలోతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నెల పొడువునా ఒక్కొక్క విద్యార్థికి ఒక కిలో కూరగాయలతో నెట్టుకురావడం అసంభవమని బాధ్యులు వివరిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన భోజనం పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. వాస్తవంలో పప్పుదినుసులు, కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతోన్నాయి. ఈతరుణంలో కేవీజీబీ బాధ్యులకు హాస్టల్ నిర్వహణ బహుకష్టంగా మారింది. ప్రస్తుతం తమ బాధలను చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని, చెప్పుకున్నా పట్టించుకునే నాథుడులేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దళారుల మాయాజాలం... ధరలు అమాంతం పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. మార్కెట్లో స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వినియోగదారులు అన్నిరకాల కూరగాయలను కలిపి 356 మెట్రిక్ టన్నులు వాడుతున్నారని అధికారుల అంచనా. రైతుల వద్ద వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని మార్కెట్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం వల్ల ధరలు అమాంతం పెరుగుతున్నాయని పలువురు వివరిస్తున్నారు. నిత్యావసర వస్తువులు సైతం రైతుల వద్ద దిగుబడి ఉన్నంతవరకూ ధరలు ఉండటం లేదు. తర్వాతే మండిపోతున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు. -
బతుకు పచ్చడి
కొండెక్కిన పప్పులు.. నూనెలు గత ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరం పట్టించుకోని ప్రభుత్వం కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. సలసల కాగుతున్న నూనెల ధరలను తలుచుకుని బెంబేలెత్తిపోతున్నాడు. రోజంతా కష్టించినా.. కనీసం కందిపప్పు కూడా కొనలేని పరిస్థితిలో పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్నాడు. కొందరైతే.. మజ్జిగనీళ్లు.. రసంతోనే కాలం గడుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి పబ్బం గడుపుకుంటున్న వ్యాపారులను.. వారిని కట్టడి చేయలేని ప్రభుత్వ పెద్దల అసమర్థతను గుర్తుచేసుకుంటూ.. గంజినీళ్లతో గొంతుతడుపుకుంటున్నారు. తిరుపతి: నిత్యావసర వస్తువుల ధరలు జెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పప్పుల ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. నూనెల రేటు సలసలకాగుతున్నాయి. కూరగాయలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉల్లి ఘాటు తగ్గలేదు. ఎండుమిర్చి ధర పెరుగుతూనే ఉంది. మొత్తం మీద సామాన్యుడు పచ్చడి మెతుకులు కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో సరిపెడుతూ వ్యాపారులకు కొమ్ముకాస్తోంది. ఒకవైపు అన్నదాత వరుస కరువుతో అల్లాడుతుండగా మరోవైపు పేద, మధ్య తరగతి ప్రజలను ధరాఘాతం వెంటాడుతోంది. చిన్న తరగతి ఉద్యోగులు కుటుంబాలను నెట్టుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. అర్ధాకలితో కాలం నెట్టుకొస్తున్నారు. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం.. ఈ ఏడాది పప్పుల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దిగుబడులు పడిపోయాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారులు సరుకును బ్లాక్ మార్కెట్‌కి తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పప్పుల ధరలు అమాంతం పెంచేశారు. పప్పు కరువు.. హోటళ్లలో సైజు తగ్గిన ఇడ్లీ, దోసెలు సగటు జీవి ఇంట్లో పప్పు కనుమరుగైంది. హోటళ్లలో సైతం నీళ్ల సాంబారే దర్శనమిస్తోంది. మినప్పప్పు ధర పెరగడంతో ఇడ్లీ, దోసెల పరిమాణం తగ్గిపోయాయి. వేరుశెనగ పప్పు ధర పెరగడంతో నీళ్ల చెట్నీ గతి అవుతోంది. పచ్చడి మెతుకులు తిని కాలం గడుపుదామని అనుకుంటే ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయల ధరలు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చాలామంది తమగోడు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. ధరలపై కొరవడిన పర్యవేక్షణ.. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ధరలు పెరిగినప్పుడు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేవిధంగా సబ్సిడీ ధరలతో సరఫరా చేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సామాన్యులకు ఉపయోగపడే కొన్ని వస్తువులనైనా సబ్సిడీ ధరలకు సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు. -
నెల బడ్జెట్
సామాన్య మధ్య తరగతి వారి నిత్యావసర వస్తువుల బడ్జెట్ కూరగాయాల్లో 45 శాతం, నిత్యావసర వస్తువుల్లో వంద శాతం పైగా ధరలు పెరిగాయి. నా జీతంలో ప్రతీ నెల హౌసింగ్ లోన్, వెహికల్లోన్ ,పిల్లల చదువులకు, నిత్యావసర వస్తువులకు బడ్జెట్ కేటాయించాను. కానీ పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వం ఏడాదిగా డిఎ ఇవ్వడం లేదు. అలాగని ధరలు అదుపు లేదు. ప్రతీనెల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ.5 వేలు కేటాయిస్తాను. ఆరు నెలలుగా కూరగాయాలు, పప్పులు, బియ్యం రేట్లు భారీగా పెరిగాయి. రూ.వందతో మార్కెట్ కు వె ళితే కిలో ఉల్లి, కిలో వంకాయలు వస్తున్నాయి. సన్న బియ్యం కిలో రూ.55 పలుకుతోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.9వేలు కేటాయించాల్సి వస్తోంది. ప్రతీ వారం వెళ్లే షికారులు, క్యాంపులు, సినిమాలు తగ్గింంచుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కూరగాయలు, బియ్యం కొనుక్కొని కాలం గడపాల్సి వస్తోంది. z -పి.వి.సత్యన్నారాయణ, లెక్చరర్, పాయకరావుపేట. -
రాష్ట్రంలో ఆకస్మిక విజిలెన్స్ దాడులు
రూ.16.64 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు సీజ్ హైదరాబాద్: అక్రమంగా నిల్వ ఉంచిన విత్తనాలు, ఇతర నిత్యావసర వస్తువుల గోడౌన్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ గురువారం దాడు లు జరిపి రూ.16.64 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది. అన్ని జిల్లా ల్లో ఏకకాలంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ డీలర్ల గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై దాడులు జరిపి 32 కేసులతోపాటు ఒక క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజి లెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ టి.పి.దాస్ తెలిపారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే రూ.13 లక్షల విలువైన సామగ్రి లభించిందని చెప్పారు.