Special app
-
చిన్న పరిశ్రమలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశమున్న చోట సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, నూతన ప్రణాళికలను వివరించారు.ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య కొత్తగా పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అరులో ఐదింటిని ఎంఎస్ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో ఒక దానిని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించడంతోపాటు కొత్త పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని ప్లాట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, వారికోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని వెల్లడించారు.‘మాదకద్రవ్యాలతో పొంచి ఉన్న ప్రమాదంపై విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడం కోసం రూపొందించిన ‘డ్రగ్ అబ్యూజ్ యాప్’ను వేయి గ్రామీణ స్కూళ్లలో వినియోగిస్తాం. చిన్న, సన్న కారు రైతులకు 48 గంటల్లోపు రూ.లక్ష వరకు రుణం లభించేలా రూపొందించిన యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న ప్రారంభిస్తారు’అని వెల్లడించారు. కంపెనీలకు సులభంగా అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సత్వరం అనుమతులు లభించేలా సరళీకరణ విధానాలను అమలుచేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘ఏడాది కాలంలో టీజీఐపాస్ ద్వారా రూ.6,347.59 కోట్ల విలువైన 1,539 యూనిట్లకు అనుమతులిచ్చి 35,724 మందికి ఉపాధి కలి్పంచాం. మరో రూ.9,240 కోట్లతో 37,588 ఉపాధి కల్పన కోసం 731 యూనిట్లు అనుమతులు కోరాయి. 8,894 మందికి ఉపాధి కలి్పంచేలా 14,433 కోట్లతో ఏర్పాటయ్యే 16 మెగా ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చాం. ఫార్మా రంగంలోనూ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టుల ద్వారా 51 వేల మందికి ప్రత్యక్షంగా, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి’అని శ్రీధర్‌బాబు వివరించారు. నిమ్జ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ‘9 కాలేజీలతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. నిమ్జ్‌కు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులిస్తుంది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధి కోసం కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ఏఐ రంగంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు 200 ఎకరాల్లో ఎక్సలెన్సీ సెంటర్‌కు వచ్చే ఏడాది ఆరంభంలో శంకుస్థాపన చేస్తాం. వీహబ్ ద్వారా కొత్తగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 33 జిల్లా కేంద్రాల్లో మినీ ప్రొటో టైపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరో 11 స్కూళ్లు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. -
నష్టం అంచనాకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బతిన్న వ్యాపారులు, నష్టపోయిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పించేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు. -
పట్టణ రోడ్ల నిర్వహణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, వీధిలైట్లు, డ్రెయినేజీల నిర్వహణకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. ప్రస్తుతం కొంతమేర టెక్నాలజీ వాడుతున్నప్పటికీ.. ఇకపై గుంతల గుర్తింపుతోపాటు అన్ని పనులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ‘యాప్’ను రూపొందిస్తున్నారు. గత వారం మునిసిపల్ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ తరహా పనులకు డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలకు అనుగుణంగా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించేలా.. రోడ్లపై గుంతల పూడ్చివేత నుంచి రోడ్డు పక్కనున్న మొక్కలు, చెట్ల వరకు అన్ని వివరాలను ఈ యాప్‌లో పొందుపరచనున్నారు. ప్రాథమిక స్థాయిలో వార్డు సచివాలయంలోని ఎమినిటీ కార్యదర్శి వివరాలు అప్లోడ్ చేస్తే వెనువెంటనే స్థానిక మునిసిపల్ కమిషనర్‌తో పాటు సీడీఎంఏలోని ఉన్నతస్థాయి అధికారులు సైతం పరిశీలించేలా యాప్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల రోడ్ల మరమ్మతుల విధానం సులభతరం అవుతుందని, రెండో దశ గుంతల పూడ్చివేతను ఈ విధానంలోనే చేపట్టనున్నామని సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. మొదటి దశలో రూ.58.20 కోట్లతో మొత్తం 123 యూఎల్బీల్లో 41,412 గుంతలను పూడ్చినట్టు చెప్పారు. ఇకపై యాప్ ద్వారా రోడ్ల నిర్వహణతో పాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధిలైట్లు, డ్రెయినేజీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న చెట్లు, మొక్కలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. అప్లోడ్ చేసిన వెంటనే పనులు ప్రస్తుతం వార్డు సచివాలయం పరిధిలోని రోడ్లపై పడే గుంతలను వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటోలు తీసుకుని, వాటిని కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. వీటిని స్థానిక యూఎల్బీల్లో అధికారులు పరిశీలించి, ఉన్నతస్థాయి అనుమతి తీసుకుని పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టడం ఆలస్యం అవుతోంది. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటో అప్లోడ్ చేయగానే వెంటనే అది స్థానిక మునిసిపల్ కమిషనర్, ఇంజనీర్‌తో పాటు సీడీఎంఏలోని సంబంధిత విభాగం ఉన్నతాధికారికి చేరుతుంది. ఫొటో సైతం ఎక్కడ తీశారో అక్షాంశాలు, రేఖాంశాలతో నమోదవుతుంది. వార్డు సచివాలయం పరిధిలో ఎన్ని కి.మీ. మేర రోడ్లు ఉన్నాయి, వాటిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎన్ని, ఆయా మార్గాల్లోని వీధిలైట్లు, రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగు కాలువలు, మొక్కలు, చెట్లు వంటి వాటి వివరాలు సైతం అప్లోడ్ చేయనున్నారు. ఆయా మార్గాల్లో గుంతలు పడినా, ఎవరైనా తవ్వకాలు చేపట్టినా గుర్తించి వాటి ఫొటోలను యాప్‌లో ఉంచుతారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండటంతో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. -
పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ఇంట్లో తెలిసిపోద్ది!
సాక్షి, భీమవరం: అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. ప్రత్యేక యాప్‌తో ప్రయోజనాలెన్నో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్‌గా నమోదు చేస్తారు. ఉదయం యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు. కార్పొరేట్ సవ్వడి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు. అన్ని పాఠశాలల్లో.. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్ పాఠశాలల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది. – ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం హాజరు శాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కారణంగా హాజరుశాతం పెరిగింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకానికి హాజరు శాతం తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు హాజరు కాకుంటే వారికి నచ్చచెప్పి స్కూల్‌కు పంపిస్తున్నారు. దీని కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. – వి.రాధాకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఎస్ఎం స్కూల్, భీమవరం చాలా బాగుంది ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్లేలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ చాలా బాగుంది. మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఎప్పుడైనా బడికి వెళ్లకపోతే మెసేజ్ వస్తుంది. స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాలను టీచర్స్‌కు వివరిస్తున్నాం. – ఎన్.వరలక్ష్మి, విద్యార్థిని తల్లి, దొంగపిండి -
ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైంది. త్వరలో ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు.. టాప్‌లో ఏపీ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది. విలేజ్ క్లినిక్స్‌లో వివరాలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని సచివాలయాలను విభజిస్తున్నారు. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యను వివరించి సలహాలు, సూచనలు పొందవచ్చు. విలేజ్ క్లినిక్‌కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులను తీసుకోవచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు అవసరమైనవారు విలేజ్ క్లినిక్‌లో సంప్రదిస్తే టెలీ మెడిసిన్ ద్వారా ఆయా వైద్యులతో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) మాట్లాడిస్తారు. ప్రత్యేక యాప్ ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తోంది. సచివాలయాల వారీగా వలంటీర్ల క్లస్టర్ల ప్రాతిపదికన ప్రజల వివరాలను యాప్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (జీవన శైలి జబ్బులు) సర్వేలో భాగంగా వైద్య శాఖ ప్రజలను స్క్రీనింగ్ చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానిస్తున్నారు. యాప్‌లో వైద్యాధికారులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఎంఎల్‌హెచ్‌పీలు, సచివాలయ ఏఎన్ఎంలు.. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లాగిన్ ఉంటుంది. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు రోగి ఏ క్లస్టర్ పరిధిలో ఉంటారో చెబితే చాలు దాని ఆధారంగా ఎన్సీడీ సర్వేతో సహా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు. ఆ వివరాలతో పాటు అవసరమైన మందులను కూడా యాప్‌లో నమోదు చేస్తారు. మందుల ప్రిస్క్రిప్షన్ ఎంఎల్‌హెచ్‌పీ లాగిన్‌కు వెళుతుంది. దాని ఆధారంగా రోగికి ఎంఎల్‌హెచ్‌పీ మందులను అందిస్తారు. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ సంబంధిత వ్యక్తి డిజిటల్ హెల్త్ ఐడీలో అప్లోడ్ చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వైద్యుడే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసే ఆప్షన్‌ను కూడా యాప్‌లో కల్పిస్తున్నారు. ఇబ్బందులు ఎదురవకుండా.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను ఇద్దరు వైద్యులకు విభజిస్తారు. రోజు మార్చి రోజు పీహెచ్సీ వైద్యుడు తనకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాలి. వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో ఉండి వైద్యసేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో వారికి సచివాలయాల్లోనే హాజరు నమోదుకు వీలు కల్పిస్తున్నారు. వైద్యుడితో పాటు ఏఎన్ఎంలు గ్రామంలో సేవలు అందించేలా ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ నమోదు చేసుకునేలా పనివేళలు మార్పు చేయనున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేరువే లక్ష్యం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి పీహెచ్సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను అందిస్తున్నాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పీహెచ్సీ, సీహెచ్‌సీలకు వెళ్లలేనివారు వైద్యుడికి ఫోన్ చేయవచ్చు. గ్రామాల్లో పాము కాట్లు, గర్భిణులకు పురిటి నొప్పులు తదితర సందర్భాల్లో 108 అంబులెన్స్ చేరుకునేలోపు పీహెచ్సీ వైద్యుడిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రాథమిక చికిత్స చర్యలను సూచిస్తారు. తద్వారా బాధితుల విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మెరుగైన సేవల కోసమే.. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మెరుగైన సేవలందించేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇలా అన్ని వివరాలను వ్యక్తిగత డిజిటల్ హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేస్తాం. బయోమెట్రిక్ ద్వారా సంబంధిత వ్యక్తి అంగీకారంతో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చే ఏడాది జనవరిలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు ప్రణాళిక రూపొందించాం. వైద్యులకు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పించడంతో పాటు ఏఎన్ఎంల హాజరు వేళల్లో మార్పుపై సచివాలయాల శాఖకు లేఖ రాశాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు ఎంతో మేలు.. పీహెచ్సీ వైద్యులకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ల పంపిణీ, శాశ్వత ఫోన్ నంబర్ కేటాయింపు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. అత్యవసర సమయాల్లో పీహెచ్సీ వైద్యుడికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. వైద్యులు బదిలీపై వేరే చోటకు వెళ్లినా ఫోన్ నంబర్లు మారవు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, జీజీహెచ్ కర్నూలు నిరంతర ఫాలోఅప్.. మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న వారి ఆరోగ్యం గురించి నిరంతరం వాకబు చేసేందుకు యాప్‌లో మరో ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక జబ్బులు) బాధితుల వివరాలు సచివాలయాల వారీగా ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో ఉంటాయి. పీహెచ్సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు యాప్‌లో నమోదైన వివరాలను పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. అనారోగ్య సమస్యలతో శిశువు జన్మిస్తే వెంటనే నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తారు. ఆ వివరాలు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. గర్భిణులు, బాలింతలకు చెకప్‌లు, విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర అంశాలనూ యాప్ పరిధిలోకి తెస్తున్నారు. -
సీఎం జగన్ ఆలోచనలకు కార్యరూపం.. ఆస్పత్రుల పర్యవేక్షణకు యాప్
సాక్షి, అమరావతి: ప్రజలకు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆస్పత్రుల నిర్వహణను నిత్యం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, బయోమెడికల్ పరికరాల నిర్వహణ, ఈ–హెచ్ఆర్ తదితర అంశాలపై పర్యవేక్షణకు ఏపీ వైద్య విధాన పరిషత్ ఈ యాప్‌ను రూపొందించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 53 ప్రాంతీయ (ఏరియా) ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్ డిసీజెస్ ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 16,340 పడకల సామర్థ్యం ఉంది. ఈ ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాల పర్యవేక్షణకు ‘ఏపీ హెల్త్ సెకండరీ కేర్’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌లో ప్రతి ఆస్పత్రికి ఒక లాగిన్‌ను కేటాయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లేదా ఆర్ఎంవో ఈ యాప్‌లో లాగిన్ అయి అందులోని మాడ్యూల్స్ ఆధారంగా వివరాలను నమోదు చేయాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీకి స్కోరింగ్, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ తదితర అంశాలపై స్కోరింగ్ ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు ఎస్/నో రూపంలో సమాధానాలివ్వాలి. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు ఆస్పత్రిలో రోగుల రక్షణకు సంబంధించిన సెక్యూరిటీ విజిట్ మాడ్యూల్లో.. సెక్యూరిటీ గార్డ్ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడా... అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. గార్డ్ అందుబాటులో ఉన్నాడని ‘ఎస్’ అని పెడితే వెంటనే లైవ్ ఫొటో అప్లోడ్ చేయాలని యాప్ అడుగుతుంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లైవ్ ఫొటోను అప్లోడ్ చేయాలి. ఎన్ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా యాప్ నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) ప్రమాణాలకు అనుగుణంగా యాప్‌లో ప్రశ్నావళిని రూపొందించాం. యాప్‌పై సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలకు శిక్షణ ఇచ్చాం. యాప్‌లో ఉండే వివరాలన్నీ రాష్ట్ర డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశాం. ఎక్కడైనా సెక్యూరిటీ, శానిటేషన్ ఇతర అంశాల నిర్వహణలో లోపాలున్నట్లు యాప్‌లో నమోదు చేస్తే డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది. దాని ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా యాప్‌ను తీసుకువచ్చాం. – డాక్టర్ వినోద్‌కుమార్, కమిషనర్, ఏపీ వైద్య విధాన పరిషత్ -
చట్టసభల నిర్వహణలో టెక్నాలజీ కీలకం
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర చట్టసభల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగించడం ద్వారా కాగితం అవసరం లేకుండా చట్టసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోను, శాసనమండలిలోను పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్‌ను అమలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ ద్వారానే కోవిడ్ సమయంలో 15వ చట్టసభలనుద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే వెసులుబాటు కలిగిందని చెప్పారు. కెనడాలో జరుగుతున్న 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో గురువారం ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ కార్యకలాపాలను, ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, రూల్ ఆఫ్ లా వంటి అంశాల్లో పాటిస్తున్న విధానాలను వివరించారు. చట్టాల రూపకల్పనలో సభ్యుల మధ్య జరిగే లోతైన చర్చలతో సరికొత్త విషయ ఆవిష్కరణ జరుగుతున్న తీరును తెలిపారు. దేశంలో లోక్‌సభ, రాజ్యసభల్లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.738 కోట్లతో నేషనల్ ఈ–విధాన్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్లమెంటు ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, చర్చలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. చట్టసభల నిర్వహణలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. -
ఖరీఫ్‌లో పంటల నమోదుకు ‘ఈ–క్రాప్’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. పక్కాగా నమోదు ఈ ఖరీఫ్‌లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్‌ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్‌లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అనంతరం యాప్‌లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్‌కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది. ఆ తర్వాత వీఏఏ /వీహెచ్ఏ, వీఆర్వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు. ఈ ఆప్షన్లో వివరాలు.. సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్‌ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్‌లు 5 శాతం, డీఏవో/డీహెచ్‌ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్‌గా తనిఖీ చేయాలి. ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు. -
నిత్యావసర ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రైతు బజారులు, స్థానిక మార్కెట్లలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలో ధరల స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎంయాప్–సీపీఏ (కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్) పేరిట ప్రత్యేక యాప్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. మార్కెటింగ్, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు, రైతు బజారుల సీఈవో ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ స్థానిక మార్కెట్లలో వివిధ సరుకుల ధరలు, రైతు బజారుల్లోని ధరలను విశ్లేషిస్తూ అందుకు సంబంధించిన డేటాను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచుతారని వివరించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 10 శాఖల అధికారులు ఈ యాప్‌ను మానిటర్ చేసేందుకు ప్రత్యేక లాగిన్ ఐడీలను ఇస్తామని చెప్పారు. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక మాస్టర్ డ్యాష్ బోర్టును కూడా రూపొందించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణకు యాప్ రూపొందించాలి నైరుతి రుతుపవన కాలంలో తుపానులు, వరదలు వంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ విపత్తుల సమాచారాన్ని సకాలంలో సంబంధిత శాఖల అధికారులు పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో వర్షాలు తక్కువగా, చివరి రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారని చెప్పారు. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు మాట్లాడారు. -
విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు రోజూ హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం మనబడి – నాడు–నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫామ్, షూ, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ అందిస్తోంది. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద రుచికరమైన పౌష్టికాహారం అందిస్తోంది. వీటన్నిటి అంతిమ లక్ష్యం.. విద్యాప్రమాణాల పెంపే. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి విద్యా ప్రమాణాలను పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే విద్యార్థులు రోజూ పాఠశాలలకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో వారి హాజరును పెంచేందుకు వీలుగా ‘అమ్మఒడి’ పథకానికి హాజరును అనుసంధానం చేస్తోంది. 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు అమ్మఒడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బయోమెట్రిక్ హాజరు యాప్‌ను ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ఇందులో ఏవైనా లోపాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనుంది. 82 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో 61 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 6.49 లక్షల మంది, రెండో తరగతిలో 58 వేలకుపైగా చేరారు. వీరిలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరడం గమనార్హం. మొత్తం మీద ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 6.5 లక్షల మంది వరకు విద్యార్థులు అదనంగా చేరారు. వీరు క్రమబద్ధంగా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. బయోమెట్రిక్ వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ బయోమెట్రిక్ హాజరుపెట్టడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లారో, లేదో తెలుస్తుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టడం మంచి పరిణామం. – గట్టెం అశోక్ కుమార్, విద్యార్థి తండ్రి, పెదపాడు, పశ్చిమ గోదావరి డ్రాపవుట్లు తగ్గుతాయి బయోమెట్రిక్ హాజరుతో డ్రాపవుట్లు తగ్గుతాయి. పాఠశాలకు ఎవరు రాలేదో వెంటనే తెలుస్తుంది. తద్వారా వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించవచ్చు. ఖచ్చితమైన హాజరు తెలియడంతో మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకత ఏర్పడుతుంది. – తోట ప్రసాద్, ఉపాధ్యాయుడు,మండల ప్రాథమిక పాఠశాల, పెదపాడు, పశ్చిమ గోదావరి -
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
-
ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్‌లకు నాలుగు జోన్లుగా చేస్తున్నామని, జోన్‌కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు. -
ప్రత్యేకం: నిరుద్యోగుల కోసం ‘డీట్’ యాప్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాలకు చెందిన అన్నిరకాల సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని నిరుద్యోగులకు చేరవేసేందుకు ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీట్) యాప్, పోర్టల్‌ను రూపొందించింది. ఉద్యోగాల వేటలో ఉన్నవారు తమ అర్హతలు, నైపుణ్యం, అనుభవం తదితరాలను ‘డీట్’లో నమోదు చేసుకుంటే వారికి ఉద్యోగ ఖాళీల సమాచారం అందుతుంది. అలాగే ఉద్యోగార్థుల అర్హత వివరాలను కూడా డీట్‌లో నమోదైన ఉద్యోగ కల్పన సంస్థలకు చేరవేస్తుంది. ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన సంస్థలు అనుసంధానం అయ్యేందుకు ఇదో మంచి వేదిక అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఐటీ శాఖ అంచనా వేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో డీట్ యాప్ ద్వారా ఈ–కామర్స్, ఆరోగ్య రక్షణ, సేవా రంగాల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టెలీకాలర్లు, హెల్త్‌కేర్ అసోసియేట్లు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల భర్తీ జరిగింది. డీట్ యాప్ ఉద్యోగాలను వెతికేందుకే పరిమితం కాకుండా ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూల షెడ్యూల్లోనూ సాయం చేస్తోంది. రెజ్యూమ్ రూపకల్పనలోనూ.. ఉద్యోగార్థులు రెజ్యూమ్ లేదా సీవీని సులభంగా తయారు చేసుకునేందుకు వీలుగా టెక్నాలజీని రూపొందించింది. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఉద్యోగార్థులతో కమ్యూనిటీ గ్రూపుల ఏర్పాటును డీట్ ప్రోత్సహిస్తోంది. ఈ తరహా గ్రూపుల్లో సుమారు 8,800కు పైగా నిరుద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు, డీట్ ప్రత్యేకతలు, వాక్–ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూలు తదితరాలను తరచూ ఈ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు డీట్ వేదికగా సుమారు 300కు పైగా నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఐటీ శాఖ చేరవేసింది. ఉద్యోగాల వేటలో ఉన్న వారికి రెజ్యూమ్ తయారీలో మెళకువలను నేర్పించడంతో పాటు ఉద్యోగాలు వెతికేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై 20కి పైగా ఆన్లైన్ అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘ఈక్విఫాక్స్’తో భాగస్వామ్యం.. డీట్ వేదిక ద్వారా షేర్ చేసే ఉద్యోగాల సమాచారంలో వాస్తవికతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్జూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ‘ఈక్విఫాక్స్’తో ఐటీ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలుకుని పెద్ద సంస్థల వరకు డీట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈక్విఫాక్స్ సాయం చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగార్థుల్లో ఉన్న నైపుణ్య లేమిని గుర్తించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వివిధ విభాగాలు, సంస్థల వారీగా ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు చేరవేయడం దిశగా ‘డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్’ను అభివృద్ధి చేయాలని ఐటీ శాఖ భావిస్తోంది. -
డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. భద్రతకు భరోసా
‘ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్డుపై మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరగగలుగుతారో అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లవుతుంది’ ఇదీ జాతిపిత మహాత్మా గాంధీ అన్న మాటలు.. అయితే ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ‘నిర్భయ’.. లాంటి అమానవీయ ఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు సగటు మహిళకు జరుగుతున్న ప్రమాదాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ‘బీసేఫ్’ను ప్రవేశపెడుతోంది. దీనిలో మహిళా భద్రతతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలపై ఆడియో, వీడియోలను పొందుపరిచింది. ఇది ఈ నెల మూడో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సాక్షి, అమరావతి బ్యూరో : సాంకేతికత ఎంత పెరుగుతుందో.. నేరాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు గుమ్మం దాటిన ఆడపడుచు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎక్కువ మంది ప్రమాదాలపై అవగాహన లేక.. విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయలో పాలుపోక తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ప్రమాదాలు.. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా “బీ సేఫ్’ పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ఆడియో, వీడియోలను యాప్‌లో పొందుపరిచింది. ప్రమాదాలపై అవగాహన.. నగరం రాజధాని ప్రాంతంలో భాగమవడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మాల్స్ సంస్కృతి పెరిగింది. పాశ్చాత్య పోకడలు పెరిగాయి. నగరంలో నిత్యం ఏదో ఒక పోలీసు స్టేషన్లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నాయి. వీటిని నివారించేందుకు నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక నంబర్లు ఉన్నా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తి బృందాలు, డయల్ 100, బ్లూ కోల్ట్సŠ, ఇంటర్సెప్టార్, వాట్సాప్ లాంటి సౌకర్యాలు ఉన్నా.. చిక్కులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతలపై చర్యలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు “బీసేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. తద్వారా ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ యాప్ ద్వారా డయల్ 100, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఓటీపీ, ఫేస్బుక్ మోసాలతోపాటు సురక్షిత ప్రయాణం, దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై ఆడియో, వీడియో రూపంలో అవగాహన కల్పిస్తారు. డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. బీసేఫ్ యాప్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం మొత్తం మీ ముందు దృశ్యశ్రవణ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా సంఘటన చూసినా.. వారి కళ్లముందు ప్రమాదం జరిగినా, అమ్మాయిలను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్ పోస్టర్లను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వీధుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదా.. ఆయా పోస్టర్ల మీద ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి,హైదరాబాద్: హైటెక్ పంథాలో ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్‌ఫోర్స్ బృందం రట్టు చేసింది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పోలీసులు రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి కొత్వాల్ అంజనీకుమార్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పంటర్‌గా మొదలై బుకీగా..: హిమాయత్‌నగర్‌కు చెందిన వ్యాపారి అలోక్ జైన్ ముందు పంటర్‌గా పందాలు కాసి నష్టపోయాడు. దీంతో తన సోదరుడు అభిషేక్ జైన్, స్నేహితుడు మేహుల్ కే మార్జారియాలతో కలి సి బుకీగా మారాడు. చిక్కడపల్లిలో ఓ ఫ్లాట్ తీసుకుని బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి పందాలు అంగీకరి స్తూ ఆ లెక్కల్ని రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ ముగిశాక పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ నిష్పత్తిని సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. యాప్ తయారు చేయించిన సుభాష్ దేశంలోనే ప్రముఖ బుకీగా పేరున్న రాజస్థాన్ వాసి సులేమాన్ సురానీ అలియాస్ సుభాష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. బెట్టింగ్స్ నిర్వహణకు సుభాష్ వెబ్సైట్, యాప్ రూపొందించాడు. వీటిల్లోకి లాగిన్ కావాలం టే యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తప్పనిసరి. గత ఐపీఎల్లో అలోక్ ఇందులో భాగస్వామిగా చేరాడు. అలోక్ వద్ద బెట్టింగ్‌కు పాల్పడే పంటర్లకూ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేందుకు ఒక్క క్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తూ కొంత సుభాష్‌కు పంపిస్తున్నాడు. ఆ సైట్, యాప్స్‌లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ నిష్పత్తి అన్నీ అక్కడే కనిపిస్తాయి. క్రికెట్‌కే కాకుండా ఏ క్రీడకైనా ఈ యాప్ ద్వారా పందాలు కాసుకోవచ్చు. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు ఈ యాప్‌లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు హవా లా మార్గంలో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. సమస్యలుంటే వాట్సాప్ ద్వారా నే సంప్రదింపులు జరపాలి. అనేక మ్యాచ్‌లకు బెట్టింగ్ నిర్వహించిన అలోక్ గ్యాంగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో బృందం దాడి చేసి అలోక్, అభిషేక్, మార్జారియాలను అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైట్, యాప్‌లను సుభాష్ బ్లాక్ చేశాడు. సుభాష్‌పై ఎల్ఓసీ జారీ చేయించాలని నిర్ణయించారు. ఈ అంశాల్లోనే బెట్టింగ్.. 1. టాస్ ఏ జట్టు గెలుస్తుంది? 2. ఫేవరేట్ టీమ్ ఏది? 3. ఓ బ్యాట్స్‌మెన్ ఎన్ని రన్స్ దాటతారు? 4. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? 5. మొదటి సెషన్లో (6 ఓవర్లు) ఎన్ని రన్స్ చేస్తారు? 6. రెండు, మూడు, నాలుగు సెషన్స్‌లో ఎన్నేసి నమోదవుతాయి? -
చెత్తకు టెక్నాలజీ
సేకరణ వాహనాలకు వీటీఎస్ పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక యాప్ కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం తొలిదశలో ఎంపికైన వరంగల్ జూన్ కల్లా అందుబాటులోకి.. హన్మకొండ : వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త రవాణా వ్యవస్థలో ప్రక్షాళన జరగనుంది. రోజువారీగా ఎక్కడి నుంచి ఎంత చెత్తను తీస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చెత్త కుండీలు, చెత్తను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాబోయే రెండు నెలల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పరిశుభ్ర తకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చెత్త నిర్వహణలో సరికొత్త పద్ధతులు ప్రవేశపెడుతోంది. ప్రతీరోజు పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడం ద్వారా వీధులను శుభ్రంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. దీని ప్రకారం చెత్త కుండీలు, చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్లే వాహనాలకు గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. ఒక్కో వాహనం, చెత్తకుండీలకు ప్రత్యేక కోడ్లను కేటాయిస్తారు. ఈ మొత్తాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ప్రతీరోజు చెత్తను కుండీల వారీగా సేకరిస్తున్నారా లేదా ? సేకరించిన చెత్తను డంప్ యార్డులకు తీసుకెళ్తున్నారా లేదా మధ్యలో పారబోస్తున్నారా అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రోజుల తరబడి చెత్తను సేకరించని ప్రాంతాలను గుర్తించి, అందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. తొలిదశలో వరంగల్ మున్సిపాలిటీల్లో చెత్త సేకరణలో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 నగరాల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 70 వాహనాలకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమరుస్తారు. చెత్త వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక కెమెరాలు అందిస్తారు. జీపీఎస్, కెమెరాల ఉపయోగంపై వీరికి శిక్షణ ఇస్తారు. 2016 మే చివరి కల్లా నగరంలో ఉన్న వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని నిర్ణయించారు. డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది. కుంటిసాకులు కుదరవు చెత్త సేకరణ విధానంలో వీపీఎస్ (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్)కు అనుగుణంగా స్మార్ట్ఫోన్లపై పనిచేసే అప్లికేషన్‌ను అందుబాటులోకి తెస్తారు. ఏదైనా ప్రాంతంలో చెత్త సేకరణలో లోపాలు ఉంటే ఫొటో తీసి యాప్ (అప్లికేషన్) ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. నిర్ణీత సమయంలోగా కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఈ ఫిర్యాదుపై స్పందించి .. తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించాలి. ఈ అప్లికేషన్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ చూస్తుంది. కాబట్టి స్థానిక అధికారుల పాత్ర స్వల్పం. ఫలితంగా సమస్య పరిష్కారంలో కుంటి సాకులు చెప్పడం వీలుకాదు. ఈ విధానం వల్ల చెత్త సేకరణలో పారదర్శకత ఏర్పడుతుంది. సమస్యను పరిష్కరించడంలో పారిశుద్ధ్య సిబ్బంది అశ్రద్ధ చేయడం తగ్గిపోతుంది. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 45 వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఉన్నప్పటికీ, పారదర్శకతపై సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం 45 వాహనాల నిర్వహణకు సంబంధించి ప్రతీనెల ఖర్చు అవుతున్న దాదాపు రూ.50వేలు మిగులుతారుు. డస్ట్బిన్ల వారీగా చెత్త సేకరణకు ముందు, చెత్త సేకరణకు తర్వాత అనే విధంగా ప్రతీరోజు రెండు ఫొటోలను తీసి ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తమవుతుంది. సెంట్రల్ సర్వర్ నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రత్యేక సంస్థ చూసుకుంటుంది. -
క్రైమ్ మ్యాపింగ్!
ప్రత్యేక యాప్ రూపొందించిన ఐటీ సెల్ నేరాలు జరిగే ప్రాంతాల డిజిటలైజేషన్ త్వరిత గతిన సమాచార సేకరణ..నేరాల నియంత్రణే లక్ష్యం అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి నేరాల నియంత్రణకు...కేసుల విచారణ త్వరితగతిన చేపట్టేందుకు...దోషుల్ని వేగవంతంగా పట్టుకునేందుకు నగర పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. తాజాగా సిటీ పోలీస్ ఐటీ సెల్ ‘క్రైమ్ మ్యాపింగ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. త్వరిత గతిన నేరాల సమాచారం అందించడం..అవసరమైన వివరాలు వేగవంతంగా తెలుసుకోవడం..మరిన్ని నేరాలు జరగకుండా నియంత్రించడానికి ఈ క్రైమ్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ⇔నగరంలోని ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి..? ⇔ఏదైనా నేరం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఎక్కడ సీసీ కెమెరాలున్నాయి..? ⇔ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో నేరాలు చేసే ముఠాలు ఎన్ని? ఏ తరహావి? ⇔ఫలానా ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? కేసు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఈ వివరాలు ఎంతో కీలకం. అయితే వీటిని మాన్యువల్‌గా తీసుకోవాలంటే... దాదాపు వారం రోజులు పడుతుంది. ఈ లోపు నేరం చేసిన వ్యక్తి ‘తీరం’ దాటిపోయే అవకాశం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు ఐటీ సెల్ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. క్రైమ్ మ్యాపింగ్ పేరుతో తయారు చేసిన దీన్ని కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో ఉండే ప్రత్యేకతల్లో కీలకమైనవి... థిమేటిక్ క్రైమ్ మ్యాప్ నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా తనకు అవసరమైన తేదీల మధ్య ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాప ర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వివరాలనూ పొందుపరిచారు. క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ కమిషనరేట్‌లోని జోన్లు, సబ్-డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా ఏ తరహా నేరాలు, ఏ సమయంలో, ఏఏ రోజుల్లో, ఏ విధంగా జరుగుతున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలకు ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయవచ్చు. మరోపక్క ఠాణాల పరిధిలో గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రక్షక్లను ఆయా సమయాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టేలా ఠాణా అధికారులూ వ్యూహం సిద్ధం చేసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. క్రైమ్ రాడార్ సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్‌తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని క్రైమ్ రాడార్లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సీసీఆర్బీ సెర్చ్ నగరంలో చైన్ స్నాచింగ్స్, సూడో పోలీసు, దృష్టి మళ్లించి దండుకోవడం తదితర నేరాలు చేసే ముఠాల్లో అనేకం బయటి రాష్ట్రాల నుంచే వచ్చిపోతుంటాయి. ఒకప్పుడు ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన ముఠా నగరంలో ఏ తరహా నేరాలు చేసింది అనే వివరాలు కేవలం సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)తో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల దగ్గరే అందుబాటులో ఉండేవి. దీంతో ఠాణా అధికారులు వీరిని సంప్రదించి, ఆయా నేరగాళ్ల చిరుమానాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఆస్కారం ఉండేది. ‘క్రైమ్ మ్యాపింగ్’లో ఏర్పాటు చేసిన సీసీఆర్బీ సెర్చ్‌లో నేరం స్వభావం లేదా అనుమానితుల పేర్లు తదితరాలను ఎంటర్ చేస్తే చాలు... దేశంలోని ఏ ప్రాంతంలో వారు ఉంటారు అనేది చూపిస్తుంది. ఎఫ్ఐఆర్తో పాటు ఎంట్రీలు ఈ ‘క్రైమ్ మ్యాపింగ్’ యాప్‌లోకి ఎంట్రీలన్నీ పోలీసుస్టేషన్ స్థాయిలోనే జరిగేలా ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు అందుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలోనే ఠాణాల్లో ఉండే ఈ-కాప్స్ సిబ్బంది ఆ వివరాలను క్రైమ్ మ్యాపింగ్‌లో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలోనే థిమేటిక్ క్రైమ్ మ్యాప్, క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ విభాగాల్లో సెర్చ్ చేసినప్పుడు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్లు, అవి నమోదైన తేదీలు సైతం ప్రత్యక్షమయ్యే సౌలభ్యం ఉంది. మ్యాప్‌లో దర్యాప్తు అధికారులు తమకు అవసమైన చోట కల్సర్ పెడితే.. పాప్అప్ రూపంలో అదనపు సమాచారం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ క్రైమ్ మ్యాపింగ్‌లో మరికొన్ని చేర్చవచ్చు. -
దుర్గగుడి యాప్ విడుదల
విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంలో భక్తులకు అత్యుత్తమ సేవలందించేందుకు టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం యాప్‌ను అధికారికంగా ఆయన విడుదల చేశారు. యాప్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, నిరంతరం పనిచేసేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఒకే దఫా వేలాదిమంది యాప్‌ను చూసే సమయంలో హ్యాంగ్ (అంతరాయం) కాకుండా ప్రత్యేక సర్వర్‌తో వేగవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ యాప్ ద్వారా వివిధ సేవల వివరాలతో పాటు ఏయే ప్రాంతాల్లో ఆయా సేవలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయనున్నట్లు చెప్పారు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, కేశ ఖండన, తాగునీటి వసతి, వసతి గృహాలు, సామగ్రి భద్రపరుచుకునే గదులు, చెప్పుల స్టాండ్, దుస్తులు మార్చుకునే గదులు, స్నాన ఘట్టాలు, క్యూలైన్లలోకి ప్రవేశం, నిష్ర్కమణ వంటి సేవల వివరాలు అందరికీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, అక్కడి నుంచి ఆలయానికి, ఘాట్లకు రవాణా సౌకర్యాల వివరాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రసాదాల కౌంటర్లు 20కి పెంపు... ప్రసాదాలు ఇచ్చే కౌంటర్లను గతంలో 14 ఏర్పాటు చేయగా ప్రస్తుతం వాటిని 20కి పెంచినట్లు తెలిపారు. దేవాలయంలో నిర్వహించే సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది వివరాలు, దర్శన ప్రదేశం, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ప్రదేశం, శాఖలకు చెందిన రంగుల చిహ్న వివరాలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్ నుంచి జౌౌజ్ఛ/ఝఛిటఠీటఞ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ-సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నాలుగు లైన్లలో 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1800-121-7749 సేవలను ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునే వేళలు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకు నిర్దేశించినట్లు చెప్పారు. వారు ముందుగానే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేయించుకోవాలన్నారు. ఇందుకుగాను ప్రత్యేక దర్శన టికెట్ రూ.300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సిహెచ్.నరసింగరావు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, ఎలైట్ ఎంటర్‌ప్రైజస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డెరైక్టర్ పి.రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ యాప్
- ‘ఇ-రమదాన్’ పేరిట రూపొందించిన మణిపాల్ యువకులు - సహరీ, ఇఫ్తార్ సమయాలతో పాటు సమీపంలోని మసీదుల వివరాలు లభ్యం సాక్షి, బెంగళూరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అనుసరించే ధార్మిక కార్యక్రమాల వివరాలను తెలియజేసే విధంగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. మణిపాల్‌కు చెందిన ‘తోన్సే టెక్నాలజీస్’ సంస్థ ‘ఇ-రమదాన్’ పేరిట యాప్‌ను రూపొం దించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాటించాల్సిన పద్ధతులు, ఉపవాస నియమాలు, ప్రత్యేక ప్రార్థనల వివరాలతో పాటు స్థానిక సమయాన్ని అ నుసరించి సహరీ, ఇఫ్తార్ వేళలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న మసీదుల చిరునామాలు, అక్కడికి ఎలా చేరుకోవాలనే మార్గ సూచికలు సైతం యాప్‌లో పొందుపరిచారు. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాక ఆరోగ్య సంబంధ విషయాలను సైతం పొందుపరిచారు. ఉపవాస సమయంలో ఎలాంటి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహారపదార్థాలను సహరీ, ఇఫ్తార్ సమయాల్లో తీసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలను విపులంగా వివరించారు. అంతేకాక పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్‌లో పొందుపరిచారు. ఈ రెండు భాషల్లోనే కాక త్వరలోనే అన్ని దక్షిణాది భాషల్లోనూ పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని ఈ యాప్‌లో పొందుపరిచే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. మిత్రుడితో కలిసి.... మణిపాల్‌కు చెందిన మహమ్మద్ యూనస్ రహమతుల్లా తోన్సే(26) మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం మణిపాల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో స్నాతకోత్తర(పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు. కాగా, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ఎంటర్పెన్యూర్స్గా తీర్చిదిద్దేందుకు గాను యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మణిపాల్ యూనివర్సిటీ టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా చేరిన తాన్సే సహ విద్యార్థి అయిన నిహాల్ కార్కళ(23)తో కలిసి ‘తాన్సే టెక్నాలజీస్’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నుంచే ప్రస్తుత ‘ఇ-రమదాన్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ విషయంపై యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన తాన్సే మాట్లాడుతూ....‘ప్రస్తుతం యాప్‌ల వినియోగం జీవన విధానంలో ఒక భాగమైపోయింది. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకునే యువతను ప్రధానంగా దష్టిలో పెట్టుకొని, పవిత్ర రంజాన్ మాస పవిత్రతను, ఈ మాసంలో అనుసరించాల్సిన ఆధ్యాత్మిక విధి, విధానాలను యువతకు చేరువ చేసేందుకు ‘ఇ-రమదాన్’ యాప్‌ను రూపొందించాం. యాప్‌ను విడుదల చేసిన వారంలోనే దాదాపు 2000 డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఇ-రమదాన్’(్ఛఖ్చఝ్చఛ్చీ) యాప్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు’ అని తెలిపారు. -
10వతరగతి సిలబస్‌తో ప్రత్యేక యాప్!
-
శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళలోని శబరిమల వెళ్లే యాత్రికుల కోసం ‘యాత్రి.కామ్’ సంస్థ దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ‘రైల్ యాత్రి.డాట్ ఇన్ యాప్’ను ప్రారంభించింది. ఇందులో శబరిమలైకి సంబంధించిన అన్ని వివరాలతో పాటు రైళ్ల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంటుంది. టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణ సమయంలో ఆహార పదార్థాల సరఫరా వివరాలు కూడా ఇందులో పొందుపర్చారు. స్టేషన్ నుంచి శబరి కొండకు వెళ్లే మార్గాలు, ఇందుకు అనువైన సదుపాయాల వివరాలు కూడా ఉంటాయి. -
సెల్‌ఫోన్‌తో కాల్ చేస్తే చాలు!
ప్రత్యేక యాప్ రూపకల్పనకు పోలీసు విభాగం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలు పోలీసులకు సంబంధించిన నంబర్లకు ఫోన్ చేయడం, వారి ఇబ్బందిని వివరించడం, చిరునామాలు చెప్పడం అన్ని వేళల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. వారికి ఆ వెసులుబాటు లభించే , కంగారు, టెన్షన్లో బాధితులకు ఆ ఆలోచన వచ్చే అవకాశాలు తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర పోలీసు విభాగం, కాల్ చేస్తే చాలు.. దాన్నే ఫిర్యాదుగా పరిగణించడంతో పాటు ఇతర వివరాలు తెలియజేసేలా సెల్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. వివిధ సాఫ్ట్వేర్ సంస్థలతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతోంది. మహిళలు తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ యూప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది నిత్యం కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆపదలో ఉన్న సమయంలో తమ సెల్ఫోన్లలో ఈ యూప్ కలిగిన మహిళలు.. పోలీసులు కేటాయించిన ప్రత్యేక సింగిల్ డిజిట్ నంబరుకు ఒకసారి డయల్ చేయగలిగితే చాలు. అది నేరుగా కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అవుతుంది. దుండగులు బాధితురాలి చేతిలో ఫోన్ లాక్కుని కాల్ కట్ చేయాలని, ఫోన్ స్విచాఫ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. బాధితురాలు ఫోన్లో ఎలాంటి వివరాలూ చెప్పలేకపోయినా... ఆమెతో పాటు దుండగుల మాటలు, పరిసరాలకు సంబంధించిన ప్రతి శబ్దాన్నీ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది వినగలుగుతారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి సమీపంలో ఉన్న పోలీసుస్టేషన్, గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపిస్తారు. కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది కట్ చేస్తే మాత్రమే ఆ కాల్ కట్ అవుతుంది. అలా కట్ అరుున తర్వాత మాత్రమే సదరు ఫోన్‌ను ఎవరైనా స్విచ్ఛాఫ్ చేయగలుగుతారు. ఇప్పటికే మూడు సంస్థలు ఈ తరహాలో రూపొందించిన సాఫ్ట్వేర్, యాప్స్‌ను డీజీపీ జేవీ రాముడికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారుు. అయితే ఈ యూప్‌లు కేవలం నగరాలు, పట్టణాల్లో అత్యాధునిక సెల్ఫోన్లు కలిగిన వారికి మాత్రమే ఉపయుక్తంగా ఉంటారుు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సెల్ఫోన్లు ఉపయోగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావిస్తున్న పోలీసులు.. అందరికీ అందుబాటులో ఉండే, మరింత సరళీకృత టెక్నాలజీ కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క హఠాత్తుగా, ఊహించని విధంగా ఆపదలు ఎదుర్కొనే అవకాశం గ్రామీణ ప్రాంత మహిళలకు తక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉన్నతాధికారులు పై తరహా యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కోసం ‘100’, ‘1091’ ‘199’ తరహా నంబర్లు ఉపకరిస్తాయని వారంటున్నారు. రాష్ట్ర రాజధాని గుర్తింపు, అక్కడ పోలీసు హెడ్-క్వార్టర్స్ నిర్మాణానికి స్థలం కేటాయింపు జరిగేలోపు ఈ యాప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.