ఓఆర్‌ఆర్ ట్రిపుల్ ఆర్ నడుమ పది పారిశ్రామిక పార్కులు
డిజిటల్ హెల్త్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
డ్రగ్స్ నియంత్రణకు వేయి రూరల్ స్కూళ్లలో స్పెషల్ యాప్
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశమున్న చోట సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, నూతన ప్రణాళికలను వివరించారు.
ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య కొత్తగా పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అరులో ఐదింటిని ఎంఎస్‌ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో ఒక దానిని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించడంతోపాటు కొత్త పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని ప్లాట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, వారికోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని వెల్లడించారు.
‘మాదకద్రవ్యాలతో పొంచి ఉన్న ప్రమాదంపై విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడం కోసం రూపొందించిన ‘డ్రగ్ అబ్యూజ్ యాప్’ను వేయి గ్రామీణ స్కూళ్లలో వినియోగిస్తాం. చిన్న, సన్న కారు రైతులకు 48 గంటల్లోపు రూ.లక్ష వరకు రుణం లభించేలా రూపొందించిన యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న ప్రారంభిస్తారు’అని వెల్లడించారు.
కంపెనీలకు సులభంగా అనుమతులు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సత్వరం అనుమతులు లభించేలా సరళీకరణ విధానాలను అమలుచేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘ఏడాది కాలంలో టీజీఐపాస్ ద్వారా రూ.6,347.59 కోట్ల విలువైన 1,539 యూనిట్లకు అనుమతులిచ్చి 35,724 మందికి ఉపాధి కలి్పంచాం. మరో రూ.9,240 కోట్లతో 37,588 ఉపాధి కల్పన కోసం 731 యూనిట్లు అనుమతులు కోరాయి. 8,894 మందికి ఉపాధి కలి్పంచేలా 14,433 కోట్లతో ఏర్పాటయ్యే 16 మెగా ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చాం. ఫార్మా రంగంలోనూ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టుల ద్వారా 51 వేల మందికి ప్రత్యక్షంగా, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి’అని శ్రీధర్‌బాబు వివరించారు.
నిమ్జ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘9 కాలేజీలతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. నిమ్జ్‌కు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులిస్తుంది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధి కోసం కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ఏఐ రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు 200 ఎకరాల్లో ఎక్సలెన్సీ సెంటర్‌కు వచ్చే ఏడాది ఆరంభంలో శంకుస్థాపన చేస్తాం. వీహబ్ ద్వారా కొత్తగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 33 జిల్లా కేంద్రాల్లో మినీ ప్రొటో టైపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరో 11 స్కూళ్లు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment