తాగునీటి ఇబ్బందులపై ప్రధాని చొరవ చూపాలి
-
పారిశ్రామిక ప్రాంతాన్నివిస్మరించండం బాధాకరం
-
టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
-
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గోదావరిఖని: మిషన్‌భగీరథ పేరుతో శ్రీపాదఎల్లంపల్లికి చెందిన నీటిని గజ్వేల్‌కు తరలిస్తున్న ముఖ్యమంత్రి స్థానిక ప్రాంతవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనీయకుండా ప్రధాని నరేంద్రమోడీ చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్ చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వంలో సోనియాగాంధీ నేతృత్వంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సంకల్పం జరిగిందన్నారు. ఎఫ్‌సీఐ పునఃప్రారంభోత్సవానికి ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎఫ్‌సీఐ మంత్రి, ప్రముఖులు ఆలోచించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన రామగుండంలో వీటిని ప్రారంభించడానికి ప్రధాని రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం మేరకు తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గజ్వేల్ ప్రాంతం వైపు పైపులైన్ ద్వారా నీటిని తరలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రామగుండం ప్రాంత ప్రజలతోపాటు పెద్దపల్లి, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్ ప్రాంతాలకు తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు బడికెల రాజలింగం, కాల్వ లింగస్వామి, ఎం.రవికుమార్, మహంకాళి స్వామి, తానిపర్తి గోపాల్‌రావు, బొంతల రాజేష్, వంగ లక్ష్మీపతిగౌడ్, పెద్దెల్లి ప్రకాశ్, కొలిపాక సుజాత పాల్గొన్నారు.