సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది.
ఈ క్రమంలోనే భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్‌పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment