
నెల బడ్జెట్
సామాన్య మధ్య తరగతి వారి నిత్యావసర వస్తువుల బడ్జెట్ కూరగాయాల్లో 45 శాతం, నిత్యావసర వస్తువుల్లో వంద శాతం పైగా ధరలు పెరిగాయి. నా జీతంలో ప్రతీ నెల హౌసింగ్ లోన్, వెహికల్‌లోన్ ,పిల్లల చదువులకు, నిత్యావసర వస్తువులకు బడ్జెట్ కేటాయించాను. కానీ పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వం ఏడాదిగా డిఎ ఇవ్వడం లేదు. అలాగని ధరలు అదుపు లేదు. ప్రతీనెల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ.5 వేలు కేటాయిస్తాను.
ఆరు నెలలుగా కూరగాయాలు, పప్పులు, బియ్యం రేట్లు భారీగా పెరిగాయి. రూ.వందతో మార్కెట్ కు వె ళితే కిలో ఉల్లి, కిలో వంకాయలు వస్తున్నాయి. సన్న బియ్యం కిలో రూ.55 పలుకుతోంది. ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.9వేలు కేటాయించాల్సి వస్తోంది. ప్రతీ వారం వెళ్లే షికారులు, క్యాంపులు, సినిమాలు తగ్గింంచుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే కూరగాయలు, బియ్యం కొనుక్కొని కాలం గడపాల్సి వస్తోంది. z
-పి.వి.సత్యన్నారాయణ, లెక్చరర్,
పాయకరావుపేట.