రంజాన్ యాప్ | Special app for muslims | Sakshi
Sakshi News home page

రంజాన్ యాప్

Published Thu, Jun 18 2015 4:54 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

రంజాన్ యాప్ - Sakshi

రంజాన్ యాప్

- ‘ఇ-రమదాన్’ పేరిట రూపొందించిన మణిపాల్ యువకులు
- సహరీ, ఇఫ్తార్ సమయాలతో పాటు సమీపంలోని మసీదుల వివరాలు లభ్యం
సాక్షి, బెంగళూరు:
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అనుసరించే ధార్మిక కార్యక్రమాల వివరాలను తెలియజేసే విధంగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. మణిపాల్‌కు చెందిన ‘తోన్సే టెక్నాలజీస్’ సంస్థ ‘ఇ-రమదాన్’ పేరిట యాప్‌ను రూపొం దించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాటించాల్సిన పద్ధతులు, ఉపవాస నియమాలు, ప్రత్యేక ప్రార్థనల వివరాలతో పాటు స్థానిక సమయాన్ని అ నుసరించి సహరీ, ఇఫ్తార్ వేళలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న మసీదుల చిరునామాలు, అక్కడికి ఎలా చేరుకోవాలనే మార్గ సూచికలు సైతం యాప్‌లో పొందుపరిచారు. కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాక ఆరోగ్య సంబంధ విషయాలను సైతం పొందుపరిచారు.

ఉపవాస సమయంలో ఎలాంటి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహారపదార్థాలను సహరీ, ఇఫ్తార్ సమయాల్లో తీసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలను విపులంగా వివరించారు. అంతేకాక పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్‌లో పొందుపరిచారు. ఈ రెండు భాషల్లోనే కాక త్వరలోనే అన్ని దక్షిణాది భాషల్లోనూ పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని ఈ యాప్‌లో పొందుపరిచే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.
 
మిత్రుడితో కలిసి....
మణిపాల్‌కు చెందిన మహమ్మద్ యూనస్ రహమతుల్లా తోన్సే(26) మంగళూరులోని సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం మణిపాల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో స్నాతకోత్తర(పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు. కాగా, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడంతో పాటు వారిని ఎంటర్‌పెన్యూర్స్‌గా తీర్చిదిద్దేందుకు గాను యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మణిపాల్ యూనివర్సిటీ టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా చేరిన తాన్సే సహ విద్యార్థి అయిన నిహాల్ కార్కళ(23)తో కలిసి ‘తాన్సే టెక్నాలజీస్’ను ఏర్పాటు చేశారు.

ఈ సంస్థ నుంచే ప్రస్తుత ‘ఇ-రమదాన్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ విషయంపై యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన తాన్సే మాట్లాడుతూ....‘ప్రస్తుతం యాప్‌ల వినియోగం జీవన విధానంలో ఒక భాగమైపోయింది. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకునే యువతను ప్రధానంగా దష్టిలో పెట్టుకొని, పవిత్ర రంజాన్ మాస పవిత్రతను, ఈ మాసంలో అనుసరించాల్సిన ఆధ్యాత్మిక విధి, విధానాలను యువతకు చేరువ చేసేందుకు ‘ఇ-రమదాన్’ యాప్‌ను రూపొందించాం. యాప్‌ను విడుదల చేసిన వారంలోనే దాదాపు 2000 డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. గూగుల్  ప్లే స్టోర్ నుంచి ‘ఇ-రమదాన్’(్ఛఖ్చఝ్చఛ్చీ) యాప్‌ను ఎవరైనా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’ అని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement