ఇటీవల ఓ హైదరాబాదీ వ్యక్తి మెట్రో స్టేషన్‌లో కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు కనిపించిన సంగతి తెలిసిందే. అది మరువక మునుపే కెల్లాగ్స్ చాకోస్ పురుగులు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా అంతకుమునపు కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వార్తల్లో నిలిచాయి. అయితే ఇలా నాసిరకం వస్తువు కొనుగోలు చేస్తే మొహమాటంతోనే లేక మోసం చేశాడనే ఫీల్‌తోనే సదరు షాపుకి వెళ్లడం మానేస్తాం. కానీ ఇక్కడ అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తక్షణమే ఆ వస్తువుని సదరు షాపు వాడికి ఇచ్చేసి దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. అలా ఇవ్వనని అంటే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చెయ్యాలి. వస్తువు నాసిరకం అని తేలితే జరిమానా విధించడం లేదా షాప్‌ని సీజ్ చేయడం జరుగుతుంది . ఇంతకీ ఏంటా నంబర్? ఇలాంటి మోసానికి గురికాకుండా విజిలన్స్ అధికారులకు ఎలా ఫిర్యాదు చెయ్యాలి?
అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరూ నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. నిజానికి షాపులో కొన్ని వస్తువులు సేల్స్ కాకుండా అలా మిగిలిపోతాయి. వీటిని ఎలాగైన వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు లేదా డిస్కౌంట్ ఆఫర్స్ కింద అమ్మేందుకు యత్నిస్తుంటారు. ఇక్కడ కస్టమర్ కూడా తక్కువ ధరకే దొరకుతుందన్న ఆశతో ఆ వస్తువు నాణ్యమైనదా? కాదా? అనేది ఆలోచించకుండా వెంటనే కొనుగోలు చేస్తాడు. అసలు అలా తక్కువ దరకు అమ్ముతున్నారంటే.. ముందుగా ఆ వస్తువు గడువు తేదీ చూడాలి. ఎప్పుడూ తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించొచ్చు అనే వివరాలను చెక్ చేయాలి.
అందులోనూ నిత్యావసర వస్తువులు పరిమిత కాలం వరకే ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు పైకి నాణ్యమైనవిగా కనిపించినా..ఇంటికెళ్లాక నాసిరకంగా కనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడూ వెంటనే ఆ వస్తవును కొనుగోలు చేసిన షాపుకే వచ్చి.. తక్షణమే తిరిగి ఇచ్చేయాలి.
ఒకవేళ అలా తీసుకునేందుకు ఎవ్వరైనా వెనుకాడితే వెంటనే.. 1800114000 లేదా 1915 నెంబర్‌లకు కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. దెబ్బకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సదరు షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఆ వస్తువు నాసిరకం అని తేలితే మాత్రం ఆ షాపుని సీజ్ చేయడం లేదా జరిమానా విధించడం వంటి చర్యలు తప్పక తీసుకుంటారు. అందువల్ల ఇలా నకిలీ వస్తువులు కొని మోసపోయానని బాధపడొద్దు, వెంటనే తిరిగి ఇచ్చేయండి. దాని స్థానంలో మరొక వస్తువుని ఉచితంగా తెచ్చుకోండి.!
(చదవండి: 'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!)
Comments
Please login to add a commentAdd a comment