sridharbabu
-
‘డిజిటల్ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’
డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు. -
దక్షిణాన గోల్ఫ్ సిటీ 10 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమె రికా (పీజీఏ), స్థానిక భాగ స్వామి స్టోన్ క్రాఫ్ట్ తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభు త్వం సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. పీజీఏ ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మాణం చేపడుతోందని, ఇక్కడ స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు.గోల్ఫ్ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి దొరుకు తుందని శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎటువంటి కాలుష్యం వెలువడని నెట్– జీరో సిటీని నిర్మిస్తుందని పేర్కొన్నారు. అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పీజీఏ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రితో భేటీ అయింది.నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రెజెంటేషన్‌లో వెల్లడించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. పీజీఏ కన్సార్టియం 200 ఎకరాల్లో ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుంది. మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజ సిద్ధమైన డెక్కన్ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకారప్రాయమ వుతుందన్నారు. భేటీలో స్టోన్ క్రాఫ్ట్ సీఈ వో కీర్తి చిలుకూరి, అలోక్ తివారి, పీజీఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్ హే, డేవిడ్ బ్లమ్ పాల్గొన్నారు. -
రుణమాఫీ కాని వారికి తప్పకుండా చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,పెద్దపెల్లిజిల్లా: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ మూడు దఫాలుగా చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి తప్పకుండా చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో బుధవారం(ఆగస్టు21) జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించి పనిచేస్తోంది. మహిళలను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.మంథని, కాటారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంథని మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తాం. మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి, అభివృద్ది చేస్తాం’అని శ్రీధర్‌బాబు తెలిపారు. -
మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. నానక్‌రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్‌ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్‌మార్తా మాట్లా డుతూ ఆర్అండ్డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్ లీడర్ దివ్యప్రకాశ్ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్‌ట్రానిక్ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫోర్సిస్ ఇంక్ నూతన కార్యాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్ ఇంక్‌నూతన కార్యాలయాన్ని శ్రీధర్‌బాబు, అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడారు. -
‘పార్లమెంట్’పై కాంగ్రెస్ గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ గురి పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో వరించిన విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆ పార్టీ దూకుడుగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్‌పై వేగంగా పావులు కదుపుతోంది. 12 అసెంబ్లీ స్థానాలకు పదింటిలో గెలిచిన కాంగ్రెస్ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ను గెలుచుకోవాలని కుతూహలపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన ఆ పార్టీ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్‌కు సైతం నియమించింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ధనసరి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్గా నియమించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ లోక్‌సభ స్థానం పరిధి ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు, మండలాల నేతలతో సమన్వయం చేయనున్నారు. పీఏసీలో ఓరుగల్లు ప్రస్తావన.. వరంగల్, మహబూబాబాద్.. పార్లమెంట్ స్థానాలను గెలవడం కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని సూచించడం గమనార్హం. 12 స్థానాలకు 10 అసెంబ్లీ సీట్లను గెలిచామన్న భావనతో పార్లమెంట్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయరాదని ఈ కమిటీలో సూచించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ 131 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న నాగ్‌పూర్‌లో జరిగే వేడుకలకు వరంగల్, మహబూబాబాద్ నుంచి పదివేలకు తగ్గకుండా మందిని రైలుమార్గంలో తరలించాలన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వారిని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని, అందుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతీ కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల, తెగువ, కృషి.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపుగా చూపాలని సూచించింది. పోటాపోటీగా ఆశావహులు.. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. మాజీ ఎంపీలు, సీనియర్లు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను సంప్రదిస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు కూడా వినిపిస్తున్నది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, నెహ్రూనాయక్, బెల్లయ్యనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నలుగురు సీనియర్లు కూడా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ల కోసం లోపాయికారిగా మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో దాదాపు 15–16 స్థానాలు కై వసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్ ఎంపీలను గెలిపించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇవి కూడా చదవండి: మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి -
ఇక ఢిల్లీలో ‘కల్లాల’ గళం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తానని ఢిల్లీ వెళ్లి.. ఉత్తి చేతులతో తిరిగి వచ్చేసిన సీఎం కేసీఆర్‌లాగా తాము మోసం చేయలేమని, తెలంగాణ రైతాంగం పక్షాన ఢిల్లీలో గళం వినిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో డిసెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు. టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల ‘వరి దీక్ష’ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో పాల్గొన్న రేవంత్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. వరి పండించవద్దని చెప్పి నా తన మాట వినకుండా గత యాసంగిలో వరి పంట వేసిన రైతులపై కక్ష తీర్చుకోవడంలో భాగంగానే కేసీఆర్ ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు పెడుతు న్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కలసి దేశంలోని రైతాంగం పండించే పంటలను అదానీ, అంబానీలనే కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, మోదీ, కేసీఆర్, అదానీ, అంబానీలది దుష్టచతుష్టయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. సీఎం కేసీఆర్‌తో కలసి దొడ్డిదారిలో ఆ చట్టాల్ని ప్రజలపై రుద్దుతోందని విమర్శించారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యం కొనేది లేదని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ మెడలు వంచి ధాన్యం సమస్యను పరిష్కరిస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కనీసం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అడగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్లాలపై రైతులు చనిపోయిన ఘటనలకు కేసీఆరే బాధ్యుడని అన్నారు. కాగా, రైతులు కష్టాల్లో ఉంటే బీజేపీ నేతలు పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని రేవంత్ విమర్శించారు. రైతుల శవాల మీద గద్దెనెక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దు య్యబట్టారు. తెలంగాణలో రైతులతో పెట్టు కున్నోడు రాజ్యమేలిన దాఖలాలు లేవని, గతంలో చంద్రబాబు కూడా రైతులతో పెట్టుకునే తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. ఈ దీక్షతో కనువిప్పు కలగాలి: జానా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ వరి దీక్షతో ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని అన్నారు. తమ పార్టీ దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవత్వం లేని కేసీఆర్ పని ఖతం అయిందని అన్నారు. వరి వేస్తే ఉరి.. రైతులకు కాదని, కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని ఉరి వేసేందుకు రైతులు సిద్ధం గా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మనస్ఫర్థలు సాధారణమేనని, అందరం కలసి పని చేస్తామని చెప్పిన కోమటిరెడ్డి తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. ఢిల్లీలో ధర్నాకు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆ హ్వానించి తెలంగాణ రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, జి.చి న్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సుదర్శన్‌రెడ్డి, సునీతారావు, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావులతో పాటు పలువురు ఇతర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షలో భాగంగా మొత్తం 9 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారం గురించి నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన 92 ఏళ్ల రైతు రాంరెడ్డి పాడిన పాటను అభినందించిన రేవంత్ ఆయనకు పాదాభివందనం చేశారు. -
సత్తా చాటాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది. మూడంచెల వ్యూహం... ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్‌కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్‌బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్‌రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు. వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. గాంధీభవన్‌లో కీలక నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్‌లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. స్టార్ క్యాంపెయినర్లు వీరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నారు. -
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు. స్పీకర్, చైర్మన్ సమాధానం చెప్పాలి: భట్టి పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్లు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. -
పెద్దపల్లి సభలో బాహాబాహీ..
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్సెస్ ఎమ్మెల్యే పుట్ట మధు - ప్రాజెక్టుపై అభిప్రాయ సేకరణ సందర్భంగా దాడి పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుపై తలపెట్టిన అభిప్రాయ సేకరణలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. పెద్దపల్లిలో బుధవారం పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు తలపెట్టిన అభిప్రా య సేకరణ రసాభాసగా ముగిసింది. ఇరువర్గాల మధ్య దాడిలో ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి. మాజీ మంత్రి అనుచరులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం గొడవకు దారితీసింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడి అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేసి అభిప్రాయ సేకరణ కానిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పట్ల శ్రీనివాస్ మైక్ అందుకొని ప్రాజెక్టుకు వ్యతిరే కంగా ప్రసంగించారు. శ్రీనుపై టీఆర్ఎస్ నాయకులు పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి దిగారు. దీనిని వ్యతిరేకించే క్రమంలో మంథనికి చెందిన క్రాంతి, కొత్త శ్రీనివాస్‌లపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను నిలువరించారు. సమావేశానికి హాజరైన శ్రీధర్‌బాబు సహా కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేసి పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఆహారం తీసుకునేందుకు కూడా అనుమ తించడం లేదని స్టేషన్ ముందు బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జై: ఇన్చార్జి కలెక్టర్ పెద్దపల్లిలో కాలుష్య మండలి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న 25 మందిలో 23 మంది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడారని ఇన్చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ జరగాలని అంటే.. 150 కి.మీ దూరంలోని కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు కోసం అక్కడి భూనిర్వాసితులతో అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరించా రని శ్రీధర్‌బాబు విమర్శించారు. -
లక్ష ఉద్యోగాలేవి కేసీఆర్?
- తెలంగాణ చరిత్రలో సోనియా పాత్రను విస్మరిస్తారా? - ‘తెలంగాణ జాగ్రఫి’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి ఉద్యోగాలకే పరిమితమైందని మాజీమంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణ సాధనపై పాఠ్యాం శాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాత్రను, తమ పార్టీ నేతల భాగస్వామ్యాన్ని పొందుపర్చకపోవడం శోచనీయమన్నారు. శాసనసభ మాజీ స్పీకర్, దివంగత శ్రీపాదరావు జ్ఞాపకార్థం గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ ఆనంద్గోపగాని రూపొందించిన ‘తెలంగాణ జాగ్రఫి’ పుస్తకాన్ని శ్రీధర్‌బాబు బుధవారం గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజా సంఘాల పోరాటాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ ఎల్లన్న, డాక్టర్ అక్తర్అలీ, ఇందిరా శోభన్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో విద్యార్థి నేతల చేరిక ఉస్మానియా వర్సిటీ, నిజాం కళాశాలలోని విద్యార్థి సంఘాల నాయకులు లక్ష్మణ్, వినయ్, నవీన్, అజయ్, ఉమేశ్, సురేశ్ తదితరులు శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. -
నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట
మంథని: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంథనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయూడనిడన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని చెప్పారు. ఆరోపణలు సరికాదు : శ్రీధర్‌బాబు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చకోవడానికి ఎమ్మెల్యే పుట్ట మధు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
శ్రీపాద విగ్రహం ఎదుట శవ దహనానికి యత్నం!
- ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ తల్లి? - శ్రీధర్‌ను నమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నాం:మాజీ సర్పంచ్ కరీంనగర్: ఓ మాజీ సర్పంచ్ కరీంనగర్ నడిబొడ్డున మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహం వద్ద బుధవారం రాత్రి తన తల్లి శవాన్ని దహనం చేసేందుకు యత్నించాడు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కారణంగా తాము ఆస్తులు అమ్ముకున్నామనీ, అందుకే తన తల్లి ఆత్మహత్య చేసుకుందంటూ ఈ చర్యకు పాల్పడ్డాడు. బెజ్జంకి మండలం పారువెల్లికి చెందిన మాజీ సర్పంచ్ రెడ్డవేణి వినోద్ తల్లి లచ్చవ్వ(55) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా శవపంచనామా చేసిన అధికారులు.. కొడుకు మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దీంతో వినోద్ టాటాఏస్ వాహనంలో తల్లి మృతదేహంతోపాటు వాహనాల టైర్లు, పెట్రోల్ తీసుకుని బయల్దేరాడు. అక్కడ బస్టాండ్ఎదురుగా ఉన్న మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం వద్దకు చేరుకోగానే వాహనం ఆపాలని డ్రైవర్ అజీమ్‌ను కోరాడు. దీంతో అజీమ్ వాహనాన్ని నిలపగా అందులో ఉన్న టైర్లను శ్రీపాద విగ్రహం వద్ద వేసి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రీపాద విగ్రహం గద్దెకు ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత వాహనంలో ఉన్న తన తల్లి శవాన్ని ఆ మంటల్లో వేసి దహనం చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే ట్రాఫిక్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో వినోద్ ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని పట్టుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాను మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును నమ్ముకోవడం వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిం దని పోలీసుల విచారణలో వినోద్ తెలిపాడు. తాను అన్నివిధాలా నష్టపోవడం వల్లే తన తల్లి వేదనతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అందుకే శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు విగ్రహం వద్ద తల్లి శవాన్ని దహనం చేయూలనుకున్నానని వెల్లడించాడు. -
తాగునీటి ఇబ్బందులపై ప్రధాని చొరవ చూపాలి
పారిశ్రామిక ప్రాంతాన్నివిస్మరించండం బాధాకరం టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గోదావరిఖని: మిషన్‌భగీరథ పేరుతో శ్రీపాదఎల్లంపల్లికి చెందిన నీటిని గజ్వేల్‌కు తరలిస్తున్న ముఖ్యమంత్రి స్థానిక ప్రాంతవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనీయకుండా ప్రధాని నరేంద్రమోడీ చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వంలో సోనియాగాంధీ నేతృత్వంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సంకల్పం జరిగిందన్నారు. ఎఫ్‌సీఐ పునఃప్రారంభోత్సవానికి ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్, ఎఫ్‌సీఐ మంత్రి, ప్రముఖులు ఆలోచించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన రామగుండంలో వీటిని ప్రారంభించడానికి ప్రధాని రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం మేరకు తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గజ్వేల్ ప్రాంతం వైపు పైపులైన్ ద్వారా నీటిని తరలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రామగుండం ప్రాంత ప్రజలతోపాటు పెద్దపల్లి, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్ ప్రాంతాలకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు బడికెల రాజలింగం, కాల్వ లింగస్వామి, ఎం.రవికుమార్, మహంకాళి స్వామి, తానిపర్తి గోపాల్‌రావు, బొంతల రాజేష్, వంగ లక్ష్మీపతిగౌడ్, పెద్దెల్లి ప్రకాశ్, కొలిపాక సుజాత పాల్గొన్నారు. -
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అవసరం లేని కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం, రుణమాఫీ governament, agritcultre, sridharbabu ధర్మపురి/వెల్గటూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. పంటలు లేక అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోని సర్కారు... అవసరం లేని కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు. ధర్మపురిలోని బ్రాహ్మణlసంఘం భవనంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెల్గటూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. రుణమాఫీ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర రైతాంగం అనేక కష్టాల్లో ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం హరితహారం పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టు పీజీ ఉచిత విద్య నెరవేరని కోర్కెలుగానే మిగిలాయన్నారు. రానున్న కాలంలో ప్రజలు కళ్లుతెరువక తప్పదన్నారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు ఆశపడి కొంతమంది కాంగ్రెస్ వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఈనెల 25న పెద్దపెల్లిలో జరిగే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు దినేష్, ఇంద్రాల మల్లేశం, సీనియర్ నాయకులు గోమాస శ్రీనివాస్ , ఎల్లాగౌడ్, చుక్కరవి, కస్తూరి శ్రీనివాస్, వెల్గటూర్‌లో మాజీ ఏఎంసీ చైర్మన్ చుక్క శంకర్రావు, సర్పంచ్ గుండాటి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కేసీఆర్.. నిన్ను తెలంగాణ జాతి క్షమించదు
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ శాసనసభను వేది కగా చేసుకుని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఈ చీకటి ఒప్పందంతో మహారాష్ట్ర ప్రభుత్వం భవిష్యతులో ఇన్‌టెక్‌వెల్ ఏర్పాటు పేరిట మరింత పెద్ద ఎత్తున నీటి దోపిడీకి పాల్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చీకటి ఒప్పందం ఫలితంగా తెలంగాణ జాతి కేసీఆర్‌ను క్షమించబోదని హెచ్చరించారు. మానీరు-మాకే’ నినాదంతో త్వరలోనే ఆయా జిల్లాలకు వెళ్లి మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న చీకటి ఒప్పందాన్ని ఎండగడతామని చెప్పారు. కరీంనగర్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలసి జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికే కేసీఆర్ ప్రభుత్వం నియమిం చిన ఇంజనీర్ల కమిటీ మొగ్గుచూపింద న్నా రు. 2014 ఆగస్టులో జరిగిన మహారాష్ట్ర-తెలంగాణ ఇంజనీర్ల సమావేశంలోనూ టీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఇంజనీర్ విద్యాసాగర్‌రావు సైతం తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని సూచించా రని పేర్కొన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాహుబలికి మించిన సినిమా చూపారని, స్పీకర్ అవకాశమిస్తే పవర్‌పాయింట్ ద్వారా రాష్ట్రంలోని యథార్థ పరిస్థితిని వివరించేం దుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. -
అచ్చి.. రాలే..!
►జెడ్పీ క్వార్టర్స్ పేరెత్తితే జంకుతున్న ప్రముఖులు ►అడుగుపెడితే అంతేనట.. నివాసముంటే ఓటమే..! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రులతో పాటు జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఈ క్వార్టర్లలో నివాసం ఉండటం ఆనవాయితీగా వస్తోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2009లో వైఎస్సార్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ క్వార్టర్స్‌లోనే మకాం పెట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన కరీంనగర్లో వేర్వేరు చోట్ల అద్దెగృహాల్లో ఉన్నారు. మంత్రి హోదాలో వాస్తుకు అనుగుణంగా తన క్వార్టర్‌ను తీర్చిదిద్దుకున్నప్పటికీ.. ఆయనకు కలిసి రాకపోవటం జెడ్పీ క్వార్టర్స్ మహత్యమనే ప్రచారం జరిగింది. 2009 మే వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న ఆరెపల్లి మోహన్ సైతం ఈ క్వార్టర్స్‌లోనే నివాసం పెట్టారు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరెపల్లి ఏడాది పాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆరెపల్లి కూడా ఓడిపోయారు. ►ఆయన తర్వాత జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇటీవలి వరకు అదే క్వార్టర్లో నివాసం ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీచేసి ఓడిన లక్ష్మణ్‌కుమార్... ఇందులో అడుగుపెట్టాక వచ్చిన వరుస ఎన్నికలన్నింటా దెబ్బతిన్నారు. ►2010 ఉపఎన్నికలు, 2014 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. 1995-2000 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న రాజేశంగౌడ్‌కు ఈ క్వార్టర్స్ కలిసి రాలేదు. తర్వాత కీలక పదవులేమీ వరించకపోగా.. క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ►2001-2006 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కేవీ.రాజేశ్వరరావు కూడా తన పదవీకాలంలో ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ►కరీంనగర్ మొదటి మేయర్‌గా ఎన్నికైన డి.శంకర్ ఈ క్వార్టర్స్‌లోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ► ఇప్పుడు కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఇటీవలే క్వార్టర్స్‌లో గృహప్రవేశం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ కోసం మరో క్వార్టర్స్‌కు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు..
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కమాన్‌పూర్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల్లో తనను చులకన చేసేందుకే ప్రత్యర్థులు ఇలా దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మండలంలోని రొంపికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ను వదులుతాననే వార్తల్లో నిజం లేదన్నారు. తనను గిట్టనివారే పథకం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తన తండ్రి శ్రీపాదరావుతో పాటు తనను ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ప్రజలు తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని, ఈసారి ఓడిపోయినమాత్రాన ప్రజలకు అందుబాటులో ఉండననే అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాడతానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇనగంటి జగదీశ్వరావు, కుట్కుం నారాయణ, బెల్లంకొండ విజేందర్‌రెడ్డి, గుమ్మడి వెంకన్న, కమ్మగోని మల్లయ్య, కుందారపు బాపు తదితరులున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కంగాళీ కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అధికార పార్టీలో జిల్లాకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేకానందకు తీవ్రస్థాయిలో విభేదాలుండేవి. మంత్రితో తమకున్న విభేదాల కారణంగా ఎంపీలు ఇద్దరూ ఒక్కటిగా ఉండేవారు. పెద్దపల్లి ఎంపీ వివేకానంద కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరడంతో ఇప్పుడు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉంది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఈ రెండు వర్గాల మధ్య దూరం మరింత పెరిగినట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. తెలంగాణ ప్రకటనకు ముందు తనకు చెక్ పెట్టేందుకు మంత్రి ప్రయత్నించాడనే కారణంతో ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉండేవారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవహారంతో ఇది మరింత తీవ్రమైంది. తెలంగాణ ప్రకటన వచ్చాక వీరిద్దరి క్రెడిట్ ఫైట్ రూపంలో ఇది కొనసాగుతోంది. సీనియర్ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో మినహాయిస్తే... అన్ని చోట్ల మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.రవీందర్రావు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. రవీందర్‌రావుకు పోటీగా ఇక్కడ పీసీసీ అధికార ప్రతినిధి సీహెచ్.ఉమేశ్‌రావు, మాజీ అధికార ప్రతినిధి కె.మృత్యుంజయం వేర్వేరు వర్గాలుగా ఉన్నారు. ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన కె.కె.మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే... అప్పుడు ఆధిప్యత పోరు నాలుగు వర్గాలకు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉన్నాయి. ప్రవీణ్‌రెడ్డి సొంతంగానే ముందుకు వెళ్తూ మంత్రి శ్రీధర్‌బాబుతో సమన్వయంతో ఉన్నారు. ఎమ్మెల్యేకు పోటీగా ఇక్కడ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు, పీసీసీ కార్యదర్శి శ్రీరాంచక్రవర్తి మంత్రితో సన్నిహితంగానే ఉంటూనే ప్రత్యేక వర్గాన్ని నడిపిస్తున్నారు. పెద్దపల్లిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గీట్ల ముకుందరెడ్డి ఇటీవల మళ్లీ క్రియాశీలమయ్యారు. ఇక్కడ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టికెట్ తనదేనని ముకుందరెడ్డి అంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీకే మంత్రి సహకరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న ఇక్కడ ఇతర పార్టీలోని ఒక ముఖ్యనేతను తీసుకువచ్చేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే నాలుగు వర్గాలు ఉన్నాయి. కొత్తగా మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి నేతలు కూడా అధికార పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేతిరి సుదర్శన్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నాలుగు గ్రూపులతో ఇక్కడ అధికార పార్టీ సుదీర్ఘకాలంగా అధికారానికి దూరంగానే ఉంటోంది. వేములవాడలో కాంగ్రెస్‌కు మొదటి నుంచి నాయకత్వ సమస్య ఉంటోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు, మంత్రి శ్రీధర్‌బాబుకు దగ్గరగా ఉంటారు. తెలంగాణ ప్రకటన తర్వాత ఇక్కడ రాజకీయం మారుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీగల రవీందర్‌గౌడ్, చెన్నమనేని శ్రీకుమార్ సోమవారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. వీరితోపాటు మరోనేత కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనుండడంతో ఇక్కడ అధికార పార్టీలో గ్రూపులు పెరిగే పరిస్థితి ఉంది. కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చల్మెడ లక్ష్మీనర్సింహారావు వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వై.సునీల్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ వర్గ రాజకీయాలు అంతర్గతంగానే ఉన్నాయి. కోరుట్ల నియోజకవర్గంలోనూ నాలుగు వర్గాలు ఉన్నాయి. మాజీ మంత్రి జువ్వాడి కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, జె.ఎన్.వెంకట్, కల్వకుంట్ల సుజిత్‌రావు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ గ్రూపు రాజకీయాలతోనే ఓడిపోయిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ అరడజను గ్రూపులుగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాబర్‌సలీంపాషా, కౌశికహరి, హర్కర వేణుగోపాల్‌రావు, కోలేటి దామోదర్, తానిపర్తి గోపాల్‌రావు, బడితల రాజలింగం తలో వర్గంగా పని చేస్తున్నారు. వీరు కాకుండా మంత్రికి ఇక్కడ ఎప్పుడూ ప్రత్యేకంగా ఓ వర్గం ఉంటోంది. చొప్పదండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గునుకొండ బాబు మళ్లీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ సంఘానికి చెందిన ఓ నాయకుడు సైతం ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న మానకొండూరు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నియోజకవర్గం జగిత్యాల, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇన్‌చార్జీగా ఉన్న ధర్మపురి నియోజకవర్గాల్లో మాత్రం గ్రూపులు కనిపించడం లేదు.